మహేశ యోగం … మహనీయులు @2020 – జనవరి 12



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా  “యోగం, త్యాగము, తపస్సు, జ్ఞానము ఇవి మోక్ష మార్గములు. వీనిలో ఏదైనా అవలంభించి మోక్షమును సంపాదించనచో మీ జీవితం వ్యర్థము” అన్నారు.

యోగ ప్రక్రియలు అనేక విధాలుగా ఉన్నాయి. మహేష్ శ్రీవత్సవ అలహాబాదు విశ్వవిద్యాలయంలో చదివి, జ్యోతిర్ మఠ పీఠాధిపతియగు సరస్వతి వద్ద 13 సంవత్సరాలు శుశ్రూష చేశారు.

సద్గురు ఆదేశానుసారం ప్రజోపయోగార్థం సామాన్యమైన పద్దతిలో ఒక క్రొత్త విధానాన్ని పరిశోధించి వ్యాపింపచేశాడు. అదే భావాతీత జ్ఞానయోగము, లేదా అతీంద్రియ ధ్యానం, ట్రాంన్సండెంటల్ మెడిటేషన్ అంటారు.

దీనినే ఆధ్యాత్మిక పునరుజ్జీవనోద్యమంగా భావిస్తారు.

దైనందిన జీవన సమస్యల వల్ల, యాంత్రికంగా దినమంతా కార్యాలయాల్లో పనిచేయటం వలన, మానసిక ఒత్తిడుల వల్ల మానవ జీవితం సాయంకాలానికి సంక్షోభితమవుతుంది.

భక్తితోతో పాటు ఉత్సాహం, ఉత్తేజం మానసిక దారుఢ్యం, దృష్టి కేంద్రీకరణ, శారీరక ఉత్తేజం, నైర్మల్యం తిరిగి పొందగలిగేటట్లు చేసేదే ఈ యోగము.

ఎక్కుపెట్టిన బాణం వంటిది ఈ ధ్యానం అంటారాయన. ఈ ధ్యానం వల్ల శరీరం ప్రగాఢ ప్రశాంతిని, మనసు చేతన స్థితిని పొందగలుగుతుంది.

కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు విషాదంలో మునిగిపోయాడు. కార్యోన్ముఖుని చేయటానికి కృష్ణుడు గీతను బోధించాడు.

త్రిగుణాలకు అతీతుడవుకమ్మని హెచ్చరిస్తాడు. సత్త్వ, రజో, తమో గుణాలకు అతీతంగా ఉంటేకానీ యుద్ధం కొనసాగదు.

అందువల్ల రెండు మూడు నిమిషాలు త్రిగుణాతీత స్థితిని పొందగలిగితేకాని విధిని నిర్వర్తించలేడు. ఆ విధి నిర్వహణను ప్రేరేపించేదే అతీంద్రియ ధ్యానం అంటారు మహేష్ యోగి.

ఈ యోగం ఆధునిక సర్వ రోగ నివారిణిగా పేరు తెచ్చుకున్నది. ఈ ప్రక్రియను పాటించిన వ్యక్తులను ప్రయోగశాలలో పరిశోధించి ఫలితాలను కొంతవరకైనా శాస్త్రీయంగా నిర్దారించటం జరిగింది.

ఈ ధ్యానం నేర్చేవారు మహేష్ యోగి గురూజీ అయిన బ్రహ్మానంద సరస్వతి పటాన్ని పూజించాలి.

భగవద్గీత వ్యాఖ్యానంపై వ్రాసిన పాటలను వల్లెవేయాలి. ఇంకా పూర్వ గురువులను స్మరించాలి. ఈ ధ్యానం తన నూతనత్వంతో ఎందరినో ఆకట్టుకోగలిగింది.

ఈనాడు జనవరి 12, 1918  మహేష్ యోగి జన్మదినం. మనం కూడా భావాతీతంగా ఉండుటకు ప్రయత్నించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles