Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-163-0812-మందిర నిర్మాణానికి 3:09
మీరాబాయి మరికొందరు భక్తులూ కలిసి శ్రీ సాయి సేవా మండలి గా డిసెంబర్ 1984 ఏర్పడి బాబా భజనలూ మరియూ స్తోత్రాలూ చేస్తూ వుండేవారు.
సుమారు ఏభై మంది భక్తులు అంతకు ముందు సంవత్సరం షిరిడీకి బాబా దర్శనానికై వచ్చారు. వారు నానా సాహెబ్ రస్నే ను కలిసారు.
ఆయన ’బాబా మిమ్ముల్ని కలవమనీ, మీరు చేయబోయే ఒకముఖ్యమైన పనిలో మీకు మార్గదర్శకత్వం చూపమనీ నన్నాదేశించారు.
విజయవాడ కి సమీపంలో మీరు త్వరలో బాబా మందిరం నిర్మించబోతున్నారు’ అని చెప్పారు. ఈ భక్తులంతా ఆ మాటలకి ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే మందిరం నిర్మించాలని వారసలు అనుకోలేదు.
ఎనభై అయిదవ సంవత్సరం నాటికి నానా సాహెబ్ రస్నే మాట నిజమవడానికి భీజాలు పడ్డాయి. గోపాల్ సింగ్ కృష్టానది ఒడ్డున ఏడువందల ఏభై చదరపు అడుగుల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు.
జూన్ లో శంఖుస్థాపన జరిగింది. సుమారు అయిదువందలకి అన్న సంతర్పణ జరిగింది.
అందరూ వెళ్లిపోయిన తర్వాత బాబా ఫకీరు రూపంలో అక్కడికి వచ్చారు. మందిరం బాగా అభివృద్ది చెందుతుందని ఆశీర్వదించి కొద్దిగా ప్రసాదం పెట్టమని అడిగారు. ఎంతగానో వెతికిని తర్వాత గిన్నెలకి అంటుకుని మిగిలిన ప్రసాదాన్ని ఆయనకివ్వడం జరిగింది. ’నేను మహరాష్ట్ర్ర నుండి వచ్చాను. ఇరవై సంవత్సరాల ముందు ఒకసారి వచ్చాను. మళ్లీ ఇప్పుడు ఒక సదుద్దేశ్యంతో వచ్చాను’ అన్నారు. ఆ తరువాత మందిరం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఎలా వచ్చారో అలాగే మాయమయిపోయారు.
ఆ తరువాత మందిర సభ్యులు విరాళాలని లెక్కిస్తున్నప్పుడు ఒక అపరిచుడు మోటార్ సైకిల్ పై వచ్చి ఆగి, వారికి కొంత సొమ్ము ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా ఆ సొము సరిగ్గా తొమ్మిది రూపాయ నాణెములు, గిరిధర్ సింగ్ కి ఇచ్చి బాబా కోసం వినియోగించమని చెప్పారు. ఆ తరువాత ఓమ్ నమో సాయి రామ్, గురు సాయి రామ్ అన్న మాటల్ని ఒక కాగితం మీద వ్రాసి పెద్ద అక్షరాలతో ఆ మాటల్ని చెక్కించి విగ్రహానికి సమీపంలో పెట్టమని చెప్పారు. అలాగే ఒక వేప చెట్టుని, క్రైస్తవులు పవిత్రంగా భావించె కరోల్ చెట్టునీ అక్కడ మందిరానికి ఇరువైపులా పాతించమని చెప్పారు. తద్వారా అందరికి ఆశీస్సులు లభిస్తాయని చెప్పారు. ఎలా వచ్చారో అలాగే మాయమయిన ఆయన మళ్లీ ఎవరికీ కనిపించలేదు.
ఒక వారం తర్వాత ఇద్దరు మండలి సభ్యులకి బాబా స్వప్న దర్శనమిచ్చి ఆరోజు మందిర శంఖుస్థాపనకి వచ్చి తన ఆశీస్సులనందజేసానని చెప్పారు.
సాయిలీల, సంపుటి 64, సంచిక 10, జనవరి 1985 నుండి
సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com
whatsapp 7033779935
Voice call: 9437366096
Latest Miracles:
- తన మందిర (దిల్ సుఖ్ నగర్ బాబా గుడి) నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించిన బాబా వారు
- బాబా మందిర నిర్మాణము
- మందిర నిర్మాణం – మారిన మనసులు
- మందిర మొదటి మెట్టు కూడా ఎక్కని విద్యార్థి, తరువాత తన జీవిత పర్యంతం బాబా పట్ల శరణాగతి చూపుట–Audio
- భాగ్యనగరిలో సాయి ఫకీరు…..సాయి@366 జూన్ 14….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments