Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-159-0612-పిల్లవానికి ఆరోగ్యం 7:53
బాయికి వాయవ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసై గ్రామమయిన బెస్తలపల్లె ఆర్నాల గ్రామంలో డా.కేశవ భగవాన్ గావన్ కర్ గారు 28.04.1906 వ.సంవత్సరం శనివారం, వైశాఖ శుక్ల పక్ష పంచమినాడు (శక సం.1828) లో జన్మించారు. (ఈయనని ప్రేమగా అప్పాసాహిబ్ అని కూడా పిలిచేవారు).
ఆయన పూర్వీకులు కూడా ఆర్నాల గ్రామానికి చెందినవారే. వారి కుటుంబమంతా ప్రతి రోజు ఎంతో భక్తి శ్రధ్ధలతో గణేశుడిని పూజిస్తూ ఉండేవారు.
ఆయన అనుగ్రహం వారందరికీ పుష్కలంగా ఉంది. కుటుంబంలోనివారంతా ఎంతో భక్తి తత్పరులు.
ఆయన తండ్రి భగవాన్ వంట చెరకు, బొగ్గులు అమ్మే కాంట్రాక్టరుగా ఉండేవారు.
వంటచెరకు, బొగ్గులు అన్నీ తీసుకు రావడానికి అడవికి వెడుతూ ఉండేవారు.
అందుచేత ఆయన ఇంటి పట్టున ఎక్కువగా ఉండేవారు కాదు. వారిది పెద్ద ఉమ్మడి కుటుంబం. కష్టసుఖాలన్నిటిని అందరూ కలిసి పంచుకుంటూ ఉండేవారు.
అంతా కలివిడిగా ఉండేవారు. ఆయన మేనమామ విఠల్ కాకా గారికి విఠోబాఅన్నా పురందరే అనే గొప్ప జ్యోతిష్య శాస్త్రజ్ణుడితో బాగా పరిచయం ఉంది. ఆయన కేశవ్ జాతకం వేసి చూశాడు.
అతని జాతకం చూసి ఆయన ఉబ్బి తబ్బిబ్బయ్యారు. పిల్లవాడు మహా పురుషుడుగా ఖ్యాతి వహిస్తాడని చెప్పారు.
పిల్లవానికి నామకరణ మహోత్సవం రోజున స్నేహితులు, బంధువులు అందరూ వచ్చారు.
తండ్రి తన కుమారునికి ‘రామ్’ అని నామకరణం చేద్దామన్నాడు.
కాని కుటుంబంలొ మరికొందరు ‘మధుకర్’ అని పేరు పెడదామన్నారు. ఆఖరికి అందరూ కలిసి ‘రామ్’ అని నామకరణం చేయడానికి నిర్ణయించారు.
నామకరణం చేయడానికి పిల్లవాడిని ఉయ్యాలలో పడుకోబెడుతుండగా, పిల్లవాడు ఆపకుండా ఏడవసాగాడు.
ఎంత సముదాయించినా ఏడుపు ఆపడం లేదు. వైద్యుడు వచ్చి పరీక్షించాడు.
పిల్లవానిలో ఎటువంటి అనారోగ్యం లేదు బాగానే ఉన్నాడని చెప్పాడు.
అతని మేనమామ మళ్ళీ ఒకసారి పిల్లవాడి జాతకం పరిశీలించాడు.
అందులో పిల్లవాడికి ‘కె’ అనే అక్షరంతో ప్రారంభమయే పేరు పట్టాలని ఉంది.
అప్పుడా మేనమామ పిల్లవాని చెవిలో “‘నీకు కేశవ్’ అని పేరు పెడతాము, సరేనా” అని మెల్లగా అన్నాడు.
వెంటనే పిల్లవాడు ఏడుపు మానేశాడు. ఆఖరికి ‘కేశవ్’ అని నామకరణం చేశారు.
ఒక రోజు రాత్రి కేశవ్ ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. అప్పటికి అర్ధరాత్రయింది.
తల్లి ఒకసారి పిల్లవాడు ఎలా ఉన్నాడో చూద్దామనుకుంది.
కాని పూర్తిగా మెలకువలోకి రాలేదు. ఇంకా సగం నిద్రలోనే అలాగే లేచింది. కటిక చీకటిగా ఉంది.
లాంతరు వెలిగిద్దామనుకుంది. లాంతరు వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు వెలుగుతున్న అగ్గిపుల్ల కేశవ్ పక్క బట్టలమీద పడింది.
వెంటనే బట్టలు అంటుకున్నాయి. అతి కష్టం మీద మంటలనార్పింది.
కాని పిల్లవాడికి ఏమీ కాలేదు. సురక్షితంగా ఉన్నాడు.
కేశవ్ బాల్యం చాలా ఆనందంగా గడిచింది.
అతనికి మేనమామ విఠల్ పంత్, మేనత్త తమ్మాబాయి లంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులకి కేశవ అంటే పంచ ప్రాణాలు. అతను వారి ఆశాజ్యోతి.
మిగతా పిల్లలాగే చుట్టుప్రక్కల పిల్లలతో ఆడుతూ ఉండేవాడు. ‘శ్రీ గణేశాయనమహ, ఓం నమహ సిధ్ధ’ అనే మంత్రంతో అతనికి అక్షరాభ్యాసం జరిగింది.
ఏడు సంవత్సరాలు వచ్చేటప్పటికి బడికి వెళ్ళడం మొదలయింది.
ఏడు సంవత్సరాల వయసులో కేశవ్ కి హటాత్తుగా జబ్బు చేసింది.
విపరీతమయిన జ్వరం వచ్చి దగ్గు తో బాధపడసాగాడు.
తల్లి మంచం మీద చక్కగా పక్క వేసి పడుకోబెట్టింది.
కొంత సేపటి తరువాత పిల్లవాడికి ఎలా ఉందోనని శరీరం మీద చేయి వేసి చూసింది.
శరీరం జ్వరంతో పేలిపోతూ ఉంది. వెంటనే వైద్యుడిని పిలిపించారు.
ఆయన బాగా పరీక్షించి ‘ఎంపియెమా’ అని నిర్ధారణ చేశాడు.
ఛాతీ అంతా పూర్తిగా చీముతో నిండి పోయి ఉందని చెప్పాడు (ఊపిరి తిత్తులు, ఛాతీ లోపలి గోడల మధ్య రసి చేరడమే ‘ఎంపియెమా’) ఈ చీము ఒక ద్రవం.
ఇందులో రోగ నిరోధక కణాలు, మృత కణాలు, బాక్టీరియా అన్నీ ఉంటాయి.
న్యుమోనియా తరువాత ఈ స్థితి వస్తుంది. ఇది దగ్గు ద్వారా బయటకు రాదు.
నీడిల్ ద్వారా గాని, సర్జరీ ద్వారా గాని బయటకు తీయాల్సి ఉంటుంది.)
జబ్బు చాలా తీవ్రంగా ఉంది. ప్రతిరోజు జ్వరం చూస్తే 104 డిగ్రీలు ఉంటోంది.
ఎన్నో మందులు వాడారు. అయినా గుణం ఏమీ కనిపించలేదు.
ఎంతో మంది వైద్యులు వచ్చి పరీక్షించారు. ఆఖరికి డా.బద్ కమ్ కర్, ఎమ్.డి., డా.రావు గార్లను పిలిపించారు.
వారు పరీక్షించి సర్జరీ చేయాలని చెప్పారు. విఠల్ కాకా ఇంకా అందరి వైద్యుల అభిప్రాయాలు తెలుసుకున్నాడు.
ఇద్దరు తప్ప అందరూ సర్జరీ చేయడం తప్ప మరో గత్యంతరం లేదని చెప్పారు.
డా.బద్ కమ్ కర్ గారు సర్జరీకి సమ్మతిని తెలపమని, విఠల్ కాకాని అడిగారు. కాని దానికాయన సమ్మతించలేదు. సర్జరీ వల్ల కేశవ్ కి చాలా బాధ కలుగుతుందని, తట్టుకోలేడని, అదీ కాక సర్జరీ చేసిన తరువాత కోలుకుంటాడనే గ్యారంటీ కూడా లేదని అన్నాడు.
అలా మూడు నెలలు గడిచిపోయాయి.
ఇక పిల్లవాడు కోలుకుని ఆరోగ్యవంతుడవుతాడనే ఆశ కూడా లేకుండా పోయింది అందరికీ. ఇలా ఉండగా యశ్వంతరావ్ గాల్వంకర్ తన మామగారయిన అన్నా సాహెబ్ ధబోల్కర్ గారితో కలిసి షిరిడీ వెళ్ళారు.
ఆయన బొంబాయికి తిరిగి వచ్చేటప్పుడు, బాబా ఊదీ, ఆయన పాద తీర్ధం, బాబా ఫొటో తీసుకుని వచ్చారు.
వెంటనే కేశవ్ ఇంటికి వెళ్ళి తను కూడా తెచ్ఛిన పవిత్రమయిన వాటినన్నీ విఠల్ కాకాకి ఇచ్చారు.
వాటిని ఇస్తూ, “కాకా, ఎప్పటినుండో కేశవ్ కి ఎన్నో మందులు వాడారు. కానీ వేటి వల్లా ఉపయోగం లేకుండా పోయింది. బాబా ని ఆశ్రయించండి.
ఏదయినా మొక్కు మొక్కుకోండి. పిల్లవానికి ఆరోగ్యం చేకూరగానే మొక్కు చెల్లించండి” అని చెప్పాడు.
ఎంతో భక్తిగా విఠల్ కాకా బాబా ఫొటోని బల్ల మీద పెట్టాడు.
దీపం వెలిగించి, అగరువత్తుల ధూపం చూపించాడు. ఆరతిచ్చి, బాబా ఫొటోకి దండ వేశాడు.
అంతా అయిన తరువాత బాబా పాదాల వద్ద తన శిరసునుంచి “హే, సాయినాధా, నేను నిన్నెప్పుడూ చూడలేదు. నీ దయ, కరుణల గురించి విన్నాను.
నా మేనల్లుడు కేశవ్ చావు బ్రతుకుల్లో ఉన్నాడు. నా ఈ ప్రార్ధనను మన్నించి వాడి వ్యాధిని నివారించమని నిన్ను వేడుకుంటున్నాను.
ఈ కొబ్బరికాయను నీకు సమర్పిస్తున్నాను.
పిల్లవానికి ఆరోగ్యం చేకూరగానే నీకు అయిదు సేర్ల పాలకోవా సమర్పించుకుంటాను” అని ప్రార్ధించాడు.
తరువాత ఊదీ తీర్ధం రెండిటినీ బాబా పాదాలకు తాకించి కేశవ్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు.
అప్పుడు కేశవ్ స్పృహలో లేడు. తీర్ధం ఒక చుక్కను అతని నోటిలో వేసి, ఊదీని నుదుటికి రాశాడు.
బాబా ఫోటోని అతని చాతీ మీద పెట్టాడు.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- కేశవ్ మెల్ల మెల్లగా పూర్తిగా కోలుకున్నాడు–కేశవ్ భగవాన్ గావన్ కర్-2–Audio
- వచ్చే గురు పౌర్ణమికి చాలినంత బియ్యాన్ని నిలవ చేసి ఉంచండి.–కేశవ్ భగవాన్ గావన్ కర్–6–Audio
- పేరు మార్పు – అంతే …..సాయి@366 జూలై 25…Audio
- బాబుకు ఆరోగ్యం … బాబా నిదర్శనo
- బాబా అతని మొహం మీద చాలా గట్టిగా ఒక్క చరుపు చరిచారు–కేశవ్ భగవాన్ గావన్ కర్-4–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments