గొడ్డలికి పరిమళం…. మహనీయులు – 2020… మార్చి 19



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


హేమాడ్ పంత్ సాయిబాబాను గురించి వ్రాస్తూ “మహాపురుషులు వ్రజంకంటే కఠినంగాను, కుసుమాలకంటే కోమలంగాను ఉంటారు” అని అంటారు.

గురు హర్ రాయ్ సిక్కుల 7వ గురువు. ఈయన సిక్కుల 6వ గురువైన గురు హర్ గోవింద్ మనుమడు.

బాల్యంలో హర్ రాయ్ ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. అతడు ధరించిన బట్టలు కొన్ని మొక్కలకు తగిలి, ఆ మొక్కలనుండి పూలు జారిపడ్డాయి.

అలా ఆ పూలు మొక్కలనుండి విడివడి రాలిపోవటం గురించి చింతించాడు. అది ఆ బాలుని సున్నిత హృదయాన్ని తెలియచేస్తోంది.

తన తాతగారి వలె వేట అంటే ఇష్టపడేవాడు. ఎన్నోసార్లు వేటకుపోయాడు కూడా.

ఐతే ఏ జంతువును వధించలేదు. కొన్ని అందమైన జంతువులను పట్టి తెచ్చుకుని తన కోసం ఒక జంతు పదర్శనశాలను ఏర్పరచుకున్నాడు. ఇది అయనకు జంతువులపై ఉన్న ప్రేమ.

ఇంకా ప్రజలు అందరూ వ్యాధులతో బాధపడుతుంటే, వైద్యశాలలను నిర్మించి సేవ చేయించేవాడు.

గురు హర్ రాయ్ సమకాలీకుడైన షాజహాన్ చక్రవర్తి కుమారుడు దారాషికో.

ఆ కాలంలో మొగలాయీ చక్రవర్తులతో సత్సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. దారాషికోకు విష ప్రయోగం జరిగింది.

షాజహాన్ తన కుమారునికి ఎన్నో చికిత్సలు చేయించాడు. ఫలితం కానరాలేదు. ఆ జబ్బు నయంకావటానికి వైద్యులు కొన్ని వస్తువులతో చిట్కా చెప్పారు.

ఐతే ఆ వస్తువులు ఎక్కడా దొరకలేదు. గురు హర్ రాయ్ వైద్యశాలలో మాత్రమే అవి లభ్యం అని షాజహాన్ కు తెలిసింది. వెంటనే షాజహాన్ గురు హర్ రాయ్ కు ఉత్తరం వ్రాశాడు.

గురు హర్ రాయ్ వెంటనే స్పందించి, ఆ వస్తువులను పంపాడు. ఆ విషయం కొందరకు నచ్చలేదు.

గురు హర్ రాయ్ “గొడ్డలి చందన వృక్షాన్ని నరుకుతుంది. అప్పుడు కూడా గొడ్డలికి చందన పరిమళం అందుతుంది” అన్నారు.

ఇతరులకు కౄరత్వం ఉన్నా, మనం మాత్రం మానవత్వాన్ని మరువరాదు.

గురు హర్ రాయ్ కుమారుడు రామ్ రాయ్. రామ్ రాయ్ ఒకసారి గురుగ్రంథ సాహెబ్ లోని ఒక పదాన్ని ఔరంగజేబు కోరగా మార్చాడు.

ఈ సంగతి తెలిసిన గురు హర్ రాయ్ కు కోపం వచ్చింది. అతి పవిత్రమైన ఆ గ్రంథంలో మార్పు చేయ సాహసించిన కుమారుని మన్నింపలేకపోయాడు.

కుమారుడు కాబోయే సిక్కుల గురువు కూడా, ఐనా అతనిని బహిష్కరించాడు.

జీసస్ క్రీస్తు కూడా “ధర్మ శాస్త్రాలను, ప్రవక్తల వచనాలను కొట్టివేయటానికి (నేను) వచ్చానని అనుకోవద్దు. అవి నెరవేర్చటానికే నేను వచ్చాను” అన్నాడు.

రాంరాయ్ గురుత్వాన్ని పోగొట్టుకున్నాడు. హర్ రాయ్ వజ్రంకంటే కఠినంగా ప్రవర్తించాడు, గురు గ్రంథ్ సాహెబ్ పవిత్రతను కాపాడటానికి.

అంతటి మహనీయుడైన గురు హర్ రాయ్ గురు గద్దెను ఎక్కిన దినం నేడే 19 మార్చి, (1644).

గురు హర్ రాయ్ ను స్మరించి, ఆయనవలె ఉండుటకు ఈ రోజే ప్రయత్మించెదము గాక.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles