Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-164-0912-కేశవ్ భగవాన్ గావన్ కర్-4 5:31
అయిదవ రోజు సూర్యోదయానికి ముందే కేశవ్ బాబా దర్శనానికి వెళ్ళాడు.
అప్పుడు బాబా ధుని ముందు కూర్చుని ఉన్నారు. భాగోజీ షిండే బాబా చేతికి ఉన్న కట్లు విప్పుతున్నాడు.
కేశవ్ అక్కడికి వచ్చి నుంచుని ఉండటం చూసి, వెంటనె తన వద్దకు రమ్మని పిలిచి తన ముందు కూర్చోమన్నారు.
కేశవ్ కూర్చున్న వెంటనే అతని చెంప మీద లాగి కొట్టారు. ఆయన ఎంత గట్టిగా కొట్టారంటే ఆ వేగానికి కేశవ్ నెత్తి మీద ఉన్న టోపీ ఎగిరి పడింది.
ఏడవ రోజున కేశవ్ తో సహా కుటుంబమంతా తిరుగు ప్రయాణానికి అనుమతి కోసం బాబా దగ్గరకు వెళ్ళారు. అందరూ బాబాకి నమస్కారం చేసుకున్నారు.
కేశవ్ కూడా బాబా కి నమస్కారం చేశాడు. బాబా అతని చేయి పట్టుకుని ముందుకు లాగి కూర్చోబెట్టారు.
అప్పుడు బాబా అతని మొహం మీద చాలా గట్టిగా ఒక్క చరుపు చరిచారు. చరిచిన తరువాత గుప్పిటనిండా ఊదీని ఇచ్చి ‘ఇక వెళ్ళు, అల్లా భలా కరేగా (దేవుడు నీకు మేలు చేస్తాడు)” అన్నారు.
ఆ విధంగా బాబావారి దీవెనలు అందుకుని అందరూ ఇంటికి తిరిగి వచ్చారు.
1938 వ.సంవత్సరంలో గావన్ కర్ గారికి ఒక కల వచ్చింది.
ఆ కలలో బాబా దర్శనమిచ్చి బాలా (అబ్బాయీ) నానుంచి నీకేమి సహాయం కావాలి? ఇక నుంచి రామనవమి ఉత్సవాలకి నాకు ఒక ఉయ్యాల కట్టు” అని అడిగారు.
ఆ విధంగా హిందూ కాలండర్ ప్రకారం మొట్టమొదటి రామనవమి ఉత్సవాలు చైత్ర శుధ్ధ పాడ్యమిలో ప్రారంభమయ్యాయి.
డాక్టర్ గారు చక్కటి అందమయిన ఉయ్యాలను తయారు చేయించారు.
అంత అందమయిన ఉయ్యాలకి సమానంగా సుందరమయిన రాములవారి విగ్రహం సంపాదించాలి.
స్నేహితులు, బంధువులు అందరూ కలిసి రెండు నెలలపాటు పెద్ద స్థాయినుంచి, చిన్న స్థాయి వరకు అన్ని విగ్రహాలకోసం ఎంతో వెతికారు.
కాని ఆ ఉయ్యాలకి తగిన విగ్రహం మాత్రం దొరకలేదు. ఇంక ఆఖరికి చేసేదేమీ లేక రాములవారి చిత్ర పటాన్ని ఉయ్యాలలో పెడదామని నిర్ణయించారు.
చిత్ర పటాన్ని తీసుకుని వచ్చారు. రామనవమి ఉత్సవాలు ప్రారంభమయాయి.
కాని గావన్ కర్ గారికి మాత్రం తృప్తిగా లేదు. ఆయన బాబా ఫొటొ ముందు కూర్చుని “దేవా! నువ్వు కోరినట్లుగానే రామనవమి ఉత్సవాన్ని ప్రారంభించాను.
కాని, ఉయ్యాలలో పెట్టడానికి తగిన రామ విగ్రహం మాత్రం లభించలేదు.
అందమయిన ఉయ్యాలలో పెట్టడానికి తగిన అందమయిన రామ విగ్రహం దొరికేంత వరకు నేను ఎటువంటి ఆహారాన్ని తీసుకోను” అని కన్నీళ్ళతో ప్రార్ధించాడు.
అప్పటినుండి మంచినీరు మాత్రమే తీసుకుంటూ, తన రోజువారీ కార్యక్రమాలను ఎప్పటిలాగానే నిర్వహించుకుంటూ ఉన్నాడు. ఆ సంవత్సరం రామనవమి శనివారం వచ్చింది.
ఆ రోజు గురువారం. అప్పటికీ విగ్రహం లభ్యం కాలేదు. ఇక రెండు రోజులే ఉంది రామనవమికి. యధాప్రకారంగా ఆయన తన క్లినిక్ కి వెళ్ళారు. పేషెంట్లు చాలా మంది వచ్చారు.
అందరూ తమ తమ వంతుల ప్రకారం ఒక వరుసలో కూర్చుని ఉన్నారు. వారిలో ఒక క్రొత్త పేషెంటు కనపడ్డాడు. అతనిని ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన చూడలేదు.
డా.గావన్ కర్ అతని దగ్గరకు వెళ్ళి అతని ఆరోగ్యం గురించి అడిగాడు. “నా వంతు వచ్చేవరకు నేను వేచి ఉంటాను. అప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాను” అని సమాధానమిచ్చాడు.
అతని వంతు రాగానే డాక్టర్ గారి ముందుకు వచ్చి నిలుచున్నాడు.
అతను చొక్కా మీద కోటు ధరించి ఉన్నాడు. తలకు పాతకాలపు తలపాగా, కాళ్ళకు పాతకాలపు బూట్లు ధరించాడు.
అతను చూడటానికి యశ్వంతదేశ్ పాండేకి సహాయం చేసిన మనిషిలాగ దుస్తులు ధరించి ఉన్నాడు.
అతను గావన్ కర్ దగ్గిరకి వచ్చి చేతిలో ఒక పాకెట్ పెట్టి “ఇక వెళ్ళి వస్తానని” చెప్పి వెళ్ళిపోయాడు.
ఏం జరుగుతోందో ఒక్క క్షణం గావన్ కర్ కి అర్ధం కాలేదు. తన చేతిలో ఉన్న పాకెట్ ని విప్పి చూశాడు.
ఆశ్చర్యంతో అతని కళ్లు పెద్దవయ్యాయి. అది అందమయిన రాములవారి విగ్రహం.
అంత సుందరమయిన విగ్రహాన్ని చూసి ఎంతో ఆనందపడ్డాడు.
ఆ వెంటనే ‘దేవా, నువ్వు వచ్చినా నిన్ను గుర్తించలేకపోయానే’ అని పశ్చాత్తాపంతో ఎంతో బాధతో విలపించాడు.
కుర్లాలో ఉన్న వారి ఇంటిలో ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ రామనవమి, విజయదశమి ఉత్సవాలను జరుపుకోవడం ప్రారంభించారు.
ఈ రెండు ఉత్సవాలకి ఆయన అన్నదానం చేసేవారు.
1939 వ.సంవత్సరంలో ఆయనకి ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా దర్శనమిచ్చి, “భిక్షేచ భక్రి లేగోడె” (భిక్ష ద్వారా లభించిన భక్రి చాలా మధురంగా ఉంది) అన్నారు.
గావన్ కర్ భిక్ష ద్వారా జొన్నలు సంపాదించదలచుకొన్నారు.
ఈ సంఘటన ఆయన బొంబాయిలో సునీల్ మాన్షన్ లో ఉన్నపుడు జరిగింది.
అతనికి ఏడు రాశులు (50 కేజీలు ) జొన్నలు లభించాయి. వాటినుండి ఝుంకా భకార్ తయారు చేశారు. (భక్రి — జొన్న రొట్టె ఝుంకా – తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపిండితో చేయబడే చట్నీ)
http://telugublogofshirdisai.blogspot.co.ke/2016/04/blog-post_30.html ద్వార సేకరించడం జరిగింది.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- వచ్చే గురు పౌర్ణమికి చాలినంత బియ్యాన్ని నిలవ చేసి ఉంచండి.–కేశవ్ భగవాన్ గావన్ కర్–6–Audio
- రా, లేచి నా కధలను వ్రాయడం ప్రారంభించు–కేశవ్ భగవాన్ గావన్ కర్-5–Audio
- కేశవ్ మెల్ల మెల్లగా పూర్తిగా కోలుకున్నాడు–కేశవ్ భగవాన్ గావన్ కర్-2–Audio
- పిల్లవానికి ఆరోగ్యం చేకూరగానే మొక్కు చెల్లించండి–Audio
- స్వామి శరణానంద నాల్గవ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబా అతని మొహం మీద చాలా గట్టిగా ఒక్క చరుపు చరిచారు–కేశవ్ భగవాన్ గావన్ కర్-4–Audio”
kishore Babu
June 23, 2016 at 9:34 amఈ లీలా ద్వారా సాయి బాబా వారు మనలోని ఉన్న మాయను కొడుతున్నారు అని మనం గ్రహించాలి. మనం బాగా గమనించి నాట్లు అయితే బాబా వారు ఎవరిని అయితే కొడతారో వారి పాప కర్మలు నశించి తద్వారా వారి జీవితం చాలా ఆనందముగా సాగిపోయేది.