Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తి, యోగాలు జ్యోతిష్యంలో పెనవేసుకున్న విషయాన్నీ, గొల్లాపిన్ని మల్లిఖార్జున శాస్త్రిగారి జీవిత చరిత్రలో చూడవచ్చును.
నాలుగేండ్ల ఆ పిల్లవాడిని బడిలో వేయగా, మొదటి రోజుననే పంతులు పిల్ల వానితో సాయంకాలం ఇంటికి వెళ్లి “అయ్యా! మీ వాడు ఒక్క దినంలోనే నాకు వచ్చినదంతా నేర్చుకున్నాడు. నా వద్ద నేర్పేందుకు ఏమీ లేదు” అని పిల్లవానిని తండ్రి వద్దకు చేర్చినాడు.
శ్రీకాళహస్త్రీశ్వరాలయంలో జ్యోతిష్య శాస్త్ర శోధన చేస్తుండగా, శనైశ్వర దర్శనమైంది. త్రికాలవేది అయినాడు.
శృంగేరి జగద్గురువులు ఈయన పాండిత్యాన్ని గుర్తించి “ఉపాధి భేదం చేత మీరక్కడ, మేమిక్కడ, మేమే మేము, మేమే మీరు” అన్నారు.
ఒకసారి ఈయన బాల్యంలో మేనత్తగారి ఇంటి వద్ద తోటి పిల్లలతో ఆడుకొనుచుండగా, ఆకాశం నల్లని మేఘములచే క్రమ్ముకుపోయింది. “వర్షం వచ్చేటట్లున్నది” అన్నది మేనత్త.
“వాన (ఈ) ఊరిలో పడదులే అత్తా” అన్నాడు ఒక సన్నని వస్త్రాన్ని గాలిలో ఎగురవేసి.
అన్ని చోట్ల వర్షం కురిసింది కానీ, ఆ ఊరిలో వర్షం కురవలేదు. ఇటువంటి సంఘటన సొరకాయల స్వామి చరిత్రలో కూడా చూడవచ్చు.
యువకుడుగా ఉన్నప్పుడు ఆయనతో ఒక వ్యక్తి “మా ఉరికి వర్షాభావం ఏర్పడ్డది. కరువు తాండవిస్తుంది” అని కన్నీరు పెట్టుకున్నాడు.
శాస్త్రి గారు “పెద్ద వర్షం కురుస్తుంది. తడుస్తావు. తొందరగా పరుగెత్తి ఇల్లు చేరుకో” అన్నారు.
వెంటనే ఎండిన భూమి నీటితో తడిసిపోయింది వర్షం వలన. ఆ ఉరి ప్రజలు సంతోషించారు,
ఈయన తమ గ్రామంపై చూపిన కరుణకు, ఇటువంటి సంఘటన గొలగమూడి వెంకయ్యస్వామి జీవిత చరిత్రలో కూడా ఉంది.
గద్వాల్ రాజు సీతారామ భూపాల్. అయన ఆహ్వానం మేరకు శాస్త్రిగారు గద్వాల్ సంస్థానానికి వెళ్ళారు.
అందరూ సంస్థానంలో కూర్చుని ముచ్చటించుకొను చున్నారు. అంతలోనే నిజాం నుండి ఫర్మానా వచ్చింది. మరునాడు రాయచూరులో నిజాం నవాబు మకాం చేస్తారని, గద్వాల్ రాజును అక్కడ కలవాలని అందులో ఉంది.
నిజాం నవాబు రాయచూరు రాడని, రాజు రాయచూరుకు పోనక్కరలేదని శాస్త్రిగారు కచ్చితంగా చెప్పారు.
శాస్త్రి గారి మాట వినాలా? లేదా నవాబు ఆజ్ఞ పాలించాలా? అనే సంకటం ఏర్పడ్డది. సరిగ్గా ఇటువంటి సంకట స్థితి సాయి భక్తుడైన హరి వినాయక సాఠే జీవిత చరిత్రలో కూడా ఉంది.
గద్వాల్ రాజు శాస్త్రిగారినే నమ్మాడు, రాయచూర్ పోలేదు. నిజాం నవాబుకు తలనొప్పి కారణంగా రాయచూర్ పోలేదు.
శాస్త్రిగారు సెప్టెంబర్ 5, 1917న మహాసమాధి చెందారు.
నేడు సెప్టెంబర్ 5. అయన వర్థంతి.
శాస్త్రిగారి వలె శాస్త్ర జ్ఞానము కలుగవలెనని కోరుకుందాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- కృప జీవులన్నిటిపైనా! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 10
- దివ్య జననం…. మహనీయులు – 2020… సెప్టెంబరు 15
- తెలుగుతల్లికి రమ్యహర్మ్యము …. మహనీయులు – 2020… మార్చి 22
- అరుత్ పెరుంజ్యోతి…. .మహనీయులు – 2020… అక్టోబరు 5
- మౌన యోగం .. …. మహనీయులు – 2020… మే 29
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments