జయ్ శ్రీ సాయిగురు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

అతితెలివి అనర్ధానికి హేతువు కాకతప్పదు.
+++++

ఓం సకలదేవతా స్వరూపాయనమః అని , షిర్డీలో ప్రతినిత్యం అష్టోత్తరంలో వినిపించేమంత్రం ..

యిదే అనుసరించే ప్రతి ఇంటా పూజాక్రతువుల్లో కూడా చదుకొనే మంత్రం ..

అందించినది , అర్ధంచేసుకుని అనుసరిస్తె , అది విస్వాసంగా మారుతుంది.

అందులోని మూలార్ధాన్ని గ్రహిస్తే , ఎందరి దేవీ , దేవతలను దర్శించినా , నిత్యమూ ఆరాధించే మంత్రప్రభావం , ఆ మంత్రానికి మూలమైన రూపమే అన్నిటా చూడగలిగే అనుభూతికి మనసు లోనౌతుంది ..

అంతకంటే విపరీతార్ధాలు తీసుకొంటే , అది అధికప్రసంగానికి దారితీయవొచ్చు ..

సచ్చరిత్ర మరాఠీ భాషలో మొదటి మూలగ్రంధంగా లోకానికి పరిచయమయింది ..

పలుప్రాంతాల భక్తులు , వారి వారి భాషా సౌలభ్యంకోసం అన్ని భాషల్లో మూలాన్ని తర్జుమా చేయించి , సంస్థానంలోని పూర్వపెద్దలు , ఆయన సద్బోధలను అందరూ అనుసరించి , యోగ్యతని పొందాలని సదుద్దేశ్యంతో అందించారు ..

అలా 1953 సంవత్సరంలో మొట్టమొదట తెలుగులోసచ్చరిత్ర అందించబడింది ..

ఆ తర్వాత ఇప్పటివరకూ అనేకమంది అదే మూలాన్ని స్వేఛ్చనువాదం చేసి విశ్లేషణా పూర్వకంగా అందిoచినవీ ఉన్నాయి …

అన్వేషణ మొదలై , మానవ మేధస్సు ఎదిగేకొద్దీ , నిన్న కనుగొన్నదానికన్నా , రేపటికి మెరుగైన ఆలొచన అందుతుంటుంది ..

అన్వేషించేకొద్దీ , సైన్సుకు ఒక అంతముండదు ..

సృష్టి ఎప్పుడొ ఆవిర్భవించింది , అందులొ ఆవిర్భవించిన సూర్యచంద్ర ఖగోళాలు,భూమీ , ఆకాశం , సముద్రాలలాంటివి చెదరక అప్పటినుండి తటస్థనంగానే ఉన్నాయి ..

వాటిని అనుభవించిన చక్రవర్తులమొదలూ సామాన్యులవరకూ , పండిత పామరులూ , చివరకి పురాణాలలోని అవతారాలుకూడా వారి వారి పాత్రలను పోషించి , ఈ రంగస్థలంనుండి నిష్క్రమించినవారే ..

ప్రకృతిని కాపాడుకొక , కాలుష్యాన్ని పొషిచడంవలన , వాతావరణం మారుతూ , అది మనిషి ఆరోగ్యానికే ప్రమాదగంటికలు మోగిస్తోంది ..

యుగధర్మానికి హానిసంభవిస్తే , అది ప్రళయానికే దారితీస్తుంది ..

ఎప్పటికి తటస్థoగా ఉండే వేదాలు , సద్గ్రంథాలు , సత్పురుషులబోధలలోని మూలాలనే స్వార్ధప్రయోజానాలకోసం అధిక ప్రసంగాలతో , అర్ధంలేని తలతిక్క ప్రచారాలు మొదలుపెడితె , భావితరాలకు అదే శాపమై కూర్చొనగలదని పెద్దలమాట ..

జయ్ శ్రీ సాయి గురుభ్యోనమః
**

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles