Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-178-1612-బాబా దర్శనము 3:01
శివనేశన్ స్వామి షిరిడీ వచ్చిన తొలిరోజులలో ఒక రోజు రాత్రి లెండీబాగ్ పిట్టగోడ దగ్గర ధ్యానం చేసుకుంటున్న సమయములో నందదీపము – దత్తాత్రేయ మందిరముల మధ్య బండ మీద బాబా కూర్చొని దర్శనమిచ్చారు.
అలా కనిపించుట తన బ్రాంతియని స్వామిజీ తలచి మరలా చూడగా అదేవిధముగా దర్శనమైనది. అప్పుడు స్వామిజీ లేచి బాబా కనిపించిన చోటుకు వెళ్ళి చూడగా బాబా అంతర్ ధానమైనారు.
వేరొకసారి శివనేశన్ స్వామి గురుస్థానములో యుండగా ఒక కుష్టురోగి వచ్చి బాబా తీర్థము ఇమ్మని స్వామీజీని అడుగగా అక్కడేయున్న తన గదిలోకి వెళ్ళి బక్కెట్లో యున్న తీర్థము తెచ్చి స్వామి యివ్వబోగా”
ఇది కాదు బాబా సమాధి యొద్ద రాత్రులు బాబా కొరకు చెంబులో పెట్టె మంచినీటి తీర్థము యివ్వమని ఆ కుష్టురోగి మరలా అడిగాడు. అతనికెలా తెలుసు ఆ తీర్థము నా దగ్గర యున్నట్లు అని అనుకొనుచు స్వామి లోపలకు వెళ్ళి ఆ తీర్థము తీసుకొని బయటకు వచ్చేసరికి ఆ కుష్టురోగి కనిపించలేదు.మరి ఆ కుష్టురోగి రూపమున వచ్చినది ఎవరు? ఇంకెవారు శ్రీసాయిబాబా కాక.
బాబా భౌతికంగా అనేక రూపముల దర్శనమిస్తూనే ముందు అర్థం కానివ్వక తాను కనుమరుగైన తరువాత నేనేనని బాబా దృడపరచుట ఎందరో సాయి భక్తులకు నీదర్శనములు యున్నవి.
అంతేకాదు మందిరములలో యుండు బాబా విగ్రహము నుండి కూడా వివిధ రూపముల దర్శమిచ్చుటయు కలదు. అలా ఎందరో చెప్పిన వారున్నారు.
నేను(రచయిత) ఒక సారి బళ్ళారి వెళ్ళాను.అక్కడ మందిరములో ద్వారకామాయి విగ్రహమున్నది.
పది అడుగుల దూరములో యుండి ఆయనను చూచుచుండ పళ్ళు కనిపిస్తూ నవ్వుతూ కనిపించారు.
దగ్గరకు వెళ్ళితే నోరుమూసుకొని యున్నది. నవ్వులేదు. పళ్ళు కనిపించుటలేదు.మరలా దూరమునకు వెళ్ళి చూస్తే మరలా నవ్వు కనిపిస్తునేయున్నది.
అంతెందుకు మనము నిత్యము దర్శించు మందిరములలోని బాబా విగ్రహములో బాబా వారి వారి భావాలను బట్టి నవ్వుతున్నట్లో, కోపముతో యున్నట్లో, ఇలా వివిధ పద్దతుల దర్శనమిచ్చుట నాకే కాదు ఎందరో చెప్పుటయు కలదు.
మన ఆచరణ, మనో భావాలననుసరించి విగ్రహములోకాని, పటములోకాని బాబా దర్శనము లభించి మనకు మార్గదర్శనము కలిగించుటలో సందేహములేదు.
అందువలన ఎప్పటికప్పుడు మన ఆచరణలు, ఆలోచనలు పరిశీలించుకుంటూ బాబా మార్గములో సరిచేసుకొని నడవవలెను.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( జూన్ – 2014)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
- శ్రీ సాయిబాబా నివేదన శివనేశన్ స్వామికి భోజనమగుట.
- శివనేశన్ స్వామిని బాబా షిరిడి రమ్మని పిలుచుట
- బాబాను వదిలి వెళ్ళితే నీరైనా దొరకదని గ్రహించిన శివనేశన్ స్వామి
- శివనేశన్ స్వామిని చావడి బాబా అని సంబోధించుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments