Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-162-0812-కేశవ్ మెల్ల మెల్లగా 7:12
విఠల్ కాకా, తమ్మాబాయి ఇద్దరూ కేశవ్ మంచం ప్రక్కనకూర్చుంటూ ఉండేవారు.
రోజూలాగే ఆ రోజు కూడా అతని ప్రక్కనకూర్చున్నారు. అప్పుడు సమయం అర్ధరాత్రి దాటింది. తమ్మాబాయి నిద్రవల్ల జోగుతూ ఉంది. ఆమెకు చాలా స్పష్టంగా ఒకకల వచ్చింది.
కలలో బాబా ఆమె ఇంటికి వచ్చికొబ్బరికాయనిమ్మన్నారు. తమ్మాబాయి బాబా ఫోటోముందు కొబ్బరికాయనుంచి కేశవరావువ్యాధిని నివారణ చేయమని ప్రార్ధించింది.
కొంతసేపటి తర్వాత అదే రోజు రాత్రి బాబా ఆమెకు కలలో దర్శనమిచ్చారు. ఆ తరువాత బాబా పిల్లవాని వద్దకు వెళ్ళి అతని మీద తన పవిత్రమయిన హస్తాన్ని ఉంచి తల దగ్గరనుండి పాదాల వరకు స్పృశించారు.
“అల్లాభలా కరేగా” అని అతనిని దీవించారు. మరుక్షణంలో ఆయన అదృశ్యమయ్యారు. కల ముగిసింది.
కల చెదిరిపోగానే తమ్మాబాయికి మెలకువ వచ్చింది. కేశవ్ మీదచెయ్యి వేసి పరీక్షించింది.
వళ్ళు చల్లగా తగిలింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి పెద్దగా రోదించసాగింది. కేశవ్ చనిపోయాడనుకుంది.
ఇంట్లోని వారంతా ఉలిక్కిపడి లేచి పరుగెత్తుకుని వచ్చారు. ఏంజరిగిందోనని అందరూ చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. మేడ మీద నిద్రపోతున్న డా.గాల్వంకర్ గారు కూడా క్రిందకి దిగివచ్చారు.
కేశవ్ నాడి పట్టుకుని పరీక్షించారు. నాడి బాగా కొట్టుకొంటోంది. జ్వరం కూడా తగ్గిపోయింది.
హాయిగా ఊపిరిపీల్చుకుని శాంతం వహించారు. ఏమీ ఫరవాలేదు అంతా బాగానేఉంది అని చెప్పడంతో అందరూ ఎవరి స్థానాల్లోకి వారు వెళ్ళినిద్రకుపక్రమించారు.ఉదయాన్నే డా.గాల్వంకర్ వచ్చి కేశవ్ ని పరీక్షించారు.
కేశవ్ చొక్కా తడిసిపోయి చాతీకి గట్టిగా అంటుకునిపోయి ఉంది. చొక్కాని నెమ్మదిగా కత్తిరించారు.
కేశవ్కుడి కుచాగ్రం క్రిందుగా చిన్న కన్నం కనిపించింది. దానిలో నుండిరసి కారుతూ ఉంది. గాల్వంకర్ గారు దాని చుట్టూతా గట్టిగానొక్కారు. రసితో కూడిన రక్తం బయటకి బాగా కారసాగింది.
మొత్తమంతా బయటకు వచ్చేశాక కేశవ్ మెల్ల మెల్లగా పూర్తిగా కోలుకున్నాడు. త్వరలోనే పాఠశాలకు తిరిగి వెళ్ళసాగాడు.
క్రమక్రమంగా కేశవ్ పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. మిగతాపిల్లలందరిలాగే పాఠశాలకు వెడుతూ తోటి పిల్లలతో కలిసిఆడుకుంటూ ఉండేవాడు.
కష్టాలు వచ్చినపుడు మానవులుమొక్కులు మొక్కుకోవడం సాధారణమైన విషయం. కానిమొక్కుకున్న మొక్కులను వెంటనే తీర్చడం ఎప్పుడూ సాధ్యంకాదు.
దానికి కారణం మర్చిపోవడమయినా కావచ్చు లేకపరిస్థితుల ప్రాబల్యం వల్ల ఒక్కసారిగా వెంటనే తీర్చడం సాధ్యపడకపోవచ్చు. విఠల్ కాకా విషయంలో కూడా సరిగ్గ ఇదేజరిగింది.
అయిదు సంవత్సరాల తరువాత 1918 జనవరిలో ఎట్టకేలకు షిరిడియాత్రకు బయలుదేరారు. కేశవ్ కూడా తన చిన్న మేనమామరామచంద్ర పంత్, మేనత్త తమ్మాబాయిలతో మొక్కు తీర్చుకోవడానికివెళ్ళాడు.
కేశవ్ అప్పుడు ప్రాధమిక పాఠశాలలో 5వ.తరగతిచదువుతున్నాడు. షిరిడీ వెళ్ళిన మొట్టమొదటి రోజునే సాయిబాబాను దర్శించుకోవడానికి అందరూ ద్వారకామాయికి వెళ్ళారు.
భక్తులందరూ బాబా ముందు నిలబడి ఉన్నారు. ఆకారణంగా కేశవ్, అతని కుటుంబ సభ్యులందరూ తమ వంతు కోసం నిరీక్షిస్తూ ఒక ప్రక్కగా నిలబడి ఉన్నారు. బాబా కేశవ్ వైపు చూసితన వద్దకు రమ్మన్నట్లుగా సైగ చేశారు.
బాబా ఒక అరటి పండు తొక్క వలిచి, ఒక చిన్న పిల్లవానికి తినిపించినట్లుగా కేశవ్ కి తినిపించారు.
అప్పుడు బాబా “అరే, నాపాలకోవా ఏదీ?” అని ప్రశ్నించారు. రామచంద్ర పంత్ ముందుకువెళ్ళి పాలకోవాలు ఉన్న పాకెట్ కేశవ్ కి ఇచ్చాడు.
మొక్కుకున్న ప్రకారం పాలకోవాలు 5 శేర్లు, ఇంకా కొన్ని ఎక్కువగానే ఆ పాకెట్ లో కలిపి తీసుకుని వచ్చారు.
బాబా కేశవ్ చేతిలో నుంచి పాకెట్ తీసుకుని 4 పాలకోవాలు అతనికిచ్చారు. మిగిలినవన్నీ ఒక్కసారిగా నోటిలో వేసుకుని మ్రింగేశారు. ప్రక్కనే ఉన్న శ్యామా “దేవా! ఏమి చేస్తున్నారు మీరు?” అని బాబాని ప్రశ్నించాడు.
బాబా వెంటనే “ఈ పిల్లవాడు నన్ను 5సంవత్సరాల నుంచి ఆకలితో ఉంచాడు. అందుకనే నేనంత ఆత్రంగా తినేశాను” అని సమాధానమిచ్చారు.
అయిదు సంవత్సరాల క్రితం కేశవ్ చావుబ్రతుకులల్లో ఉన్నపుడు బాబా స్వప్నంలో కేశవ్ వ్యాధినినివారణ గావించారు.
వారు సరిగా షిరిడీ ప్రయాణానికి ముందే కేశవ్ కి ఉపనయనం జరిగింది.
వెనకాల పిలక తప్ప మొత్తమంతా గుండుతో ఉన్నాడు. అకస్మాత్తుగా బాబా కేశవ్ పిలక పట్టుకుని బలంగా అతని తలనుముందుకు గుంజి తన పాదాల వద్ద ఉంచుకున్నారు.
బాబా చేసిన ఆ చర్య వల్ల కేశవ్ కి ప్రకాశవంతమయిన వెలుతురు కన్పించింది.
వెన్ను మొదలు నుంచి చివరి వరకు ప్రకంపనలుకలిగాయి. అదే సమయంలో అతని శరీరమంతా వణకసాగింది. ఆవిధంగా బాబా ఆ బాలుడిని ఆశీర్వదించారు.
బాబా కేశవ్ కళ్ళలోకి చూస్తూ రెండు పైసలు దక్షిణ అడిగారు.
కేశవ్ ప్రక్కనే ఉన్న శ్యామా అతని చేతిని పట్టుకుని బాబా వైపు చాపించారు. శ్యామా చేసిన చేష్ట కేశవ్, బాబా కి దక్షిణ సమర్పిస్తున్నట్లుగా ఉంది.
బాబా కూడా కేశవ్ ఇస్తున్న దక్షిణను స్వీకరిస్తున్నట్లుగా తన కుడిచేతిని ముందుకు చాపారు. శ్యామా కేశవ్ తో ‘దియా ‘ (సమర్పించానని) అని చెప్పు అన్నాడు. బాబా దక్షిణను స్వీకరించినట్లుగా నటించి ‘లియా’ (తీసుకున్నాను) అన్నారు.
అలా అంటూ దక్షిణను తన కఫనీ జేబులో దాచుకున్నట్లుగా నటిస్తూ చేతిని కఫనీ జేబులో ఉంచుకున్నారు.
వెంటనే ఎంతో వేగంగా తన కఫనీని తీసి కేశవ్ మీద కప్పారు. ఇది జరుగుతున్నంత సేపు కేశవ్ ఎంతో తన్మయత్వంలో ఉన్నాడు. అతని శరీరంలో ప్రకంపనలు ఇంకా కలుగుతూనే ఉన్నాయి.
అక్కడ ఉన్న ప్రతివారు బాబా మహాప్రసాదంగా ఇచ్చిన కఫని ధరించడానికి కేశవ్ చాలా చిన్నవాడని భావించారు.
శ్యామా కేశవ్ తరఫున మధ్యలో కల్పించుకుని “దేవా, కేశవ్ కి ఇచ్చిన ఈ కఫనీని నా దగ్గిర భద్రపరుస్తాను.
అతను పెద్దవాడయిన తరువాత అతనికి ఇస్తాను” అన్నాడు. ఆ తరువాత కేశవ్ కి బాబా ఇచ్చిన కఫనీని తన వద్ద ఉంచుకుని అతను పెద్దవాడయిన తరువాత ఇచ్చాడు.
ఆ తరువాత అతని వారసులు ఆ కఫనీని జాగ్రత్తగా భద్రపరిచారు.
http://telugublogofshirdisai.blogspot.co.ke/2016/04/blog-post_30.html ద్వార సేకరించడం జరిగింది.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా అతని మొహం మీద చాలా గట్టిగా ఒక్క చరుపు చరిచారు–కేశవ్ భగవాన్ గావన్ కర్-4–Audio
- వచ్చే గురు పౌర్ణమికి చాలినంత బియ్యాన్ని నిలవ చేసి ఉంచండి.–కేశవ్ భగవాన్ గావన్ కర్–6–Audio
- రా, లేచి నా కధలను వ్రాయడం ప్రారంభించు–కేశవ్ భగవాన్ గావన్ కర్-5–Audio
- అధ్బుతం—కోడలియొక్క మతిభ్రమణం పూర్తిగా నయమయింది.–Audio
- పిల్లవానికి ఆరోగ్యం చేకూరగానే మొక్కు చెల్లించండి–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments