బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

        సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

శ్రీ శివనేశన్ స్వామి కావాలని కోరుకున్నది బాబా ఇస్తూనేయున్నారు.

ఒకసారి శ్రీ శినేశన్ స్వామి వారి వస్త్రములు జీర్ణమైపోయినవి.ఒక్క కట్టుకున్నది మాత్రమే యున్నది.

స్వామి వారు లెండీబాగ్ లో  కూర్చుండి శ్రీ సాయిబాబా కు తన కష్టాన్ని చెప్పుకున్నారు.

తరువాత స్వామివారు ధ్యానములో కూర్చోనగా ఎవరో ఒక అపరిచిత వ్యక్తి తన వద్దకు వచ్చి కొత్త వస్త్రముల నిచ్చినట్లు భ్రాంతి కలిగినది.

అలా భ్రాంతి నొందిన కొంత సమయమునకు ఒక వ్యక్తి స్వామి చెంతకు  వచ్చి శ్రీ సాయిబాబా నాకు స్వప్నంలో కనిపించి “లెండీబాగ్ లో ధ్యానం చేసుకుంటూ ఉన్నవానికి కొత్త వస్త్రములనిమ్ము “ అని నాకు చెప్పారనుచూ రెండు నూతన వస్త్రములనిచ్చెను.

అలానే మరియొక సారి స్వామివారు లెండీబాగ్ లో కూర్చొని ధ్యానం చేస్తూండగా వీరి బట్టలు,పుస్తకాలు ఎవరో ఎత్తుకొనిపోయారు.

ఈసారి ఒక అపరిచిత వ్యక్తి బాబాకు కప్పినటువంటి వస్త్రము తెచ్చి తనకిచ్చినట్లు స్వామివారికి భ్రమ కలిగింది.

ఒక అర్థగంట తరువాత ఒక వ్యక్తి వచ్చి ధ్యానములో స్వామికి కనబడినట్టు నూతన వస్త్రమును యిచ్చాడు.అతను స్వామీజీకి భోజనం కూడ పెట్టించాడు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

        సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

 మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles