కఠిన సాధన…. మహనీయులు – 2020… మే 7



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“శాశ్వతమైన వస్తువును సంపాదించటానికి కఠినమైన సాధన చేయాలి” అని సాయి సచ్చరిత్రలో హేమాడ్ పంత్ వ్రాశారు.

సాయిబాబాచే తన గురువు కఠోర సాధన చేయించారు – ఉ. దా: తలక్రిందులుగా ఒక చెట్టు కొమ్మనుండి బావిలోనికి వ్రేలాడదీయటం. దీనిని సూఫీలు చిల్లా ఏ మాకున్ అంటారు.

దీనిని సాధనగానే చేశారు. భక్తియార్ కాకి తన శిష్యుడైన ఫరీదుద్దీన్ గంజ్ షక్కర్ కు. దీనిని చేయటమే కాదు, ఏర్పాటుచేయటమూ కష్టమే.

రోజులో కొన్ని సమయాలలో మినహా 40 రోజులపాటు ఫరీద్ తలక్రిందులుగా వ్రేలాడదీయబడి దైవ ప్రార్థనలో మునిగిపోయేవాడు.

ఈయనను భక్తియార్ కాకి మరియు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ కూడా ఒకే సమయంలో దీవించారు.

ఒకసారి ఫరీద్ ప్రార్థన చేసుకుంటుంటే, పిచ్చుకలు కిచ కిచ శబ్దాలు చేస్తున్నాయి. ఎంతో సమయం ఓపికపట్టాడు.

అవి చప్పుడు చేయటం మానలేదు. “నా ప్రార్థనకు అంతరాయం కలిగించారు. చావండి” అనే మాట ఫరీద్ నోటినుండి రాగానే ఒక పిచ్చుక నేలమీద వ్రాలి ప్రాణాలు కోల్పోయింది.

ఫరీద్ కు జాలివేసింది. తన కోపము వలన గదా ఇది జరిగింది అని చింతించి, భగవంతుని ప్రార్ధించాడు, ఆ చనిపోయిన పిచ్చుకకు ప్రాణం పోయమని, తక్షణమే ఆ పిచ్చుకకు ప్రాణంవచ్చి ఎగిరిపోయింది.

ఈయన అత్యంత సామాన్యంగా జీవించేవాడు. నేలమీదనే శయనించేవాడు.

డబ్బు ఎవరైనా ఇస్తే, అందరకూ పంచేవాడు. ధనవంతులను, రాజులను ఆశ్రయించలేదు. ఆశ్రమాలు వద్దనేవాడు.

అన్నిటినీ అల్లాయే సమకూరుస్తాడు అనేవాడు. చెప్పటం వరకే ఆయన పరిమితం కాదు. ఆచరించి చూపాడు.

ఒకసారి ఆయన బలహీనంగా ఉన్నాడు. ఆ యోగి (ఫరీద్) ప్రక్కనే నిజాముద్దీన్ నడుస్తున్నారు.

బాబా ఫరీద్ ఉన్నట్టుండి తన ఊత కర్రను విసిరేశాడు. అందుకు కారణం అడిగాడు నిజాముద్దీన్.

“తన మీద (అల్లా మీద) భారంమోపకుండా, కర్రపై భారం మోపటం అల్లాకు ఇష్టంలేదు” అన్నాడు ఫరీద్ గంజ్ షక్కర్.

ఒకసారి ఆయన ఏమాత్రం ఓపికలేకుండా ఉండిపోయాడు. ఆ సమయంలో ఒక కాకి వచ్చి చెట్టుమీద వ్రాలింది.

దానిని చూచి “నీవు నా శరీరంలో ఏ భాగాన్ని అయినా పొడువు. నా కళ్ళను మాత్రం పొడవవద్దు. నేను భగవంతుని కన్నులారా చూడాలి” అని పలికాడు.

ఈయన చిస్తీ సంప్రదాయంలో మణిపూస. ఈయన ప్రార్థనలు పంజాబీ భాషలో ఉన్నాయి. 116 కీర్తనలు శ్రీ గురుగ్రంథ సాహెబ్ లో చోటుచేసుకున్నాయి.

ఫరీద్ మే 7 (1290) న దేహాన్ని త్యజించారు.

నేడు మే 7. ఆయనను ఆయన మాటలతో స్మరించెదము గాక. “అణుకువ, క్షమార్పణ, తీయగా మాట్లాడే నాలుక –  ఈ మూడు దుస్తులు ధరిస్తే, ఓ చెల్లెలా, కాంతుడు (భగవానుడు) నీ వాడవుతాడు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles