మాయా శక్తి…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 1



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


బాబా రామ్ రాయ్ శిక్కుల ఏడవ గురువైన సద్గురు హర్ రాయ్ ప్రథమ కుమారుడు. ఒకసారి తండ్రి ఆజ్ఞానుసారం ఔరంగజేబును కలిశాడు.

ఔరంగజేబు, “శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడంటారు అది అబద్దం” అన్నాడు రామ్ రాయ్ తో.

వెంటనే రామ్ రాయ్ షాహీ మసీదును అమాంతం పైకెత్తి చిటికిన వ్రేలుపై నిలబెట్టి చూపాడు.

బోయీలను  పంపకుండా ఖాళీ పల్లకీని పంపాడు ఔరంగజేబు రామ్ రాయ్ వద్దకు.

రామ్ రాయ్ ఆ బోయీలు లేని పల్లకిలో కూర్చొని, ఆకాశ మార్గాన పయనించి, ఔరంగజేబు వద్దకు వెళ్ళాడు.

ఔరంగజేబు కోరగా ఆకాశంలో తూర్పు, పడమర దిక్కులలో రెండు చందమామలను ఒకేసారి చూపాడు.

“గురునానక్ కుంకుడు చెట్ల పండ్లను తియ్యగా మార్చటం నిజం కాదు” అన్నాడు ఔరంగజేబు.

రామ్ రాయ్ అక్కడే ఉన్న ఓ చేదు పండ్ల చెట్టును ఊపి కాబూలు ద్రాక్ష పండ్లను తెప్పించాడు. ఎందరో ఆ కాబూలు ద్రాక్ష పండ్లను ఇళ్ళకు తీసుకుపోయారు.

ఒకసారి విషపూరితమైన వస్త్రాన్ని ఇచ్చాడు ఔరంగజేబు. సంకోచం లేకుండా ఆ విష వస్త్రాన్ని ధరించాడు రామ్ రాయ్. ఏమి కాలేదు.

నిండు దర్బారులో రాత్రి  తానేమి చేశాడో చెప్పమని ఔరంగజేబు అడగగా రామ్ రాయ్ గత రాత్రి ఔరంగజేబు చేసిన చేష్టలేకాక, ఔరంజేబు స్వప్నంలో చేపలను చంపిన విషయాన్ని కూడా రామ్ రాయ్ చెప్పాడు. ఇలాంటి అనేక లీలలు రామ్ రాయ్ జీవిత చరిత్రలో కానవస్తాయి.

రామ్ రాయ్ కు సిద్దులు బాల్యం నుండే అలవడ్డాయి. మహామహిమాన్విత గురు వంశంలో పుట్టినందువల్లనూ, సాధన వల్లనూ అయివుంటాయి.

సాయిబాబా “నేను ఫకీరు నయినప్పటికి, ఇల్లు గాని, భార్యగాని లేనప్పటికి మాయ నన్ను బాధించుచున్నది. ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరచుచున్నప్పుడు నావంటి ఫకీరు అనగా దానికెంత?” అంటారు.

మాయ రామ్ రాయ్ ను ఆవహించింనదనవచ్చును. ఔరంగజేబు గురుగ్రంథములో ఒక పదాన్ని మార్చమని కోరినప్పుడు, ఇటువంటి మహనీయుడైన రామ్ రాయ్ ఆ పదాన్ని మార్చి వేరొక పదాన్ని పెట్టాడు.

ఈ విషయం తెలిసిన గురు హర్ రాయ్ ఉగ్రుడై, సిక్కులందరిని రామ్ రాయ్ తో సంబంధం తెగతెంపులు చేసుకోమనటమే కాకుండా రామ్ రాయ్ ఇకమీదట తన వద్దకు రానక్కరలేదన్నాడు.

గురు హర్ రాయ్ దృష్టిలో గురుగ్రంథము అతి పవిత్రమైన మహాగ్రంథము. దానిలోని అక్షరమును మార్చుట క్షమించరాని నేరము.

రామ్ రాయ్ ఎనిమిదవ సిక్కు గురువయ్యే అవకాశం పోగొట్టుకున్నాడు.

ఈయన 1646వ సంవత్సరంలో జన్మించి 1687వ సంవత్సరములో సమాధి చెందెను.

మాయ మనలను బాధించకుండా కాపాడమని సద్గురువును వేడుకొందుము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles