Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-39-1019 శ్రీ సాయిబాబా అనుగ్రహమునకు శ్రీ భరద్వాజ గారు 2:50
శ్రీ వేదవ్యాసాగారు తమ్ముడైన భరద్వాజగారిని షిరిడీ వెళదాము రమ్మని అడుగగా “మనము పొందవలసినది ఏమైనా యున్న, అది మన స్వయం కృషిపైననే ఆధారపడి యుండును.
శ్రీ సాయిబాబా కాని మరొకరుకాని దానికి సహాయపడలేరని, అందువలన షిరిడీ వెళ్ళుట వలన ప్రయోజనములేదని, తాను శిరిడి రానని అన్నగారితో భరద్వాజగారు చెప్పిరి.
అన్నగారు నాకు తోడుగా రమ్మని కోరగా, తనకు విశ్వాసము లేకపోయినా 1963 ఫిబ్రవరిలో వేదవ్యాసుతో కలసి శ్రీభరద్వాజ మాస్టారు షిరిడీ వెళ్లిరి.
ఇక్కడ మనకు శ్రీసాయి సచ్చరిత్ర రచయిత శ్రీ అన్నాసాహెబ్ దాభోల్కర్ గుర్తుకు రాక తప్పదు.
అతని మిత్రుని కుమారుడు చనిపోవుటచే అతను షిరిడీ వెళ్ళి ప్రయోజనమేమని మనుకొనగా నానాసాహెబ్ చాందోర్కరు ప్రేరణతో షిరిడీ వెళ్ళినాడు కదా!
అలా ఫిబ్రవరి 8 వ తేదీ సాయంత్రము శిరిడీ చేరిరి. సమాధి మందిరములో ఆరతి జరుగు సమయమునకు మందిరము లోనికి వెళ్ళిరి.
లోపల అరుగు మీద బాబా పాలరాతి విగ్రహముండుట పురుషులు – స్త్రీలు నిలబడి ఆరతి పాటలను పాడుట వీరు చూచిరి.
అప్పటి వారి ఆలోచనా స్థితిని బట్టి ఎప్పుడో చనిపోయిన వ్యక్తి మీద ఇంత భక్తి శ్రద్ధలు వీరికి ఎలా కలిగినవని మాస్టారుగారు ఆశ్చర్యమును చెందిరి.
ఆరతి పూర్తియైన తరువాత వేదవ్యాసు గారు తమ్ముని సమాధి వద్దకు తీసుకొని వెళ్ళి శ్రీ సాయిబాబా భౌతిక దేహమును 1918 లో చలించగా ఆ శరీరమును ఇందులో యుంచి సమాధి చేసిరని చెప్పిరి.
వారి మాటలు వినగానే శ్రీ భరద్వాజ గారికి కడుపులో తిప్పినట్లయి ” అన్ని సంవత్సరముల క్రితం ఆ దేహమును ఇందులో సమాధి చేశారు కదా!
మరి ఆ శరీరం ఇప్పటికి ఎంతగా కుళ్ళిపోయి ఉంటుందో కదా! అణు ఊహ మాస్టారు గారికి కలిగి, ఆ దుర్వాసన రాకుండుటకు కాబోలు ఇక్కడ అంత ధూపము వేస్తున్నారు”
అని అనిపించి, వెంటనే తమబసకు వెళ్ళి రాత్రికి భోజనం కూడా చేయకుండా వారు నిదురపోయిరి.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ సాయిబాబా నివేదన శివనేశన్ స్వామికి భోజనమగుట.
- శ్రీ సాయిబాబా సశరీరముతో తీర్థమును యిచ్చుట–Audio
- శ్రీ షిరిడి సాయిబాబా చాలీసా(షిరిడీవాస సాయిప్రభో)…Audio
- శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణతొ అప్పాజిసుతార్ వ్యాధి నయమగుట–Audio
- మూకం కరోతి వాచాలం …..సాయి@366 మార్చి 29….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “శ్రీ సాయిబాబా అనుగ్రహమునకు శ్రీ భరద్వాజ గారు పాత్రులగుట–Audio”
kishore Babu
July 10, 2016 at 5:42 amసాయి బాబా వారిగురించి తెలియనప్పుడు నేను కూడా, నా మనస్సులో ఒక మానవుని వలె జన్మించిన గురువు మహిమలు చేయ కలుగుతారు అని అనుకునేవాడిని , కానీ ఇప్పుడు మహిమలతో పని ఏముంది, ఈ సృష్టిని సాయి బాబా వారు సృష్టించారు అని అర్ధమయింది.
సాయి బాబా వారు ఒకసారి నా వయస్సు లక్షల సవంత్సరాలు అని చెబుతారు. దాని బట్టి సృష్టి పుట్టక ముందునుంచి ఉన్నారు అన్న మాటే కదా…ఇప్పుడు ఆయన దయవలన బాబా వారే సేవే జీవితం అయింది. బాబా వారి భక్తులకు మనవి..మీరు ఈ క్రింది వెబ్సైట్ ల ద్వారా కూడా సాయి బాబా వారి ఇన్ఫోర్మషన్ పొందవచ్చు.
http://saileelas.com/Home.html
http://saileelas.com/solutions/
http://sadguruleela.com/
http://saibabatemples.org/
Thanks and REgards,
K Kishore Babu
http://kishoremaths.in/