బాబా ఆమె ప్రక్కనే తన చేతితో లాంతరు పట్టుకుని నిలబడ్డారు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-166-1012-బాబా ఆమె ప్రక్కనే 2:31

ఆమె తమిళురాలు, ఆమెకి వచ్చిన భాష తమిళం మాత్రమే.

ఆమె పేరు కమల అమ్మాళ్, బొంబాయిలోని మాతుంగాలో నివసించేది. ఆమె బాబా భక్తురాలు.

తన కున్న ఒకే కుమారుడు 1944లో ఆర్మీలో చేరినప్పటినుండీ తన కొడుక్కి ఏమవుతుందోనన్న భయం ఆమెని ఆవరించింది. బాబా శరణు వేడాలని నిర్ణయించుకుంది.

రైల్వే స్టేషన్ కి వెళ్ళి షిరిడీకి టిక్కెట్టు అడిగింది, షిరిడీకి సరాసరి రైలు సర్వీసు లేదన్న సంగతి కూడా ఆమెకి తెలియదు.

కౌంటర్లోని వ్యక్తి బాబా భక్తుడు, అర్దం చేసికుని ఆమెకి కోపర్గామ్ వరకూ టిక్కెట్టు ఇచ్చాడు.

మిగతా యాత్రికులతో కలిసి ఆమె ఎలాగో షిరిడీకి చేరుకుంది. సమాధి మందిరానికి దగ్గరలోనే ఉండడానికి గదిని సంపాదించింది.
రాత్రి ఎనిమిది గంటలకి చీకట్లో ఆమె సమాధిమందిరంలోనికి ప్రవేశించింది.

సమాధిమందిరం వెనుకనున్న మెట్లకు రైలింగ్స్ అప్పట్లో వుండేవి కావు. ఆ సంగతి ఆమె కి తెలియదు.

మెట్లెక్కబోతూ ఆమె పడిపోయింది, తీవ్రంగా శరీరం గీసికు పోయింది.

ఆ అరవై సంవత్సరాల మహిళ మోకాళ్లూ, నుదురూ విపరీతంగా రక్తసిక్తమయ్యాయి.

బాలవాలి ని కలిసి మెట్లేక్కుతూ పడిపోయాననీ, తీవ్రంగా గీసుకు పోయిందనీ తమిళంలో చెప్పింది.

అతనామెని డాక్టరు దగ్గరికి తీసికుని వెడతానన్నాడు.

అప్పుడాయనకి చెప్పిన ఈ లీల అపూర్వమైనదీ, విడ్డూరమైనదీను.

“నేను పడిపోయిన సమయానికి నేను నా పక్కన ఒక వ్యక్తి నిలబడి వుండడం చూసాను.

నేను తలెత్తి చూద్దును గదా ఆయన స్వయంగా శ్రీ సాయిబాబా యే. ఆయన చేతిలో లాంతరు పట్టుకుని నిలబడివున్నారు.

తనకి దెబ్బలు తగిలిన ప్రదేశాలలో మెల్లిగా ఒత్తారు. మరుసటి రొజుకి అంతా సరయిపోతుందని మాటిచ్చారు,

అందువలన నాకేమీ చికిత్స అవుసరం లేదు”. ఆమె తన గదికి పోయి ఏమీ జరగనట్లుగానే నిద్రపోయింది.

అర్దరాత్రి కలలో బాబా ఆమెకి స్వప్న సాక్షాత్కారమిచ్చి ఆమె బిడ్డని తను కాపాడతాననీ, ఆమె బెంగపడనవుసరంలేదనీ చెప్పారు.
సాయి సుధ, సంపుటి: 5 సంచిక: 8, జూన్ 1945.

సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com
whatsapp 7033779935
Voice call: 9437366096

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles