Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
మొదట ద్వైత సాంప్రదాయానికి చెంది, అనంతరం అద్వైత సాంప్రదాయంలో రాణించిన అవధూత తన గీతార్థ దీపికలోని 8వ శ్లోకం భగవానుని మహిమను వర్ణించారిలా:
మూకం కరోతి వాచాలం
పంగుంలంఘయతే గిరీం
యత్కృపాత మహం
వందే పరమానంద మాధవం…
సాయి భగవానుడు అటువంటి లీలలను ఎన్నో చూపాడు. శ్రీ టి.ఎల్.యస్. మణి అయ్యర్ కుంభకోణానికి చెందిన సాయి భక్తుడు.
ఆయన కుమార్తె రాజ్యలక్ష్మి. పుట్టిన ఎనిమిది ఏండ్ల తర్వాత కూడా ఆ బాలికకు అమ్మ, అప్ప తప్ప వేరే మాటలు రాలేదు.
సాయి భక్తుడైన స్వామీజీ కేశవయ్య గారితో అయ్యర్‌కు పరిచయమయింది.
ఆయన షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించమని ప్రోత్సహించారు. అప్పటికే సాయి మహా సమాధి చెందటం జరిగింది కూడా.
సాయి మహిమకు మహా సమాధి పూర్వం, తరువాత అనే కాలపు గీతలు ఉండవు.
రాజ్యలక్ష్మితో ఆయన మార్చి 28, 1942న షిరిడీ చేరారు. సాయి మహా సమాధిని దర్శించారు.
”షిరిడీ ప్రవేశమే సర్వ దుóఖ పరిహారము” అంటుంది ఒక ఏకాదశ సూత్రము. పూర్తి నమ్మికతో షిరిడీ చేరిన చాలు, బాధ్యత సాయిదే.
మరునాడు దాసగణు మహారాజు ఆ బాలిక వద్దకు వచ్చి ”సాయి బాబా బోలో” అని అనమన్నారు.
ఆ పిల్ల ”సాయి బాబా” అని అనగలిగింది. ఇక సాయి కటాక్షంతో మాటలు వచ్చాయి. ఆ రోజు మార్చి 29. ఇది సాయి మహా సమాధి అనంతర లీలలో ఒకటి.
ఒక కృతజ్ఞతా భావము చూపాడు రాజ్యలక్ష్మి తండ్రి. ఆయన బెనారస్ సిల్కు శాలువను, తన కుమార్తె అంత పొడవు గల వెండి దీపాన్ని సాయి సంస్థాన్‌కు 1944 మే నెలలో సమర్పించు కున్నాడు.
ఈ నాడు మార్చి 29. మాటలు రాని రాజ్యలక్ష్మికి మాటలిచ్చాడు సాయి.
మాట్లాడటం వచ్చిన మనకు మన నోటి వెంట విన దగు పల్కులను పల్కించమని సాయిని మరీ, మరీ వేడుకుందాం.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- అణువు అణువున పలికిన దేవా!…. మహనీయులు – 2020… మార్చి 29
- సంతుల గ్రామం…..సాయి@366 మార్చి 23….Audio
- దర్శనం – నిదర్శనం …..సాయి@366 మార్చి 24…..Audio
- గులాబీ పరిమళం…. మహనీయులు – 2020… మార్చి 9
- నన్ను మరచు వారిని….. సాయి@366 మార్చి 5….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “మూకం కరోతి వాచాలం …..సాయి@366 మార్చి 29….Audio”
Puli Purushotham reddy
March 29, 2021 at 4:42 pmSree sai naathaayana mahaa