బాబా భోదామృతం (శ్రీసంత కథామృతం 57వ అధ్యాయం) పదవ భాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ గణేశాయనమః. ఓ చిత్స్వరూపా! లంభోధరా! అద్యమూర్తీ! ఉదారా! నా చేతిని పట్టుకుని త్వరగా ఈ గ్రంధాన్ని రచింపచేయి. శ్రోతలారా! వినండి. సంత కథామృతమను ఈ గ్రంధం సాక్షాత్తు వసంత ఋతువు. సత్పురుషుల కథలు మామిడి వృక్షాలు. పద్య రచన అనే కొమ్మలకు భోధ రూపంలో ఫలాలున్నాయి. దీనిని సేవించటానికి మీరు కోకిల లవ్వండి. మానస సరోవరం వంటి ఈ గ్రంధంలో పద్య రచనయే నీరు. సారంలో వికసించిన కమలమే సత్పురుషుని కథ. ఈ కమలంలో భోధ రూపంలో మకరందం ఉంది. ఈ భోదామృతాన్ని సేవించడానికి, మీరంతా భ్రమరాలవండి.

భక్తలీలామృతమనే గ్రంధంలో నేనిదివరకు 31, 32, 33 అధ్యాయాలలో శిరిడి గ్రామంలో నివసించిన శ్రీ సాయినాధుని కొన్ని విషయాలు వర్ణించాను. వారు భక్తులకు కల్పవృక్షం. మహా ఉదారులు. దయాసాగరులు. వారు భవసాగరాన్ని దాటింప చేసే నౌక. అంతేకాదు జ్ఞాన భండారం.

భక్తవత్సలుడైన ఆ సాయి సమర్ధుని దర్శనానికి భక్తులు పుష్యమాసంలోని ఉత్తమ ధనుసంక్రమణ పర్వదినాన వచ్చారు. ఈ ధనుసంక్రాంతి మకర సంక్రాంతి కంటే శ్రేష్ఠమైన పర్వదినం కాదు కదా! మరి భక్తులేందుకు అక్కడికి వచ్చారని మీకు సందేహంగా ఉంది కదూ. ధనుసంక్రాంతి రోజు భక్తులు బాల భాస్కరునికి నైవేద్యన్నర్పించి ఉదయాన్నే భోంచేస్తారు. అందుచేత, అమితమైన చలిలో వణికి పోతూ భక్తీ రూపమైన బండిలో సద్గురువును సందర్శించు కోవలెనని భక్తులు శ్రీఘ్రంగా బయలుదేరారు.

ఉదయగిరి వంటి శిరిడి లో, సాయి మహారాజు బాల భాస్కరుని వలె ఉండయించాడని, ప్రభాత సమయాన సాయి కృపా గంగలో శ్రద్ధగా స్నానం చేసి సాయి సమర్ధుని దర్శనానికి వెళ్లారు. సాయి ఉత్తమమైన జ్ఞానంతో పక్వాన్నాలు తయారుచేసి, భక్తులకై విస్తర్లలో భోజనం ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచారు. అక్కడ ధనుర్మాసమదే. అందువల్ల భక్తులు ఆ పర్వదినం అక్కడ భోజనం చేయాలనే కోరికతో పరుగు పరుగున వచ్చారు.

ధీరుడు, ఉదారుడు, సజ్జనుడు, గోవిన్దత్మజుడు, మరియు శుచిర్భూతుడు, మహా కర్మఠుడు, వేద శాస్త్రాలలో అత్యంత నిష్ఠ గల హరిపంతు, బేరె. నానా, నిమోంకర్, లక్ష్మణమారుతి మొదలగు మహా భక్తులు మశీదులో సభ కూడి కన్నతల్లి కనిపించగా ఆనందించే పసి పిల్లలవలె అత్యంత ఆహ్లాదంగా కూర్చున్నారు. అప్పుడు నానా తన రెండు చేతులు జోడించి నేనిదివరకు మిమ్మల్ని అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు(బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 31) మొదటి భాగం….). సాయి సర్వేశ్వరా! మాపై కోపగించారా? సాయి దేవా! దేవుడసలు ఎవరు? ఎక్కడుంటాడు? ఎట్లుంటాడు? ఎట్లా లభిస్తాడు? మాకు టేలియచేయండని కోరారు.

సాయి మహారాజు “నానా! మీరంతా నా బిడ్డలు. నేనెవరిని కోపగించాను. శ్రీవెంకుశా ఉంటే మీరు నాపై అలుక వహించే విధంగా వారిపై అలిగేవాణ్ణి. సరే, నేనిది వరకు (రెండు అధ్యాయాలలో) చెప్పాను కదా! దానిని బాగా గుర్తుకు తెచ్చుకో. ఆ జ్ఞానాన్ని పంట పట్టించుకుంటే సాధన చతుష్టయ సంపద లభిస్తుంది.

సాధన చతుష్టయ సంపన్నుడైన శిష్యునికే బ్రహ్మజ్ఞానాన్ని భోదించి అతన్ని ఉద్ధరించాలి. సిద్ధిని సాధించటానికి పెద్దలు ఉపాయాలు చెప్పారు. వానిని సాధనోపాయాలని అంటారు. ఈ విషయాలు చాలా కఠినమైనవి అందువల్ల ఏకాగ్రమనసుతో శ్రద్ధగా విను. సాధన చతుష్టయం అంటే 1. నిత్యానిత్య వస్తు వివేకం, 2. ఇహలోక పరలోక సుఖాల యందు వైరాగ్యం, 3. శమదమాదిషట్ సంపత్తి, 4. ముముక్షుత్త్వం.

మొదటి సాధనా వ్యాఖ్య విను – మనసులో యెల్లప్పుదూ బ్రహ్మయే సత్యం జగన్మిధ్య అన్న భావముండాలి. దాంభికులు అనేక రకాల వేషాలతో వివేకులవలె కపట నాటక మాడి జనులను మోసగిస్తారు. ఒకడు యాత్రికుణ్ణని గొప్ప చెప్పుకుంటాడు. వినోదంగా విహారాలకు వెళ్ళినట్లుగా పండరీ పురానికి వెళ్లి వస్తాడు. ఆ పండరీ యత్రైనా శ్రద్ధగా చేయరు.

అసలా యాత్ర ఉద్దేశం – అమాయక ప్రజలు భక్తులుగా గౌరవించాలని. అంతే కాని ఏ ఒక్కడైనా ఆ పరమాత్మ ఎవరు? ఎలా ఉంటాడు? అసలేక్కడుంటాడని ఎరుగరు. లెక్కలేనన్ని గ్రంధాలూ పఠించినా వారి అంతరంగం పరిశుద్ధమవదు. అయినా ఇతరులకు మాత్రం ఉపదేశాలిస్తుంటారు. అట్టివారు జ్ఞాన సరోవరంలొని కప్పలు. వారు మకరందాన్ని వదిలి, వాదవివాదాలనే బురదను సేవిస్తారు. పరులను నిందిస్తూ తమ గోప్పలను ప్రకటించుకునే వారు వివేకవంతులు కారు. వారు బ్రహ్మజ్ఞానానికి పాత్రులు కారు.

ఇంకా ఉంది…

source: దాసగణు గారి రచన  శ్రీసంత కథామృతం 57వ అధ్యాయం

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా భోదామృతం (శ్రీసంత కథామృతం 57వ అధ్యాయం) పదవ భాగం….

Maruthi

saibaba…saibaba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles