Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-47-1019-మందులతో నయం కానట్టి భక్తురాలి 3:56
ఈ రోజు ఈ సాయి లీల రాయగలుగుతున్నానంటే దానికి కారణం ఆ సాయినాధుడే. మేము అందరం పరోలా జిల్లా, జలగావ్ లో వుండేవాళ్ళం.
2007 సంవత్సరం జూలై నెల కాలు కదలడం ఆగిపోయింది. నడవలేక పోయేదాన్ని, అసలు మంచం నుంచి దిగలేని పరిస్థితిలో వుంటిని. Doctor దగ్గరికి అతి కష్టం మీదట వెళ్ళి అన్ని tests చేయించు కున్నాం.
నా reports అన్ని doctor జగదీష్ దాస్ కు చూపించారు. పూనాలో tests అన్ని చేయించుకున్నాం.
అప్పుడు నా భర్త స్నేహితుడు doctor చోదరి మా ఇంటికి వచ్చారు.
ఆయన reports అన్ని చూసి నాసిక్ దగ్గర ఒక మంచి doctor వున్నాడు, అక్కడికి వెళ్ళండి, అని చెప్పారు.మేము నాసిక్ వెళ్ళి doctor ను కలిశాము. అతను మమ్మల్ని వెంటనే Hospital లో admit అవ్వమని చెప్పారు.
అక్కడ నాకు తెలిసింది నాకు GBS అనే పేరు గల జబ్బు సంక్రమించింది అని, అప్పుడు 18 రోజులు hospital లో ఉంచి వైద్యం చేసి తరువాత నన్ను ఇంటికి పంపేశారు.బాగైంది అనుకున్నాను.
ఇంటికి వచ్చాక మళ్ళీ 15 రోజులకు అదే జబ్బు మళ్ళీ వచ్చింది. కాళ్ళు అస్సలు కదిలేవి కావు. మళ్ళీ నాసిక్ వెళ్ళి వెరే doctor వరాజె దగ్గరికి వెళ్ళాం. ఈ సారి 25 రోజులు వుండవలసి వచ్చింది. పూర్తిగా బాగావ లేదు కాని, ఒక విధంగా పనులు చేసుకో గలిగేదాన్ని.
మళ్ళీ 9 – 10 రోజులకు అదే జబ్బు వచ్చింది. ఈ సారి నా కుటుంబ సభ్యులు పడే బాధలు చూడలేక సాయి బాబా విగ్రహం దగ్గర ప్రణామం చేసుకొని, బాబా ఇంక hospital వుండే పరిస్థితి రానీకు నా కుటుంబం పడే కష్టం నేను చూడలేకుండా వున్నాను అని బాబా విభూతి నీళ్ళలో కలుపుకొని తాగాను.
నా కాళ్ళకు విభూతి ఇష్టం లెకున్నా(కాళ్ళుకదా, అందుకని) పూసుకున్నాను. మళ్ళీ hospital కు వెళ్ళాము. doctor నన్ను చూసి ఆశ్చర్య చకితుడు అయ్యాడు.
ఇప్పుడు ఏమిలేదు , మందులతోనే బాగు అవుతుంది, admit కానక్కర లేదు అన్నాడు. ఈ విధంగా సాయిబాబా కృప వలన నేను త్వరలోనే కోలుకున్నాను.
ఇంట్లో పనులు కూడా చేసుకుంటున్నాను. నేను అందుకే అంటాను, బాబానే నన్ను బాగుచేశారు. ఇప్పుడు మా కుటుంబం మొత్తం బాబా అనన్య భక్తులం అయ్యాము. మా లాగానే మీరు కూడా బాబా పట్ల భక్తి కలిగి వుండండి.
(అసలు ఎందుకు ఆ విపరీతమైన జబ్బు వచ్చింది? రెండు సార్లు Hospital వున్నా, బాబా ఎందుకు గుర్తు రాలేదు? మూడోసారి ఎందుకు గుర్తుకు వచ్చింది? అన్నీ బాబాకే తెలుసు. మనకు ఏమి తెలీదు. పూర్వ జన్మలో చేసుకున్న ఖర్మ వ్యాధిరూపంలో పోతుంది.దానికి సమయం సందర్భం రావాలి.
అందుకే బాబా అంటారు, శ్రద్ద, సబూరి, అంటే ఓపిక పట్టండి. నీకు సమయం వచ్చినప్పుడు నేను బాగు చేస్తాను. ఎందుకు వ్యధ చెందుతావు? నేను వున్నాను అంటారు.)
సర్వం సాయినాథార్పణమస్తు
రేఖ అనీల్ కుమార్ దేశ్ పాండే,
జలగావ్ , మహారాష్ట్ర.
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్
Latest Miracles:
- Sai Naam Jaap revives death to life. – Audio
- Strangely my file was still preserved in the Hospital–Audio
- The power of Udhi – Disappeared stone in gall bladder
- Not heeding …Sai@366 – 14th November….Audio
- Not knowing Your Miracles! …Sai@366 – 26th August….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
13 comments on “మందులతో నయం కానట్టి భక్తురాలి జబ్బు బాబా ఊధీ ద్వారా బాగాగుట–Audio”
Radhika J
January 14, 2018 at 9:34 amJai Sairam
b vishnu Sai
January 14, 2018 at 9:41 amOm sai ram
Andariki sankranthi subhakankshalu
Madhavi
January 14, 2018 at 9:55 amభూత,భవిషత్.. వర్తమానం..తెలిసిన దైవం..సాయి నాథుడు.వైద్యో నారాయణ.సాయి…Wish u happy sankranthi.all sai Leela’s.teem.
Gautam
January 14, 2018 at 9:56 amVaidyanaarayanudu sai naadhudu
Sai
January 14, 2018 at 9:58 amJai sai ram..Wish u happy pongal..To all saileelas..Team.
Somya
January 14, 2018 at 9:59 amJai sai naathaya….Beautiful miracle.
subhalaxmi
January 14, 2018 at 9:59 amSai baba..As..Doctor..Super.miracle.
Prasanna
January 14, 2018 at 10:01 amJai sai ram..Wandrafull.miracle..Wish u happy pongal to all sai Leela’s team.doing gud work.
kishore Babu
January 14, 2018 at 11:59 amషిర్డీ లో ఉన్న ధుని బాబా వారి వెలిగించారు …ఇప్పటికీ ఆ ధుని వెలుగుతూనే ఉంది…ఆ ధుని నుంచి వచ్చే ఊది, బాబా వారి ప్రత్యక్షంగా ఇచ్చినట్లే..అందుకనే షిర్డీ ఊది కి అంత మహిమ ఉంటుంది…
T.V.Gayathri
January 15, 2018 at 1:10 pmOm Sai Sri Sai jaya Jaya sai
soundarya
January 16, 2018 at 6:19 amAum sri sai ram
Radha
January 16, 2018 at 2:03 pmBeautiful miracle..Jai sai ram.
Krishnaveni
February 11, 2018 at 4:30 pmOk Sairam