Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా భక్తి మార్గాన్ని ప్రోత్సహించినంతగా యోగ మార్గాన్ని ప్రోత్సహించలేదు.
పరమహంస యోగానంద జనవరి 5, 1893న జన్మించారు.
అతడు పసిపాపడుగా ఉన్నప్పుడు లాహిరి మహాశయులు ఆ బిడ్డను తన ఒడిలోనికి తీసుకుని ఆధ్యాత్మిక జ్ఞానస్థానం చేయించి,
యోగానందుల తల్లి గారితో “చిట్టితల్లీ! నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఒక ఆధ్యాత్మిక రైలు ఇంజను మాదిరిగా చాలా ఆత్మలను దైవ రాజ్యాలలోకి తీసుకుపోతాడు” అని దీవించారు పసివాడిని.
మహావతారా బాబా, శ్రీ యుక్తేశ్వర్ గారిని యోగానందులకు శిక్షణ ఇవ్వమని ఆదేశించారు.
వీరి క్రియ యోగం, మనసును ఏకాగ్రం చేసి నిశ్చలం చేస్తుంది. అప్పుడు అది చందమామ వంటి భగవంతుడి ప్రతిబింబాన్ని చూపించే నిశ్చలమైన, నిర్మలమైన సరస్సుగా మారుతుంది.
“భగవంతుడు ప్రతిరూపంగా సృష్టించిన ఆత్మను నేను” అని సాధకుడు గ్రహిస్తాడు. ఈ క్రియా యోగం ఖండ ఖండాతరాల్లో వ్యాపించింది.
ఒకసారి అయన లాస్ ఏంజిల్స్ లో ప్రయాణం చేస్తున్నారు ఒక కారులో, దుకాణాలు మూసివేసే సమయం అది.
అయన కారును ఒకచోట ఆపి, వెనుకకుపోయి, పాత వస్తువులను విక్రయించే దుకాణంలో కొన్ని వస్తువులను కొని, బిల్లు అడిగారు, ఆయనకు ఆ వస్తువులతో అవసరమే లేదని అయన వెంట వచ్చిన శిష్యులు అనుకున్నారు.
దుకాణం యజమానురాలు ఆయన చెల్లించిన డబ్బును లెక్కపెట్టుకుని “సరిగ్గా నాకు కావలసిన డబ్బు మొత్తం ఇదే. షాపు మూసివేసే సమయమయింది. సరిగ్గా ఇంత డబ్బు రాకుంటే, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉంటానో ఎవరూ ఊహించలేరు.
నేను దైవాన్ని ప్రార్ధించాను. నా దైవమె మిమ్ములను అంత డబ్బుతో పంపాడు” అన్నది యోగానందులతో.
అందులకు యోగానంద స్పందించలేదు. స్పందించటం అహంకారమవుతుందని యోగానందులకు తెలుసు.
యోగానందులు క్రియా యోగంతోనే కాదు, ఇటువంటి అద్భుతమైన చేష్టలతో ఆనందాన్ని పంచుతారు.
అనేక గ్రంధాలను రచించిన ఈయనకు కీర్తి కిరీటాన్ని పెట్టిన గ్రంధం – ఒక యోగి ఆత్మకథ (Autobiography of a Yogi).
ఈ ఆత్మకథలో సమకాలీన మహాపురుషులలో కొందరిని దర్శించి, వారి గాథలను అక్షర రూపంలో అమర్చి, ఆధ్యాత్మిక పిపాసను తీర్చారు.
యోగుల గురించి ఒక యోగి స్వయంగా వ్రాయటం అరుదైన విషయం. ఈయన జీవితం దేవునిపట్ల ప్రేమ, మనవ జాతికి సేవ అనే ఆదర్శానికి ఉదాహరణ.
శరీరం కన్నా మనసుకు, మనసుకన్నా ఆత్మకు గల ఆధిక్యాన్ని చాటి చెప్పే ఆ యొగింద్రులకు – పరమహంస యోగానంద జన్మదినాన మరోమారు స్మరిద్దాం! ఆ యోగానందంలో తలమునకలవుదాం.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మహేశ యోగం … మహనీయులు @2020 – జనవరి 12
- జయ, జయ నరసింహ!.. …. మహనీయులు – 2020… డిసెంబరు 30
- కొడుకు పుట్టాల! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 14
- మౌన యోగం .. …. మహనీయులు – 2020… మే 29
- పయనమైన ప్రియతముడు…. మహనీయులు – 2020… మే 21
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments