నీ ఇచ్ఛయే మా ఇచ్ఛ….సాయి@366 డిసెంబర్ 7….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సూఫీ యోగినులలో మొదటి మహిళ రబియా. ఆమెవద్దకు ఎందరో పేరు ప్రఖ్యాతులు పొందిన సూఫీ యోగులు వచ్చేవారు.

ఒకసారి గొప్ప పేరున్న అబ్దుల్ అమీర్, సోఫియాన్ తో కూడా రబియాను చూడటానికి వెళ్ళారు.

అప్పుడు ఆమె తీవ్రమైన జ్వరంతో ఉంది. “నీవు కోరి ప్రార్థిస్తే నీ జ్వరం తగ్గుతుంది కదా” అన్నాడు సోఫియాన్.

“నాకి బాధ కలగాలని ఎవరి నిర్ణయమో నీకు తెలియదా? భగవంతుని నిర్ణయమని తెలుసుగదా!” అన్నది రబియా. “అవును” అన్నాడు సోఫియాన్.

“మరి తెలిసి భగవంతుని నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా ప్రార్దించగలను? ఆయనకు నిజమైన సేవకులమన్న భావం ఉండాలి. అయన నిశ్చయమై మన భావం కావాలి” అన్నది రబియా.

భగవంతుడు ఏరి ఇస్తే అది తీసుకోవాలి, జబ్బు ఇస్తే జబ్బును, బీదరికాన్ని ఇస్తే బీదరికాన్ని తీసుకోవాలి. అంతేకాని ఇది కావాలి, అది వద్దు అని ప్రార్థన చేయకూడదు.

భక్తురాలు మీరాబాయి పేరు వినని వారుండరు. ఆమెకు ఒక గురువు ఉన్నారు. ఆయన పేరు రవిదాస్.

ఆయన చెప్పులు కుడుతూ జీవించేవాడు. మీరాబాయికి తన గురువు చెప్పులు కుట్టుకుంటూ బ్రతుకుతుండగా, తానూ రాణిలా ఉండటం కష్టం అనిపించింది.

ఆమె వెంటనే ఒక ఖరీదైన రత్నాన్ని తెచ్చి రవిదాసుకు ఇవ్వబోయింది. ఆయన ఆ రత్నం తనకు వద్దన్నాడు.

మీరాబాయి గురువు మీద భక్తి ప్రేమలతో ఆ రత్నాన్ని ఒక చూరులో పెట్టి, ఆ సంగతి ఆయనకు చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయింది.

రవిదాస్ ఆమె ప్రేమాభిమానాలకు నవ్వుకున్నాడు. కొంత కాలం గడిచింది.

మీరాబాయి మరల గురువు వద్దకు వచ్చింది. కుశల ప్రశ్నలయ్యాయి  మీరాబాయి ఎక్కడైతే రత్నాన్ని పెట్టిందో అది అక్కడే ఉంది.

రవిదాస్ “నాకు లెక్కకు మించిన సంపద ఉంది. నీ రత్నాన్ని నీవు తీసుకు వేళ్ళు” అన్నారు.

మీరాబాయి తన గురువు ఔన్నత్యాన్ని గ్రహించింది.

సాయిబాబా డిసెంబరు 7 , 1910న “భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడాలి” అన్నారు తన భక్తులతో.

ఏ యోగి, ఏ యోగిని జీవిత చరిత్ర చూసినా అందుకు భిన్నంగా ఉండదు.

సాయి మనకు ఇచ్చేదే చాలు!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles