Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“నా సమాధి నుండి నా ఎముకలు మాట్లాడును” అన్నారు సాయిబాబా.
ఐతే అందరితోను మాట్లాడటం కుదరదు. మహాభక్తులతో మాట్లాడతారు సాయివంటి సత్పురుషులు.
గులాబ్ బాబా సైలానీ బాబా సమాధి వద్దకుపోయి నమస్కరించగా “అలేకుం సలాం” అన్న మాటలు వినిపించాయి.
అందరూ ఆ సమాధికి కొంచెం దూరంలో కూర్చున్నారు. గులాబ్ బాబా, సైలానీ బాబాల మధ్య సంభాషణలు కొనసాగాయి.
సమాధులలోని సత్పురుషులతో సంభాషించే సంఘటన మెహర్ బాబా జీవితంలో కూడా ఉన్నది.
అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కన్నంవార్ పనిచేస్తున్నారు. అయన గులాబ్ బాబా భక్తుడు.
ఒకనాడు మహాసభ జరుగుతొంది. అప్పుడు కన్నంవార్ ను గులాబ్ బాబా హిందీలో ప్రసంగించమన్నారు. “నాకు హిందీరాదు” అన్నారు కన్నంవార్.
గులాబ్ బాబా చిరునవ్వు నవ్వి, తన చేతిని కన్నంవార్ కూర్చున్న కుర్చీపై ఉంచారు. అది గులాబ్ బాబా దీవెన.
దానిని గ్రహించిన కన్నంవార్ కొన్ని గంటలపాటు అనర్గళంగా మాట్లాడసాగారు హిందీలో.
ఒక పేద భక్తుని ఇంట్లో అన్నదాన కార్యక్రమం జరుగుతొంది. గులాబ్ బాబా కూడా అక్కడున్నారు. నెయ్యి అయిపోతొంది. గృహస్తు కలవరపడుతున్నాడు.
గులాబ్ బాబా ఆ భక్తుని పిలచి “ఆ గంగాళంలో ఏమి ఉన్నదో చూచిరా” అన్నారు. ఆ భక్తుడు చూచి వచ్చి “నీళ్ళు” అన్నాడు.
“మరల ఇప్పుడు వెళ్ళి చూచిరా” అన్నారు గులాబ్ బాబా. ఆ భక్తుడు మరల గంగాళంవద్దకు పోయి చూడగా అందులో నెయ్యి ఉంది. వచ్చి చెప్పాడు బాబాకు. ఆ నేతినే అందరకూ వడ్డించారు.
సాయిబాబా కూడా నీటితో దీపాలు వెలిగించిన సంగతి మనందరకూ విదితమే. అంగడిపేట బాబా జీవితంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది.
ఏకనాధుని జన్మస్థానమైన పైఠాన్ కు వెళ్ళారు గులాబ్ బాబా. అక్కడ రెండేళ్ళ నుండి వర్షాలు కురియటం లేదు.
గ్రామస్తులు గులాబ్ బాబాకు ఈ విషయం విన్నవించుకున్నారు. ఏకనాథ్ మహారాజ్ సంకీర్తనలను భజన చేయండని ఊరువారికి చెప్పారు గులాబ్ బాబా. తానూ కూడా ఆ కీర్తనలలో పాల్గొన్నారు.
భజనలు పూర్తయ్యేలోపు మేఘాలు కమ్మి, వర్షం కురిసింది. సత్పురుషులు ఆదేశానికి ప్రకృతి పరవశించదా!
గులాబీ పూవు చెట్టు నుండి వీడిపోయినా, సువాసనను పోగొట్టుకోవు. గులాబ్ బాబా కనుమరుగైన అయన కీర్తి పరిమళాలు నేటికీ వ్యాపిస్తూనే ఉన్నాయి.
గులాబ్ బాబా మార్చి 9. 2001న మహాసమాధి చెందారు.
నేడు మార్చి 9. గులాబ్ బాబా మహాసమాధి చెందిన రోజు. ఆయనను స్మరించెదము గాక.
‘గోపాలా…గోపాలా…దేవకీనందన గోపాలా
గులాబ్ బాబా గోపాలా…”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సర్వ దేవతా నిలయం ….. సాయి@366 మార్చి 9….Audio
- మనసులోని కోరిక …. మహనీయులు – 2020… మార్చి 21
- జ్ఞానేశ్వరుని పుత్రిక …. మహనీయులు – 2020… డిసెంబరు 19
- గొడ్డలికి పరిమళం…. మహనీయులు – 2020… మార్చి 19
- కఠినం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 6
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments