దేహమే దేవాలయం… …. మహనీయులు – 2020… ఆగస్టు 8



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా శ్రమ అనుకొనక కష్టపడి పనిచేసేవాడు. యజమాని సాయిని ప్రేమించి మెచ్చుకొని, మంచి దుస్తులిచ్చి గౌరవించేనంటారు.

బసవేశ్వరుడు కాయకమే కైలాసమని చాటి, శ్రమ జీవనానికి గౌరవ స్థానం కల్పించాడు. చిరుద్యోగిగా  ప్రవేశించి, ప్రథాన మంత్రి అయ్యాడు. బిజ్జలుని వద్ద.

ఒకనాడు బిజ్జలుడు కొలువుతీరి ఉన్నాడు. ఆ సమయంలో బసవేశ్వరుడు ఒక చేతిని తలపై పెట్టుకుని, రెండవ చేతితో మెల్లగా దేనినో పైకితీయుచున్నట్లు కనిపించాడు. ఇంకా ఆయన చిన్నగా మాట్లాడసాగారు.

అక్కడున్న వారికెవరికి ఈయన ప్రవర్తన అర్థంకాలేదు. బిజ్జులుడే కారణం అడిగాడు. సమాధానం చెప్పకుండా ఉండటానికి ప్రయత్నించాడు. రాజు సమాధానం చెప్పవలసినదని పట్టుపట్టాడు.

షోలాపూరంలో ఒక శైవుడు నటరాజస్వామికి పాలతో అభిషేకం చేస్తున్నాడు. ఒకటా, రెండా, పది వేల కుండల పాలతో అభిషేకం చేస్తుంటే ఆ మార్గమంతా పాలతో నిండిపోయింది. బురదైంది.

నెత్తి మీద పాలు, పెరుగు తట్టను పెట్టుకుని వెళుతున్న ఒక యాదవ మహిళ ఆ బురదలో పడిపోతే, తాను ఆమెను పైకి లేవదీసి, ఓదార్చానని చెప్పాడు బసవేశ్వరుడు.

ఎవరికీ బసవేశ్వరుని మాటలపై నమ్మకం కుదరలేదు. వెంటనే రాజు ఆ ప్రదేశానికి కొందరిని పురమాయించి, ఆ యాదవ స్త్రీని సభకు పిలిపించాడు.

ఏమి జరిగిందో చెప్పమన్నాడు రాజు. ఆమె చెప్పిన కథనమంతా బసవేశ్వరులు చెప్పినట్లే చెప్పింది.

ఇంకొక అదనపు విషయాన్ని కూడా ఆమె చెప్పింది. బసవేశ్వరుడు ఎవరో కాదు, సాక్షాత్తు నందీశ్వరుడే అని చెప్పింది.

బసవేశ్వరుని నంది అవతారంగా భావిస్తారు. బసవేశ్వరుడు బాల్యంలో ఎక్కువగా చదువుకోకపోయినా, సర్వజ్ఞుడు.

ఒకనాడు బిజ్జలుడు కొలువు తీరి ఉండగా ఆయన ముందు ఒక పత్రము గాలిలో తేలుకుంటు వచ్చి ఆయన పాదాలముందు పడింది. తీసి చూచాడు బిజ్జలుడు.

ఆ భాష పండితులకు కూడా అర్థంకాలేదు. చివరకు బసవేశ్వరునికిచ్చారు.

బసవేశ్వరుడు చదివి, ఆ రాజ సింహాసనం క్రింద 88 కోట్ల బంగారు నాణేలున్నాయని, వాటిని పూర్వికులు దాచిపెట్టారని చెప్పాడు బసవేశ్వరుడు.

బసవేశ్వరుని మాటలను నమ్మి, త్రవ్వించాడు. సత్యమే. బసవేశ్వరుని పొగిడాడు రాజు. “అన్నిటికి కర్త మహేశ్వరుడే” అన్నాడు బసవేశ్వరుడు.

బసవేశ్వరుడు శైవ భక్తుడే కాదు, సంఘ సంస్కర్త. కులాంతర వివాహాన్ని బసవేశ్వరుడు ప్రోత్సహించాడు. రాజుకు నచ్చలేదు. ప్రథాన మంత్రి పదవిని వదలి కూడలి సంఘమేశ్వరుని వద్ద స్థిరపడ్డాడు.

ఆయన వేదాంత గోష్టికి అనుభవ మంటపమని పేరు. ఆయన అక్షయ తృతీయ 1134లో జన్మించాడు.

భారత ప్రభుత్వం ఆయన స్మారక తపాలా బిళ్ళను ఆగస్టు 8, 1997న విడుదల చేసింది. తరువాత రూ. 5/. రూ. 100/, నాణెములను ఆయన చిత్రంతో విడుదల చేసింది. పార్లమెంటు 9వ గేటు వద్ద శిలామూర్తిని స్థాపించింది, భారత ప్రభుత్వం.

నేడు ఆగస్టు 8. ఆయన వ్రాసిన పదములలో మహాశివుని స్మరించెదము గాక.

“పసిడి కలశ మగు నా శిరమిదిగో

నడిచేడు ఈ దేవాలయమ్ములో

నివసింపుము సంగమేశ్వరా!” 

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles