Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-177-1512-అమృతం పోసారు 3:28
వేసవి సెలవుల గడిపేందుకు 1942 లో ద్రౌపదిబాయి వి.పరబ్ బొంబాయిలో విఎస్పీ (వీరి పూర్తి పేరు ప్రస్తావించబడలేదు) దగ్గరకి వచ్చింది.
ఆమె బొంబాయి చేరుకునేటప్పడికే ఆమెకి నూట నాలుగు డిగ్రీల జ్వరం వుంది, మెల్లిగా న్యుమోనియా గా మార్పు చెందింది. రక్తంతో కూడిన శ్లేష్మం ఆమె దగ్గితే వస్తూ వుండేది. డాక్టరు ని పిలవడం జరిగింది.
’పై బడిన ఆమె వయసు రీత్యానూ, ఆమె శరీర దుర్భలత్వం వలన మరియూ ఆమె కున్న హై టేంపరేచర్ వలన ఆమె ని ఆసుపత్రికి తరలించాల’ని ఆయన సూచించాడు.
పైగా అమె పరిస్థితి ప్రమాదకరంగా కూడా వుంది. కానీ ద్రౌపదిబాయి కి ఆసుపత్రిలంటే వున్న విపరీతమైన భయంవలన ఆమె ఆసుపత్రిలో చేరడానికి నిరాకరించింది.
అప్పుడు డాక్టరు ఆమె బతికే అవకాశాలు మృగ్యమని ఆమె బంధువులకి చెప్పాడు. కానీ ఆసుపత్రిలో కన్నా ఇంటిలో చనిపోతేనే తనకి తృప్తి అని ద్రౌపదిబాయి అంది.
ఈ పరస్థితులలో విఎస్పీ మరియూ ద్రౌపదిబాయి బాబా ను శరణు వేడి, నిర్దేశించిన చికిత్సని కొనసాగించారు.
ఆ రోజు శనివారం పదవ తేదీ, మద్యాహ్నం ఒంటిగంట సమయం. భుజాన జోలె వ్రేలాడుతుండగా, కఫ్నీ ధరించి, తలకి గుడ్డకట్టుకుని బాబా అక్కడ సాక్షాత్కరించారు.
విఎస్పీ ఇంటి ముందున్న పైపులో కాళ్ళు చేతులు కడుక్కుని, ఇంటిలోనికి వెళ్ళి సరాసరి ద్రౌపదిబాయి గదిలోనికి వెళ్ళారు.
ఆమె మంచం ప్రక్కన నిలబడి ’భయపడవద్దు, ఈ ఇంటిలోని ముసలామె అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకుంది,
నువ్వు మళ్లీ జబ్బు పడడానికి వచ్చావా’ అనడిగారు. మొత్తం కుటుంబమంతా ఈ సంఘటనని ఆశ్చర్యకరంగా చూస్తోంది. బాబా ఆదర పూర్వక మైన కంఠస్వరం వారినెంతో ఆకట్టుకుంది.
ఆ తరువాత బాబా ఆమె నోటిలో అమృతం లాంటి ద్రవాన్ని పోసి, కుటుంబ సభ్యులను కొద్దిగా వండిన అన్నమూ, పప్పూ తీసికుని రమ్మన్నారు.
అలా తీసికుని వచ్చిన అన్నాన్నీ పప్పునీ ద్రౌపదిబాయి కి ఎంతో అప్యాయంగా ముద్దలు చేసి తినిపించసాగారు.
’రాబోయే నాలుగు రోజులు ఏ విధమైన ఆహారాన్నయినా స్వీకరించు, ఈ ఊరి సరిహద్దులలో జరిమరి ఆలయంలో ఒక కిళ్లీని, కొద్దిగా పచ్చిబియ్యాన్నీ, కొద్దిగా వక్కలనీ అక్కడి కుడిచేతి వైపు నైవేద్యం చేయి.
దీనికి ముందు స్నానం చేసి నన్ను ధ్యానించుకో. ఇంటిని వదిలి జరమరి ఆలయానికి బయలు దేరేముందు నా ఫొటోకి సాష్టాంగనమస్కారం చేసి వెళ్లు’ అని బాబా ద్రౌపదిబాయిని ఆదేశించారు.
అ వృద్ద మహిళ బాబా ఆదేశాలను తు.చ.తప్పకుండా శ్రద్దతోనూ పట్టుదలతోనూ పాటించింది.
ద్రౌపదిబాయి పూర్తిగా కోలుకుందనీ, బాబా పట్ల కృతజ్ఞురాలై వుందనీ వేరేగా చెప్పనవుసరం లేదు.
శ్రీ సాయిలీల సంపుటి: 18 సంచిక: 8 – 10, అక్టోబరు-డిసెంబరు 1943
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఆమె వాల్వు మార్పిడి గురించి బాబా కు తెలుసు–audio
- ఆమె కడుపు నొప్పి ఎలా తొలిగిపోయింది?–Audio
- పదకొండు వాగ్దానాలే ఎందుకు?
- బాబా ఆమె ప్రక్కనే తన చేతితో లాంతరు పట్టుకుని నిలబడ్డారు–Audio
- బాబా దివ్య వర్ణ సమ్మేళనం – బాబా నాకిచ్చిన రొగ నిర్ణయ పత్రం (విన్నీ చిట్లూరి )–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments