పయనమైన ప్రియతముడు…. మహనీయులు – 2020… మే 21



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా తనను దర్శింప వచ్చిన అబ్దుల్ రహీం రంగారీతో “నీవు నిన్న వచ్చిన బాగుండెడిది” అంటారు. “ఎందుకు?” అడిగాడు రంగారి. “గానము! సంగీతము (ఇచ్చట) జరిగెను” అంటారు సాయి.

సాయి ఆధ్యాత్మిక పథంలో సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చాడు కూడా.

భారతదేశంలో అజ్మీరులో స్థిరపడిన ఖ్యాజా మొయినుద్దీన్ చిస్తీ సంగీతాన్ని సూఫీలలో ప్రథమంగా ప్రవేశపెట్టాడు. సాయి కూడా చిస్తీ సాంప్రదాయకుడుగా కనిపిస్తాడు.

చిస్తీ జీవించింది భగవంతుని కోసమే. ప్రవక్త మహమ్మద్ కలలో కనిపించి వివాహం చేసుకోమంటే గాని చేసుకోలేదు చిస్తీ.

అజ్మీరులో ఉండే చిస్తీ సంవత్సరానికి రెండు పర్యాయాలు మక్కా యాత్రలో చూసిన వారనేకులున్నారు.

భగవంతునిపై భక్తి, ప్రేమలు అతీంద్రియ శక్తులు అలా ప్రసాదింపబడతాయి!

ఢిల్లీని షంసుద్దీన్ ఇక్ట్ ముష్ అనే రాజు పాలిస్తున్నాడు. ఆయనకు కుతుబుద్దీన్ భక్తియార్ కాకి అనే సూఫీ యోగి సన్నిహితుడు.

భక్తియార్ కాకి సూఫీ యోగిగా పేరుపొందారు, కాకి చిస్తీ శిష్యుడు. ఒకసారి రాజు, భక్తియార్ కాకి, ఇతరులతో అటు, ఇటు తిరుగుతున్నారు.

ఒక అందమైన యువతి రాజు వద్దకు వచ్చి “నేను కాకి వలన గర్భం ధరించాను. నాకు కాకితో వివాహం జరిపించండి” అని వేడుకుంది. అందరు నివ్వెరపోయారు.

కాకి కన్నీటితో తన గురువైన చిస్తీ నివసించే అజ్మీరు వైపు తిరిగి “నన్ను కాపాడండి”. అని వేడుకున్నాడు.

తక్షణం, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ప్రత్యక్షమైనారు. అందరూ ఆశ్చర్యపోయారు.

“నా శిష్యునిపై పడ్డ అపనిందను నేను సహించలేక వచ్చాను” అని ఆ గర్భవతి అయిన మహిళ గర్భంలో ఉన్న శిశువుతో “నీ తండ్రి కాకియా?” అని ప్రశ్నించాడు చిస్తీ.

వెంటనే “కాదు మా అమ్మ అబద్దం చెబుతొంది. ప్రజలలో కాకికి అవమానం జరగాలనే అలా చెబుతొంది” అని కడుపులోని శిశువు చెప్పింది.

ఆ గర్భవతి నిజం ఒప్పుకుంది. చిస్తీ అంతర్దానమయ్యారు. ఆ నాడు 21 మే, 1230, సోమవారం. మహమ్మదీయుల కాలమానం ప్రకారం రజబ్ నెల.

చిస్తీ యోగి “నేను నా కుటీరంలోనికి వెళ్ళుతున్నాను, ఎవరూ నా ప్రశాంతతకు భగ్నం కలిగించవద్దు” అని కుటీరంలోనికి వెళ్ళారు. శిష్యులందరు కుటీరం బయటే ఉన్నారు.

ఆ రాత్రంతా ఆ కుటీరం నుండి మార్మిక ధ్వనులు వినబడ్డాయి. తెల్లవారింది నమాజుకు వేళయింది. ఇంకా కుటీరపు ద్వారం తెరుచుకోలేదు.

శిష్యులు దైర్యం చేసి లోనికి వెళ్ళి దిగ్భ్రాంతులైనారు అక్కడి దృశ్యం చూచి.

ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ పాల భాగంపై “ఇతను దైవ ప్రేమికుడు. భగవంతుని ప్రేమ కోసమే పరితపించాడు” అనే అక్షరాలు మెరుస్తూ కనిపించాయి.

ప్రియతముని కలిశారు సూఫీ యోగి చిస్తీ.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles