గురు శిష్యులు వేరు కాదు! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 6



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


తమ మతంలో గొప్ప పేరు తెచ్చుకోవటం ప్రతి మతంలోనూ ఉండే విషయమే, కానీ,మతం మారి, వేరొక మతంలో గొప్ప పేరు తెచ్చుకోవటం ఒక విశేషమైనదిగా భావించవచ్చును. అటువంటి వారిలో మచిలీపట్నానికి చెందిన ఫరీద్ మస్తాన్ ఒకరు.

ఒకప్పటి అప్పలస్వామి ఫరీద్ మస్తాన్ అయ్యాడు. ఇటువంటి వారికి గురువుపై అమిత విశ్వాసముంటుంది.

అప్పలస్వామి ఒకసారి ఖాదర్ వలీ గారి నామ సంకీర్తన విన్నాడు. ప్రతి వారం ఆయన దర్శనానికి వెళ్లేవాడు.

గురువు ఆజ్ఞతో మచిలీపట్నంలో స్థిరపడ్డాడు అప్పలస్వామి, ఫరీద్ మస్తాన్ గా, నేరేడు చెట్టు క్రింద దిగాడు.

ఒక రాత్రంతా వానలు. ఆ వర్షానికి మచిలీపట్నంలో వారు సంక్షోభానికి గురయినారు. తెల్లవారగానే ఫరీద్ వద్దకు వెళ్లారు.

ఆయన సురక్షితంగానే ఉన్నారు. ఇది దైవ లీలగా భావించారు ప్రజలు.

తనను దర్శించే వారిలో గాని, భక్తులలో గాని అహంకారం పొడచూపుతున్నట్లయితే, ఊరుకునే వారు కాదు.

“మేము అవసరమైతే ఒక గడ్డి పరకను నిలబెట్టి ఆ పని చేయించుకోగలం జాగత్ర” అని హెచ్చరించే వారు.

“కొండను పిండి చేయగమం, పిండిని కొండ చేయగలం” అనే వారాయన.

ఒక భక్తురాలి కుమారుడు చనిపోతే, ఆ చనిపోయిన వానిని, తిరిగి ఆమెకే సంతానంగా పుట్టించినారు.

“అవసరమైతే బ్రహ్మ వ్రాసిన వ్రాతను తిరిగి వ్రాయగలము. అయితే సృష్టికి ఎదురు తిరగం. సూర్య చంద్రులు ఉన్నత కాలం మా శక్తి (వెలుగు) ఇక్కడ ఉంటుంది” అనే వారు.

వారికి మరణమనేది ఉండదు. సాయిబాబా కూడా తాను దేహాన్ని విడిచే కాలమును గూర్చి సూచనలను ఇచ్చారు. ఫరీద్ మస్తాన్ కూడా అంతే.

ఇంతటి శక్తి ఆయనకు ఎలా సంభవించింది అనే సంశయం ఎవరికైనా కలగవచ్చును.

అది ఆయన తన గురువుపై చూపే శ్రద్దా భక్తులకు, గురువు ఇచ్చే కానుకగా మనం గ్రహించవచ్చును.

ఆయన వద్దకు ఏ సమయంలో భక్తులు వెళ్లినా లంగరు ఖానా (భోజానాశాలకు)కు తీసుకుపోయి తినిపించే వారు. లంగర్ ఖానా పగలు, రాత్రి తెరచియే ఉండేది.

సాయి వలె గత జన్మల పాప, పుణ్యాలను భరించవలసినదే అనే వారు.

ఆయన తన గురువును దర్శించటానికి పోయినప్పుడు, తాను ధరించే చెప్పులను 100  గజాల దూరంగా విడచి వెళ్ళేవారు, వంగి, వంగి, చేతులు జోడించి ఆయన తన గురువు సన్నిధి చేరేవారు.

ఇది గురువుపై చూప వలసిన వినయ విధేయతలు. ఇట్టి శిష్యుని చేష్టలకు కరగిపోని గురువుంటాడా?

గురువైన ఖాదర్ వలీ గారు ఇతరులతో “మేమే ఫరీద్, ఫరీదే మేము” అనే వారు. సాయిబాబా కూడా కేవలం ఉపాసనీ మహారాజ్ విషయంలో మాత్రము తాము ఒకటే అన్నట్లు పలికే వారు.

నేటికి నమ్మిన వారికి కొంగు బంగారమై వెలుగొందే ఫరీద్ మస్తాన్ డిసెంబర్ 6, 1965న గురువులో ఐక్యమైనారు.

నేడు డిసెంబర్ 6, వారి వర్థంతి. ఫరీద్ మస్తాన్ ను, వారు గురువును స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles