బాబా భోదామృతం (శ్రీసంత కథామృతం 57వ అధ్యాయం) పన్నెండవ భాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నిన్నటి తరువాయి భాగం….

నానా “సద్గురు నాధా! సర్వ వ్యాపక బ్రహ్మ క్లేశరహితమని, ఆనందరూపమని, ఆ బ్రహ్మే అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నాడని, అన్ని పాత్రలలో నటిస్తున్నాడని అంటున్నారు కదా. ఇక్కడ నాకో సందేహం. దాన్ని నివృత్తి చేయండి దేవా! జగమంతా క్లేశ యుక్తం. అట్లే అనంతం. చైతన్య గుణాలు దానిలో అనుభవం కావు.

పుట్టుగ్రుడ్డి సృష్టి లావణ్యాన్ని ఎలా చూడగలడు? సత్యమైన చైతన్యం మిధ్యా జగత్తులో ఎలా ఉండగలదు? ఆత్మయే చైతన్యమనుకుంటే ఆత్మ అంతటా ఒక్కటే అన్నది పొరపాటు. ఆత్మ అనేకం. అన్యోన్యంగా ఉన్నవారికైనా తమ తమ ఆత్మల యొక్క సుఖదుఖాల అనుభవాలు పరస్పరం కలగటం లేదు. అలాంటప్పుడు అందరిలో ఉన్నది ఒకే ఆత్మ, ఒకే చైతన్యమని ఎలా అనగలం? శరీరాలు భిన్న భిన్నంగా ఉన్నట్లే ఆత్మ కూడా విభిన్నంగా ఉండాలి కదా! ఆత్మ చైతన్యం కంటే వేరు ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకు? అని అడిగారు.

బాబా “నానా నువ్విక్కడ పొరపడుతున్నావు. నేను చెప్పేది ఏకగ్ర మనసుతో శ్రద్ధగా విను. ఎరుపు, తెలుపు, నలుపు మరియు మిశ్రమ రంగులు నీలం పసుపు ఆకుపచ్చ నేరేడు పండు రంగు వీనిని విడి విడిగా నీళ్ళలో వేసి వేరు వేరు పాత్రలలో నింపి ఉంచినా, వెఱ్రివాడా! నీరు ఒక్కటే కదా, నీరు నేరు వేరుగా ఎలా ఉండుంది?

ఎరుపు రంగులో కలసి ఎర్రగానూ, పసుపు రంగుతో కలసి పుసుపుగా కనిపిస్తుంది. రంగుతో మిశ్రమం చేసిన నీరును ఎరుపు, పసుపు రంగులు పోయి వట్టి నీరే మిగులుతుంది. అట్లే ఆత్మ హృదయం ఒక్కటిగా ఉన్నప్పుడు సుఖదుఃఖాలు అనుభవానికి వస్తుంటాయి. అనేక మానవులకు అనేక హృదయలున్నా వాని అన్నింటిలోనూ సత్యంగా ఒకే ఆత్మ అభేదంగా ఉంది.

సుఖదుఃఖాలు హృదయానికి మాత్రమే, ఆత్మకు కాదు. కళ్ళకు కన్పించే హృదయం అసలు హృదయం కాదు. అది బావాలుప్పొంగే పేటిక మాత్రమే. ఆత్మ ఒక్కటే చైతన్యం. ఆత్మ కారణంగానే హృదయంలోని భావ పరంపరలు. వత్సా! ఆ ఆత్మను గుర్తించు. నీకు బాగా అర్ధమవటానికి, ఈ విషయాన్ని విడమర్చి విపులంగా చెప్పుతాను విను.

పారమర్ధికం, వ్యావహారికం, ప్రాతి భాసికమని చైతన్యం త్రిగుణాత్మకం. ఒకే శరీరానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యాలున్నట్లే, చైతన్యం మూడు రకాలుగా ఉంటుంది.

పారమార్థిక చైతన్యంతో ఉన్న ఆత్మ చాల యోగ్యత గలది. ఇది సాధువుల యందుండే ఆత్మ. యోగ్యమైన చేయదగిన పనులను, నిషిద్ద కర్మలను బాగా తెలుసుకుని శాస్త్రానుసారంగా ప్రవర్తించే వారి యందు వ్యావహారిక చైతన్యముంటుంది. అజ్ఞానం కారణంగా అసత్యాన్ని సత్యంగా భావించే వారి యందు ప్రాతిభాసిక చైతన్యముంటుంది. ఈ చైతన్యం ఉన్న అజ్ఞానునికి, వ్యావహారిక చైతన్యం ఉన్న సజ్జనునికి పారమార్ధిక చైతన్యం ఉన్న సాధువునకు ఈ ముగ్గురికి కారణం ఆత్మయే.

రాజు, మంత్రి, రాజదూత ఈ ముగ్గరిలో రాజ్య సత్తాయే ఐనా వీరిలో భిన్నత్వం లెదూ? రాజు అసీనుడవటానికి సింహాసనం, ఏనుగు, పల్లకీ వాహనాలు. రాజు తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాగలడు. రాజాజ్ఞను అనుసరించి మంత్రులు అధికార వర్గం వ్యవహరిస్తారు. రాజు యొక్క ఇచ్చానుసారమే అందరు నడుచుకోవాల్సి ఉంటుంది. తమ తమ ఇచ్చలకు అనుగుణంగా ప్రవర్తించడానికి వారికీ అధికారం ఉండదు.

ప్రభుత్వం యొక్క రాజ్య పాలన అనే ఆవరణలోనే ప్రజలంతా వ్యవహరించాల్సి ఉంటుంది. దీనికి కారణం ప్రభుత్వం. రాజు, మంత్రులు, రాజదూత, ప్రజా వీరందరికీ అవలంబనం ప్రభుత్వం. రాజు, అధికారి, ప్రజ వీరందరి కంటే ప్రభుత్వం భిన్నంగా ఉంటుంది. ఒక రాజు మరణిస్తే రాజ్యసత్తా నశించిపోదు. ప్రభుత్వం, అధికారి భిన్నంగా కన్పిస్తాయి. కాని ప్రభుత్వంతో తాదాత్మ్యం చెందటం వలన అధికారి, ప్రభుత్వపు సత్తాగ మారిపోతాడు.

ప్రభుత్వమెప్పుడూ ఏ పని చేయదు. అయినా ప్రభుత్వం యొక్క అస్తిత్వంలో అన్ని పనులు జరుగుతుంటాయి. నువ్వు కూర్చున్న సీటు బలం ప్రభుత్వం పదవి వల్లనే. నీ బంట్రోతులు నీకు సేవలు చేయడం కూడా, ప్రభుత్వం యొక్క పదవి వల్లనే. నీ బంట్రోతుకు నీకు మీ ఉభయుల పదవులకు కారణం ప్రభుత్వం. 

ప్రభుత్వం యొక్క సంపూర్ణ అధికార లాంచనాలను రాజు పొందుతాడు. అధికారులు కొంత సత్తాను అనుభవిస్తే, అంత కంటే తక్కువ సత్తాను జవానులు అనుభవిస్తారు. ప్రజలు మాత్రం ప్రభుత్వం యొక్క పరిపాలన విధానంలో ఉంటారు. ఇదే విధంగా పారమార్ధిక చైతన్యంలో ఉన్న ఆత్మ బ్రహ్మతో తాదాత్మ్యం చెంది పరమాత్మ సుఖాన్ని, పరిపూర్ణంగా అనుభవిస్తుంది” అని బాబా చెప్పారు.

ఇంకా ఉంది…

source: దాసగణు గారి రచన  శ్రీసంత కథామృతం 57వ అధ్యాయం

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles