Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: భాగ్యలక్ష్మి
నివాసం: కొండాపూర్, హైదరాబాద్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!
నాకు 1990 సంవత్సరం పూర్వం బాబా గురించి అంతగా తెలియదు.
కావలి దగ్గర బిట్రగుంటలో సాయి బాబా మందిరంనకు తొలిసారి వెళ్ళడం జరిగింది.
అక్కడ భక్తులు పాడే ఒక పాట నన్ను అమితంగా (మందిరం నిర్మాణమునకు సంభందించి) ఆకట్టుకుంది.
అక్కడ బాబా విగ్రహం చూస్తున్నప్పుడు నన్నుబాబా తన దానిగా పిలుస్తున్న అనుభవం కలిగింది.
కొద్దిరోజులు తరువాత మా వారి (నాగేశ్వరరావు) Executive Engineer గారు శిరిడీ వెళ్తూ మా వారి దగ్గర 50 రూపాయలు అడిగి తీసుకొని, వచ్చేటప్పుడు బాబా విగ్రహం తీసుకొని వస్తాను అని చెప్పారు.
ఈ ఈ (Executive Engineer) గారు ఒక రోజు అటెండర్ ద్వారా బాబా విగ్రహంతో పాటు శిరిడీ ప్రసాదం పంపించారు.
ఇప్పుడే పూజ చేయించి ప్రసాదం తీసుకొని రమ్మని అటెండరుకు చెప్పారట.
ఆవిధంగా బాబా ఇంటికి వచ్చారు.
అటెండర్ గారు బాబా మూర్తి తీసుకొని రాగానే బాబా గారికి పూజ చేసాము.
తర్వాత అటెండర్ గారు ద్వారా E.E. గారికి ప్రసాదం పంపించాము.
1990 సంవత్సరంలో మా వారు స్వర్గస్థులైనారు.
అప్పుడు నా పరిస్థితి అగమ్య గోచరంగా అయ్యింది.
ఆ సమయంలో మా ఆఫీసులో పనిచేసే సత్యనారాయణ, రాజేశ్వరి గార్లు శిరిడీ వెళ్తు, నీకు ఏమైనాసమస్యలు ఉంటే లెటర్ లో వ్రాసి మాకు ఇవ్వు, మేము మా గురువు గారికి ఇస్తాం అని చెప్పారు.
ఆ తరువాత నేను నెల్లూరులో నరేంద్ర గారి సత్సంగంనకు అటెండ్ అవుతూ ఉండేదాన్ని.
నేను మొట్టమొదటి సారిగా గురువు గారి దర్శనం 1994 తిరుమలలో చేసుకున్నాను.
ఒకసారి ఒంగోలులో గురుబంధువులతో నరేంద్ర గారు గురువు గారి ఆదర్శములకు అనుగుణంగా 500 గజాలలో హైదరబాద్ లో మందిర నిర్మాణం చేస్తే బాగుంటుంది అని అన్నారు.
అది నా మనసులో బలంగా నాటుకొనిపోయింది.
ఒకసారి గురువు గారు కలలో నాతో 100 గజాలలో బాబా మందిర నిర్మాణం చేసుకోవచ్చు కదా! అని అన్నారు.
1994 లో అప్పటి వరకు పోగుచేసిన పెన్షన్ డబ్బులతో కొండాపూర్ లో 400 గజాల స్థలం కొన్నాను.
ఆ స్థలం అనేక సమస్యలతో ఉండటం వలన నేను బాబానీ ప్రార్దించాను.
సమస్యలు ఏమి లేకుండా నా స్థలం నాకు వస్తే 200 గజాల స్థలం మీ మందిరంనకు కేటాయిస్తానని మొక్కుకొన్నాను.
కొద్ది రోజులలో మా ప్లాట్ కు ఉన్న సమస్యలు అన్ని సమసిపోయాయి.
తరువాత మా ప్లాటు ప్రక్కనే ఉన్న ఆయనకు నా ఆలోచన నచ్చి తన 900 గజాల స్థలం బాబా మందిరంనకు ఇస్తానన్నారు.
ఆ స్థలం కూడా వివాదంలో ఉంది.
బాబా మీద భారం వేసి మందిర నిర్మాణం ప్రారంభించాం.
నిర్మాణం మధ్యలో వేరే వారు ఆ స్థలం మాది అని గొడవకు దిగారు.
తరువాత వారంతట వారుగా మనసు మార్చుకొని బాబా మందిర నిర్మాణంనకు మేము ఎటువంటి అభ్యతరం చెప్పమని వెళ్ళిపోయారు.
బాబా, గురువు గారి దయవలన పోయిన డిశంబర్ 25 నాటికీ 5 వార్షికోత్సవములు బాగా జరుపుకున్నాం.
మందిరంనకు వచ్చే భక్తులు బాబా, గురువు గారి దయవలన మంచి మంచి అనుభవములు పొందుతున్నారు.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
*** సాయి సూక్తి:
“నీ జాతకంలో బిడ్డలు కనే యోగం లేదు. నేను నా దేహాన్ని చీల్చి నీకు బిడ్డను ప్రసాదించాను “
Latest Miracles:
- మందిర నిర్మాణం – మారిన మనసులు-Audio
- ఒడిదుడుకులు లేకుండా బాబా మందిర నిర్మాణం పూర్తి అవుట.
- బీద భక్తుని సంకల్పాన్ని(బాబా మందిర నిర్మాణం) తానే స్వయంగా పూర్తీ చేయించుకున్న బాబా వారు
- తన మందిర (దిల్ సుఖ్ నగర్ బాబా గుడి) నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించిన బాబా వారు
- బాబా మందిర నిర్మాణము
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments