ఎన్నో సాయి లీలలతో మరచిపోలేని మా షిరిడీ యాత్ర మూడవ భాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నిన్నటి తరువాయి భాగం….

ఆయనతో “సర్, నేను స్వయంగా, ఈ శాలువాను తయారు చేసి, దాని మీద 108 సాయినామాలు రాశాను. దీనిని బాబా గారికి సమర్పించాలనుకుంటున్నాను” అని చెప్పాను. ఆయన నుంచుని, నా శాలువా చూశారు. నాకు లోపల భయంగా వుంది ఆయన ఒప్పుకోరేమోనని.

“చాలా అందంగా తయారు చేశావమ్మా! తప్పకుండా బాబా గారికి వేస్తాము” అనేటప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది. కాని, చాలా వైటింగ్ లిస్ట్ ఉన్నందున బహుశా ఒక నెల తరువాత వేస్తారేమో అనుకున్నాను. “సర్!, ఇది బాబా గారికి యెప్పుడు వేస్తారో చెబుతారా?” అని అడిగాను.

ఆయన నవ్వి, “ఈ రోజు సాయంత్రం” అన్నారు. నా గుండె ఆగినట్లయింది అది వినేటప్పటికి. నాసంతోషానికి అవథులు లేవు. మరలా కన్నీరు  ఉబికి  రావడం ప్రారంభమయింది. నేను ఆఫీసు బయటకు వచ్చి మరలా బాబా గారి ముందుకు వచ్చాను. బాబా గారు నాకు, నా కుటుంబం మీద యింతటి కరుణామృతాన్ని కురిపిస్త్తున్ననందులకు కృతజ్ణతలు తెలుపుకున్నాను.

నేను బయటకు వచ్చి హోటల్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. చూసే వారంతా యేమిటి ఈవిడ యిలా పరిగెడుతూ వెడుతోంది అనుకున్నారు. కాని, నేను దేనినీ లక్ష్య పెట్టలేదు. యెందుకంటే నేను సాయి ప్రపంచంలో విహరిస్తున్నాను. నా కన్నులు బాబాని మాత్రమే చూస్తున్నాయి మరివేటినీ కాదు.

నేను హోటలుకు వెళ్ళి బాబా గారికి శాలువా ఈ రోజు సాయంత్రమే వేస్తున్నారని చెప్పాను. నా భర్త కూడా ఆశ్చర్యపోయి జోక్ చెయ్యద్దన్నారు. ఇది నమ్మడానికి ఆయనకి కొంత సమయం పట్టింది. బాబా గారికి శేజ్ ఆరతికి వేస్తున్నారు అని చెప్పాను. 2.30 కి మేము సమాథి మందిరంలోనికి వెళ్ళాము. నేను బాబా గారిని శాలువాలో యెప్పుడు చూద్దామా అనే ఆత్రుతలో నిలవలేకుండా ఉన్నాను.

ఇంకా రెండు వందల మంది భక్తులు పంపిన కోరికలు ఉన్న లిస్ట్ బాబా గారికి నివేదించడానికి సమాథి మందిరంలోకి వెళ్ళాము.  నేను  సమర్పించిన శాలువాలో బాబా గారిని చూసి చాలా థ్రిల్అయ్యాను. నా శరీరమంతా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నా దృష్టి అంతా వెలుగుతో నిండిన నా సద్గురు సాయి నాథుని మీదే కేంద్రీకృతమయింది. బాబా గారి వదనం చిరునవ్వులు చిందిస్తూ నావైపు చూస్తున్నట్లుగా అనుభూతి చెందాను.

బాబా గారు ఆరతికి మొట్ట మొదట ఉన్న 10 మందిలో మమ్మలిని నిలబెట్టారు. నేను నా దైవమైన బాబా గారిని సంతోషంలో ఆనంద భాష్పాలతో, ప్రేమ, భక్తి లతో కనులార వీక్షించగలిగాను. మేము ఆరతిని పూర్తిగా బాబా గారికి చాలా దగ్గిరగానుంచుని చూశాము. అయిన తరువాత మేము వస్తుండగా పూజారిగారు, బాబా గారి సమాథి నుండి ఒక పెద్ద దండను తీసి ఇచ్చారు. నేనిచ్చిన ప్రేయర్స్ కూడా బాబాగారి సమాథి మీద పెట్టారు. బాబా గారు తమ బిడ్డల యొక్క ప్రేయర్స్ ను అంగీకరించినందుకు చాలా సంతోషించాను.

ఇంతమంది ఉండగా పూజారిగారు, దండను నాకే ఎందుకిచ్చారు అని ఆలోచించాను. ఈ ప్రశ్న నామదిలో తేలుతూఉంది. అప్పుడు నాకనిపించింది, అవును, బాబాగారు నన్ను ఆశీర్వదించారు.

రాత్రి నేను 10 గంటలకు సచ్చరిత్ర చదవడానికి ద్వారకామాయికి వెళ్ళాను. హటాత్తుగా 1.00 గంటకి ఒక పిల్లి వచ్చి నా ఒడిలో ఉన్న సచ్చరిత్రమీద కూర్చుంది. అప్పుడు నేను 189 పేజీ చదువుతున్నాను. ఆ పిల్లి దాదాపు ఒక గంట సేపటి వరకు కూర్చుని, కిందకి దిగి, బాబా ఫోటో ముందు కూర్చుంది. పిల్లి యెవరి వద్దకూ వెళ్ళకుండా బాబా ఫోటొ వంకే చూస్తూ ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

ఆ రాత్రి అక్కడ దాదాపు 15 మంది ద్వారకా మాయిలో కూర్చుని ఉన్నారు. వారిలో చాలా మంది పిల్లిని రమ్మని పిలిచినా అది యెవరి వద్దకూ వెళ్ళలేదు. మళ్ళీ, మళ్ళీ, నా కళ్ళు ఆ పిల్లినే చూస్తున్నాయి. కాని నేను పుస్తకాన్ని పూర్తి చేయవలసి ఉంది. అందుచేత చదువు మీదే దృష్టిపెట్టాను.

45 నిమిషములలో నేను చరిత్రలో 215 పేజీ చదువుతున్నప్పుడు, పిల్లి మళ్ళీ వచ్చి, నా ఒడిలోఉన్న సచ్చరిత్ర మీద కూర్చుంది. అది ఆ రాత్రంతా నాఒడిలో అల్లా కూర్చునే ఉంది. ఇక ప్రొద్దున్న4 గంటలకు ఉదయం ఆరతికి ముందు అది లేచి మరలా బాబా ఫోటో దగ్గరకు వెళ్ళింది. అప్పుడు అక్కడున్న చాలా మంది చెప్పారు “అది బాబా గారి పిల్లి, అది యెవరి ఒళ్ళోనూ కూర్చోదు” అని.  బాబా గారు నన్ను ఇంకా ఆశీర్వదిస్తున్నందుకు చాలా సంతోషించాను.

నేను యిప్పుడు తిరిగి హోటలికి వెళ్ళి ఫలహారం చేసి, మరలా సమాథి మందిరానికి సచ్చరిత్ర పుస్తకాలు కొనడానికి వెళ్ళాము. మేము పుస్తకాలు కొన్న తరువాత సమాథులు చూడటానికి వెళ్ళాము. నేను మొదటి సమాథి వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వస్తూండగా, నా బూట్ల దగ్గర 800/- రూపాయలు పడి ఉండటం చూశాను. అక్కడ చాలా మంది ఉన్నారు. ఈ 800/- ఇక్కడ ఎలా పడి ఉన్నాయి? అంతమందిలో ఎవరూ చూడలేదా?

బాబా గారు నాకు, తమ దీవెనలను ఎన్నో విథాలుగా అందిస్తున్నారు. నేను మాటలలోవర్ణించలేను. మా షిరిడీ యాత్ర అంతా కూడా చమత్కారాలతో, బాబా లీలలతో నిండిపోయింది.

నా పరమపిత పరమేశ్వర్ సాయినాథ్ మహరాజ్ ని వర్ణించడానికి నేను మాటలని వెదుక్కోవలసి వస్తోంది. బాబా గారు నిజంగా తమ అపరిమితమైన దీవెనలను మా షిరిడీ యాత్రలోమాకందించారు. మాలాంటి వారు రోజుకి 100 తప్పులు చేసినా కూడా బాబా గారు తమ పరిథిని దాటి ఆశీస్సులు, అందచేస్తూ ఉంటారు. బాబా గారి మీద నా ప్రేమను నేను వ్యక్తం చేయలేను. కాని అది ఆయనకే తెలుసు. ఈ షిరిడీ యాత్ర నా మదిలో చెరగని ముద్ర వేసింది. నా కనిపిస్తోంది, ఇది చాలు ఈ మథుర క్షణాలు నా జీవితంలో కలకాలం ఉండిపోతాయి.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles