Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా గారు 2008లో మేము చేసిన చిన్న యాత్రలో తమ అపారమైన కరుణాకటాక్షాలను మామీద వర్షించారు. నేను ఈ లీలలన్నిటినీ సమగ్రంగా మీకు అందించగలనో లేదో నాకు తెలియదు. బాబా! ఒకవేళ ఏమయినా మరచిపోతే కనుక నన్ను మన్నించు.
నేను, మా కుటుంబము తేది 06.11.2008న షిరిడీ వెళ్ళాము. నాడు గురువారము. మొత్తం ఈ లీల అంతా యిక్కడ నుంచే ప్రారంభమయింది. గురువారము నాడు రాత్రి 11.50 కి మా రైలు. ఇంటి నుంచి బయలుదేరే ముందు నాకు చాలా ఆత్రుతగా ఉంది. బాబా ముందు దీపాలు వెలిగించాను. బాబా గారిని మాతో కూడా షిరిడీ వరకు వచ్చి, ఆయన సూచనల ప్రకారం నేను తయారు చేసిన శాలువా, చద్దార్ స్వీకరించమని కోరి ప్రార్థించాను. నేను బాబా గారికి మంచి నీరు యిచ్చి స్టేషనుకు బయలుదేరాము.
మేము యెక్కవలసిన రైలు అప్పటికే సిథ్థంగా వుంది. మేము లోపలికి వెళ్ళి మా సామానంతా లోపల పెట్టాము. రైలు కదలడానికి యింకా 20 నిమిషములు సమయం ఉంది. నా భర్త, తోటి ప్రయాణీకులు యింకా సద్దుకు కూర్చోవడానికి వీలుగా నన్ను బయటకు రమ్మన్నారు. అందుచేత మేము రైలు దిగి బయటకు వచ్చాము.
ప్లాట్ ఫారం మీద మినరల్ వాటరు, పళ్ళరసాలు అమ్మే షాపుని చూశాము. నాకు చాలా దాహంగా ఉండి, ఆ షాపు వద్దకు వెళ్ళాను. షాపు చిన్నదైనా అన్నీ చాలా చక్కగా సర్ధబడి ఉన్నాయి. వాటర్ బాటిల్ తీసుకుని డబ్బు యివ్వబోతూ షాపులో ఉన్న అందమైన బాబా ఫోటో చూశాను. బాబా మొహంలో చిరునవ్వు కనపడింది. బాబాగారు మాతో కూడా షిరిడీ వస్తున్నట్లుగా నాకు సూచన అందింది. నాకు చాలా అనందము వేసి, బాబా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను.
మేము 7తేది ఉదయం 5 గం.లకు ఢిల్లీ చేరాము. మా తరువాతి రైలు ఉదయం 10.30కి. యింకా 5 గంటల సమయం ఉంది. మేము ఢిల్లీ స్టేషన్ లో మా తరువాతి రైలు కోసం కూర్చున్నాము. అప్పుడు ఒక ముసలి ఫకీరు, పసుపు పచ్చ లాల్చీ తెల్లని థోవతి థరించి కఱ్ఱ సహాయంతో నడుస్తూ వచ్చాడు. అతనిని నేను చాలా సేపటి నుంచి, గమనిస్తూ వున్నాను.
అతను యెవ్వరినీ డబ్బు ఆడగలేదు. యెవరితోనూ మాట్లాడలేదు కాని, అతను మా దగ్గరకు వచ్చి డబ్బు ఆడిగాడు. నా భర్త 10/- రూ. యిచ్చారు. ఆ ఫకీరు సంతోషంతో నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నా దృష్టి యింకా అతని మీదే ఉంది, కాని, హటాత్తుగా క్షణకాలంలో అతను మాయమయిపోయాడు.
అప్పుడే ఇంకా తెలతెలవారుతున్న ఉదయం మూలాన, యెక్కువ మంది జనం లేరు. అటువంటప్పుడు ఈ ఫకీరు ఎలా మాయమయిపోయాడు? నాకు అర్థమైంది. ఆయన బాబాగారే! నేను వున్నాను అని నిరూపించడానికి వచ్చారు.
ఈ సంఘటన తరువాత మేము ఆర్మీ వారు వేచియుండే గదిలోకి వెళ్ళి, మాతరువాతి రైలుకు చాలా సమయం ఉండటంతో అక్కడే గడిపాము. మా రైలుకి 1.30 గంటలు ఆలశ్యం ఉందని తెలిసింది. ఇది వినేటప్పటికి నాకు చాలా నిరాశ కలిగింది. కాని, యేదీ నాచేతిలో లేదు. చివరికి మా రైలు ఉదయం 11.45 కి బయలుదేరింది.
మా ప్రయాణం ప్లాన్ ప్రకారం, మేము పూనా వెడతాము. ఆక్కడ నా భర్త స్నేహితుడు, భార్య కూడా మాతోపాటు షిరిడీ వస్తారు. ఈ ప్లాన్ ప్రకారం మేము రిజర్వేషన్స్ చేసుకున్నాము. మరునాడు ప్రొద్దున్న నవంబరు 8న మా రైలు 10 గంటలకి మన్మాడ్ చేరుకుంది. మన్మాడ్ స్టేషన్ చేరుకునేటప్పటికి నేనింకా నిద్రలో ఉన్నాను. నా భర్త నన్నులేపి మన్మాడ్ వచ్చింది చూడు అని చెప్పారు.
నేను చాలా సంతోషించాను, యెందుకంటే సచ్చరిత్రలో మన్మాడ్ గురించిన కథలు చాలా చదివాను. మన్మాడ్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరింది. 5 నిమిషాల తరువాత మరలా ఆగిపోయింది. సిగ్నల్ ప్రోబ్లం వల్ల అయిఉండవచ్చు. నేను బయటకు చూస్తున్నాను. హటాత్తుగా నేను ఒక పీర్ బాబా యొక్క సమాథిని చూశాను. దాని మీద ఆరంజ్ రంగు శాలువా ఉంది.
నాకు చాలా థ్రిల్లింగా అనిపించింది, యెందుకంటే నేను కూడా బాబాగారికి ఆరంజ్ రంగు శాలువానే సమర్పిస్తున్నాను.
రేపు తరువాయి భాగం…
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఎన్నో సాయి లీలలతో మరచిపోలేని మా షిరిడీ యాత్ర మూడవ భాగం…
- ఎన్నో సాయి లీలలతో మరచిపోలేని మా షిరిడీ యాత్ర రెండవ భాగం…
- షిరిడీ యాత్ర అనుభవం – ఇచ్చిన మాట మరవద్దు
- షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – మొదటి భాగం–Audio
- స్థోమత లేకపోయినా షిరిడీ యాత్ర చేయించిన బాబా !
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments