Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా ఎవరు? భక్తుడా? జ్ఞానా? కర్మిష్టా? యోగియా? ఇవి అన్నీ. అందుకే సాయి వద్దకు శివ భక్తుడైన మేఘశ్యాముడు వచ్చాడు.
వామన్ ప్రాణ్ గోవింద్ పాటిల్ జ్ఞానిగా రూపొందాడు. రాధాకృష మాయి గొప్ప కర్మిష్టి.
యోగాభ్యాసి రాంబాబా సాయిని దర్శించానికి వచ్చాడు నానా సాహెబ్ చందోర్కరుతో యోగ సూత్రాలను గూర్చి తన సందేహాలను తీర్చుకోవటానికి.
ఉల్లితో రొట్టెను తింటున్న సాయిని చూచి ఇట్టి వ్యక్తి తన సందేహాలను ఏ విధంగా నివృత్తి చేయగలడని సందేహించాడు.
సాయి వెంటనే గర్జించాడు ”కుక్క ఇక్కడకు రా. ఉల్లిని జీర్ణించుకొన గలవాడే తినాలి” అన్నాడు.
సాయి అంతర్యామిత్వాన్ని, తన అజ్ఞానాన్ని గ్రహించాడు. సాయి భక్తుడైనాడు అప్పటి నుండి.
ఈయన సన్యాసం స్వీకరించాడు. పూనాలో స్థిరపడ్డాడు. గురు పూర్ణిమ నాడు తన గురువును దర్శించేందుకు వచ్చేవాడు.
ఈయన తనకు సాయితో గల పరిచయాన్ని అడ్డు పెట్టుకొని పెద్దవాడవలేదు. సాయి బోధలకు అనుగుణంగా జీవించాడు.
సాయి ‘అహంభావం’ ఆధ్యాత్మికతకు పరమ విరోధి అనే వారు. ‘తాను’ అనే విషయాన్ని విస్మరించాడు. ‘నేను’ బదులు శరీరాన్ని చూపుతు ‘రామ’ అనే వాడు.
సాయి తనను ప్రతి జీవిలోను దర్శించమనే వారు. రాంబాబా అన్ని జీవులను దివ్యాత్మలుగా భావించే వాడు.
సాయిని ప్రేమించటమంటే గురు బ్రహ్మను ప్రేమించుటే అనేవారు రాంబాబా.
మీరాలాంటి వ్యక్తి మాత్రమే సాయిలోని దివ్య ప్రేమను గుర్తించగలదు;
కబీరు లాంటి వ్యక్తి మాత్రమే సాయిలోని మార్మిక సత్యాలను గ్రహించ గలడు;
గురుగోవింద్ సింగ్ లాంటి ధైర్యశాలి మాత్రమే తన శిరస్సును సాయికి సమర్పించ గలడు;
సైంట్ ఫ్రాన్సిస్ లాంటి వ్యక్తి మాత్రమే తన జీవిత సర్వస్వాన్ని సాయి సేవకే వినియోగించ గలడు.
దైవ ప్రేమతో మత్తెక్కి పోయిన రబియా లాంటి వ్యక్తి మాత్రమే భక్తుడు సమర్పించేది ప్రేమతో తప్ప మరేదీ లేదనే అనుభవం పొంద గలడు – అని పలుకుతారు ఆయన.
సుమారు 125 సంవత్సరాలు జీవించి, సాయిలో ఐక్యమయ్యారు మార్చి 6, 1989న, మహాశివరాత్రి దినాన, అదీ సోమవారంనాడు.
సాయి భక్తుడైన రాంబాబా గారి ఈ వాక్కును ఎల్లప్పుడు మరువకుందుము గాక – ”ఇతరుల జీవితాలకు నీవు ఏమి చేశావో, దానినే నీవు నీ జీవితంలో పొందుతావు”.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- విచిత్రాలు సహజమే!…..సాయి@366 జూన్ 6…Audio
- రాలిన నక్షత్రం!…..సాయి@366 మార్చి 19….Audio
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
- సర్వ దేవతా నిలయం ….. సాయి@366 మార్చి 9….Audio
- మొదటి మాసికము…..సాయి@366 నవంబర్ 13….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments