మౌన యోగం .. …. మహనీయులు – 2020… మే 29



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒకసారి సాయిబాబా ద్వారకామాయిలో ఉండగా, కుండపోతగా వర్షం కురిసింది. అది జలమయమైంది. బలవంతంగా సాయిబాబాను చావడిలోనికి తీసుకుపోయారు.

ఒక సత్యాన్వేషకునికి ఒక యోగి సమాచారం అందింది. ఆ యోగిని చూడటానికి వెళ్ళాడు.

అన్నీ పొలాలు. మధ్యలో వెదురుగడలతో కంచె. మధ్యన ఎతైన, దృఢమైన గది. ఆ గదికి ఒకే ద్వారం. ఆ ద్వారానికి పెద్ద తాళం వేసివుంది.

ఆ పెద్ద తాళం తీసి ప్రవేశిస్తే, ఒకే ఒక పెద్ద వేదిక. ఆ వేదికపై మౌనంగా ఒక యోగి కూర్చున్నాడు. ఏ వస్తువులూ ఆ ఆశ్రమంలో లేనేలేవు.

యోగి రోజంతా ధ్యానంలో ఉంటాడని, ఒక వ్యక్తి ఆ యోగికి సాయంత్రం పూట మాత్రం కొద్దిగా పాలు, పండ్లు ఇస్తాడని, అవి కూడా కొద్దిగా మాత్రమే ఆ యోగి ఎప్పుడైనా స్వీకరిస్తాడని, అతడు చెప్పాడు.

ఆ మౌన యోగి తల, మెడ, వెన్నెముకా అన్నీ నిటారుగా ఒకే వరసలో ఉన్నాయి. పొడుగుగా పెరిగిన జుట్టు భుజాలపై పడుతొంది. ఒంటిమీద ఒక గోచి మాత్రమే ఉంది.

ప్రపంచంలోని మానవులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆ యోగి అధిగమించినట్లు మోహంలో చిరునవ్వు కనిపిస్తోంది. రెప్ప వేయటంలేదు. కను రెప్పలు కదలటం లేదు.

శరీరం కూడా నిద్రాణ స్థితిలో ఉంది. అందరూ చూస్తుండగానే, ఒక బల్లి ఆయనపై ప్రాకుకుంటూ వేరేవైపు వెళ్ళిపోయింది.

ఇదంతా గమనిస్తున్న అన్వేషకుడు పాల్ బ్రంటన్ కు ఒక సందేహం కలిగింది. ఆశ్రమంలో ఏ వస్తువూ లేనప్పుడు, వెదురు గడలతో ప్రహరీ, పెద్ద ఎతైన దృఢమైన గది, పెద్ద తాళం. ఇవన్నీ ఎందుకని?

అక్కడున్న ఒకే ఒక సేవకుడు సమాధానం చెప్పాడు. ఎవరైనా, కావాలనిగాని, ఆటగా గాని, ఆ యోగిపై దాడి చేస్తుంటారు.

ఆ యోగిని ఒక త్రాగుబోతు పట్టుకుని తీవ్రంగా కొట్టాడు. దానిని గమనిస్తున్న పిల్లలు, ఆ త్రాగుబోతుపై ఎదురు దాడిచేశారు.

ఆ మౌన యోగి “మీరు అతడిని (త్రాగుబోతును) కొడితే నన్ను కొట్టినట్లే. అతనిని వెళ్ళిపోనీయండి. నేను అతడిని క్షమించాను” అని ఆ మౌన యోగి వ్రాసి చూపించాడు. పిల్లలు త్రాగుబోతును వదిలేశారు.

ఒక ఉదారుడు ఆయనకు పొలాల మధ్య గదిని కట్టించి ఇచ్చాడు. ఆ యోగి ని గూర్చి విన్న గద్వాలు సంస్థానంలోని మహిళ తన కుమారుని దుర్భరమైన వ్యాధినుండి కాపాడమని కన్నీటితో ప్రార్ధించింది.

ఆ కుమారుడు ఆరోగ్యవంతుడైనాడు. గద్వాల్ రాణి తదితరులు ఒక సేవకుని నియమించారు ఆ యోగి కోసం.

ఫకీరు మరకయార్ శిష్యుడు. ఆ మౌన యోగికి ఏ కోరికా లేదు, జీవించేది సత్య దర్శనం కొరకే.

“ప్రపంచమంతా యోగుల సహాయం కోసం ఎదురు చూస్తుంటే, ఆయన ఏకాంత సాధనలో ఎందుకు మునిగిపోయి ఉన్నాడు?” అని ప్రశ్నించాడు పాల్ బ్రంటన్.

“నాయనా! నిన్ను నీవే అర్ధం చేసుకోలేనప్పుడు నన్ను మాత్రం ఎలా అర్ధం చేసుకుంటావు. ఈ చర్చలన్నీ వ్యర్థమైనవి. నీ యోగ సాధన ద్వారా నీ అంతరంగ దర్శనానికి కృషి చేయి. తీవ్ర కృషి సమాధానం చెబుతుంది” అని పలకపై వ్రాసి చూపాడు.

తేదీ వివరాలు అలభ్యం.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles