Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna
- Mir-41-Anugraham-1-by-Lakshmi-Prasanna 6:05
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – గీతాంజలి
సాయి సోదరి గీతాంజలి గారు తనకు బాబా ప్రసాదించిన లీలను మనతో పంచుకుంటున్నారు.
నేను రాస్తున్న అనుభవం చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి పాఠకులని కాస్త ఓపికగా చదువవలసినదిగా కోరుతున్నాను.
మెదటి లీల
మా షిరిడీ యాత్రలోని అన్ని సంఘటనలలో ఏదీ మర్చిపోకుండా రాయడానికే ప్రయత్నించాను. ఈ లీలను చదివే పాఠకులందరికీ బాబా వారి అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాను.
బాబా, నీ లీలను రాసేటంతటి తెలివిగలదానిని కాను. అందుచేత, బాబా! నువ్వే నా చేతిని పట్టుకుని నీ లీలను నువ్వే వ్రాయించుకో!
పాఠకులారా! ఫిబ్రవరి నెలలో నా భర్త స్నేహితుడైన శ్రీ స్వామి అనే ఆయన మా యింటికి వచ్చారు. ఆయన, ఆయన భార్య కలిసి షిరిడీ వెడదామనే ఉద్దేశ్యంలో ఉన్నట్లు చెప్పారు.
వారు షిరిడీ వెళ్ళడం ఇదే మొదటిసారి కనక, నావద్ద నుండి షిరిడీ గురించిన సమాచారాన్ని తెలుసుకోవాలని వచ్చారు.
ఏప్రిల్ నెల వరకు టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయనీ, అందుచేత వారు తత్కాల్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని చెప్పాను.
లేకపోతే పూనా వరకు విమానంలో వెళ్ళి అక్కడినుంచి బస్ లో గాని, టాక్సీలో గాని షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చాను. ఆయనకీ విషయం చెపుతున్నపుడే నాకు కూడా షిరిడీ వెళ్ళాలనే కోరిక కలిగింది.
స్వామి గారు తాము రైలులోనే షిరిడీ వెడదామని అనుకుంటున్నట్లు చెప్పి, మే నెలవరకూ ఆగి అప్పుడు టికెట్స్ బుక్ చేసుకుంటామని చెప్పారు. నేను మౌనంగా ఊరుకున్నాను.
ఇప్పుడు చూడండి, పరిణామాలు ఎలా మార్పు చెందాయో. సాయి సచ్చరిత్రలో చెప్పినట్లుగా బాబా పిలుపు వుంటే తన భక్తులను తన వద్దకు రప్పించుకోవడానికి ఆయనే మార్గం చూపిస్తారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది.
స్వామి గారు మా యింటికి మొదటిసారి వచ్చిన రెండురోజుల తరువాత మరలా మా యింటికి వచ్చారు. స్వామిగారు, తనకు బజారులో తన చిన్ననాటి స్నేహితుడు కనిపించాడని చెప్పారు.
అతని మామగారు రైల్వేలో పనిచేస్తున్నారనీ, తన మామగారి ద్వారా టికెట్స్ తెప్పించి పెడతానని చెప్పాడనీ చెప్పారు.
అందుచేత ఇప్పుడు తాను షిరిడీలో వసతి గురించీ, దర్శనం గురించిన విషయాలను అడగడానికి మా యింటికి వచ్చారు. ఇదంతా వినేటప్పటికి నాకు కూడా ప్రేరణ కలిగింది.
నేను నా భర్తతో, “నేను కూడా షిరిడీ వెళ్ళనా” అని అడిగాను. “నీకు వెళ్ళాలని ఉంటే నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాలేను, నన్ను అడగకు” అన్నారు.
ఆయన స్నేహితుడు ఇది విని, “మీరు వస్తే మాకింకా సంతోషం” అని నన్ను ఉద్దేశింఛి అన్నారు. నేనింతకు ముందు ఒకసారి షిరిడీ వెళ్ళి ఉండటంతో వారికి ఎటువంటి కష్టమూ ఉండదు.
నిజానికి నాకెంతో ఉత్సాహంగా ఉంది, కాని నా భర్త లేకుండా నాకు వెళ్ళాలనిపించక సందిగ్ధావస్థలో పడ్డాను. అందుచేత స్వామిగారితో, నేను ఆలోచించుకుని ఏవిషయం ఒకరోజులో చెపుతానని చెప్పాను.
ఈలోగా స్వామి గారి భార్య కూడా వచ్చి, తమతోపాటు షిరిడీ రమ్మనమని బ్రతిమాలింది. మా అత్తమామలని అడిగి అప్పుడు చెపుతానని చెప్పాను ఆవిడకి.
నేను మా అత్తగారిని అడిగాను. అందుకావిడ “నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు, కాని ఒంటరిగా మాత్రం వెళ్ళకు, నీతోపాటుగా వెళ్ళమని నీ భర్తకు చెపుతాను” అన్నారు.
ఏమయినప్పటికీ స్వామిగారి స్నేహితుని మామగారు మాకు ఎన్ని టిక్కెట్లు ఇప్పించగలరు అన్నదే ప్రశ్న.
నేను నాభర్తతో, “తెప్పిస్తే కనుక 4 టిక్కెట్లూ తెప్పించమనండి లేకపోతే మీ స్నేహితుడిని, అతని భార్యనే షిరిడి వెళ్ళమని మీ స్నేహితునికి చెప్పండి. బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెడదాము మనం” అన్నాను.
నా భర్త అప్పటికే తన స్నేహితునితో 3 టిక్కెట్లు బుక్ చేయమని చెప్పారట. అందుచేత నన్ను ఇంక వెనక్కి తగ్గవద్దని చెప్పారు. నన్ను షిరిడీ వెళ్ళి చక్కగా బాబా దర్శనం చేసుకుని రమ్మని చెప్పారు.
ఈ సంభాషణంతా మంగళవారమునాడు జరిగింది, మేము అనుకున్న ప్రకారం మేము గురువారం రాత్రి బయలుదేరాలి.
బుధవారం రాత్రి నా భర్త నాకు టికెట్ బుక్ అయిందనీ, నన్ను మరునాడు వాళ్ళతో షిరిడీకి బయలుదేరమని చెప్పారు.
నా భర్త లేకుండా నాకు వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టంలేదు. నేను స్వామిగారితో నా టిక్కెట్టు కాన్సిల్ చేయమనీ, నేను రాలేకపోతున్నందుకు క్షమించమని స్వయంగా చెప్పాను.
“అయితే నీ భర్త ఒక్కరే షిరిడీ రావాలన్నమాట” అని స్వామిగారు అన్నారు. నా భర్త నాతో ఇదంతా నవ్వులాటకి అన్నారు. నిజానికి తనకు కూడా టిక్కెట్టు బుక్ చేయించుకున్నారు.
బాబా దర్శనం ఒక్కటే కాదు, నేను నా భర్తతో కలిసి షిరిడీ వెడుతున్నందుకు ఎంతో సంతోషం కలిగింది.
ఆన్ లైన్ ద్వారా మేము దర్శనానికి, ఆరతికి బుక్ చేసుకున్నాము. కాని మాకు ద్వారావతిలో బస దొరకలేదు. షిరిడీ వెళ్ళాక బస సంగతి చూసుకోవచ్చులే అనుకున్నాము.
మా ప్రయాణం ప్రకారం మా రైలు శుక్రవారం మధ్యాహ్నానికి షిరిడీ చేరుతుంది, తిరుగు ప్రయాణంలో మేము కోపర్గాఁవ్ నుంచి శనివారం సాయంత్రం రైలుకు బయలుదేరాలి. బాబా దయవల్ల,
మేము ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మా దగ్గర వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ప్రయాణానికి సంబంధించిన టిక్కెట్లు ఉన్నాయి. ఇది మెదటి లీల.
(రేపు తరువాయి భాగం)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – రెండవ భాగం–Audio
- షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – ఐదవ భాగం
- షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – మూడవ భాగం–Audio
- షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – నాల్గవ భాగం
- ఎన్నో సాయి లీలలతో మరచిపోలేని మా షిరిడీ యాత్ర మొదటి భాగం…
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments