సేవకు ఉదాహరణ .. …. మహనీయులు – 2020… మే 28



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా నానాసాహెబ్ చందోర్కరును “సేవ అనగా ఎట్టిది?” అని ప్రశ్నించాడు.

“ప్రతి రోజు మేము చేయునట్టిది” అన్నాడు నానా. “అట్టి సేవ చేసిన చాలునా?” అడిగాడు సాయి. “సేవయను పదమునకింకా అర్ధమేమి కలదో నాకు తోచుట లేదు” అన్నాడు నానా.

తొమ్మిదవ సిక్కుల గురువు తేజ్ బహుదూర్. ప్రజలందరు చూస్తుండగా ఆయనను ఔరంగజేబు చిత్రహింసలకు గురిచేశాడు.

ఇదేమి చాలదన్నట్లు తేజ్ బహుదూర్ శరీరాన్ని ఖండింప చేశాడు – మొండెము, తల వెరగునట్లు వధింపచేశాడు.

తేజ్ బహుదూర్ తల, మొండములను ఎవరైనా తీసుకుపోయిన వారికి శిరచ్ఛేద శిక్ష ఉంటుందని ప్రకటించాడు ఔరంగజేబు.

సిక్కు మతస్థులు భయపడునట్లు చేశాడు ఔరంగజేబు ఇలా జరుగుతుందని ఆలోచించారు కొందరు సిక్కులు.

అప్పటికప్పుడు అనుకోనివిధంగా గాలి, ఇసుక దుమారం చెలరేగింది. చీకటి కమ్మింది. అంధకారం అలమటించింది.

ఆ సమయంలో భాయ్ లక్కీ షా (రాయ్) తన కుమారునితో కలసి సద్గురు మొండెమును తమ బండిలో ఎక్కించుకుని తమ గృహానికి తీసుకుపోయాడు.

సద్గురువు శిరస్సును భాయ్ జైటా ఇతరులతో ఆనందాపూర్ కు తీసుకువెళ్ళాడు.

వేగవంతమైన బండిలో తమ గురువు శరీరమును దూదిలో పెట్టి, ఎవ్వరికి కనబడకుండా, తమ గృహానికి చేర్చగలిగారు.

ఆ తరువాత? బహిరంగంగా అంతిమ క్రియలను ఏర్పాటు చేయలేదు లక్కీ షా. ఏర్పాటు చేయలేక కాదు. తమ గురూజీ దేహాన్ని తీసుకుని అనుచితంగా ప్రవర్తిస్తుంది మొగలాయి సైన్యం.

తమ విశాలమైన ఇంటి ఆవరణలో ఎవరికి తెలియకుండా గురుదేహానికి అంత్యక్రియలు చేసి, వేరే ఎవ్వరికీ, ఎట్టి పరిస్థితులలోను అనుమానం రాకుండా, తన భవంతిని దగ్ధంచేశాడు.

ఆ భవంతిలో ఉన్న దూది వలన, ఆ భవంతి దగ్దమైందనే భావన చూచేవారికి కలిగేటట్లు చేశాడు లక్కీ షా.

ఔరంగజేబు కాలంలో లక్కీ షా పేరుపొందిన ధనవంతుడు. దూది, సున్నము మొదలైన వాటిని మొగలాయీలకు సరఫరా చేసేవాడు.

ఇలా చేసే సమయంలో లక్కీ షా ఏ క్షణాన్నయినా, పట్టుబడవచ్చును. తేజ బహుదూర్ ను హింసించినట్లు ముస్లిం సైన్యం హింసించవచ్చును.

దేహము తనది కాదు, తన గురువుదే అనే భావం ఉంది లక్కీ షాకు.

మనస్సును ఏనాడో గురువుకు అర్పించేశాడు లక్కీ షా. ఇక ధనమును – అనగా తన భవంతిని, వస్తువులను కూడా దగ్ధం చేశాడు క్షణాల మీద.

అటువంటి సేవ చేసిన లక్కీ షా (లక్కీ రాయ్ ) 28 మే, 1680న తన దేహాన్ని విడిచిపెట్టాడు.

ఎక్కడైతే గురుతేజ్ బహుదూర్ శరీరమునకు (మొండెము) అగ్ని సంస్కారం కావింపబడినదో అనగా, లక్కీ షా దగ్ధం కావించుకొనిన గృహ స్థలంలో రాకబ్ గంజ్ లో ఒక గురుద్వారం వెలసింది.

నేడు 28  మే లక్కీ షా వర్థంతి. ఆయనను స్మరింతుము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles