Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
తేజ్ బహుదూర్ సిక్కుల తొమ్మిదవ గురువు.
సాయిబాబాకు ఒకసారి నాచ్నే అనే వ్యక్తి రెండణాల దక్షిణను ఇవ్వటం మరచాడు. సాయి అడిగి మరీ తీసుకున్నాడు నాచ్నే నుండి – అలా సాయి చేయటం తన మహత్తును చాటుకోవటానికా?
బాలునిగానే 8వ గురువు అయిన హరకిషన్, బాల్యంలోనే దేహాన్ని విడువ వలసి వచ్చింది.
అందుకు ఆ బాల గురువుకు చింత అనేదే లేదు. మరణ సమయం ఆసన్నమైంది. కాబోయే గురువెవరని ప్రశ్నిస్తే ‘బాకాలా’ అని మాత్రం గురు హరికిషన్ పలికి కన్ను మూశారు.
“ఇక బాకాల” నేనంటే నేనే గురువును అని ఎందరో ముందుకు వచ్చారు. వారిని పరీక్షించిన మఖన్ సింగ్, వారందరు గురువులు కాదని నిశ్చయించుకున్నాడు.
ఇక చివరకు మిగిలిన తేజో బహుదూర్ కు రెండు బంగారు నాణేలు ఇచ్చాడు. తేజ్ బహుదూర్ “ఐదు వందల బంగారు నాణేలు మ్రొక్కుకొని, రెండే ఇచ్చావే?” అన్నారు మఖన్ సింగ్ తో.
మఖన్ సింగ్ నిజంగా మ్రొక్కుకుంది 500 నాణేలు. కాని ఇంతవరకు తాను పరీక్షించిన ఏ గురువు కూడా ఇలా అడగలేదు. తేజ్ బహుదూర్ ఒక్కడే నిజమైన గురువుగా నిర్దారింఛి ప్రకటించాడు.
ఇక్కడ తేజ్ బహుదూర్ 500 నాణేలను, సాయి ఇవ్వ మరచిన దక్షిణను అడిగింది తమ మహత్తును చాటేందుకు కాదు. భక్తులు, మ్రొక్కుకున్న వారు అనుకున్న మాట ప్రకారం మెలగాలని.
తేజ్ బహుదూర్ సిక్కుల గురువైనా, సిక్కు మతానికే పరిమితం కాలేదు. నిజమైన మతానికి పరిధి అంటూ ఉండదు.
మొగల్ చక్రవర్తి కాశ్మీరీ పండితులు ముస్లింలుగా మారాలని బలవంతపెడుతుంటే,కాశ్మీరీ పండితులు, తేజ్ బహుదూర్ ను కలిశారు, కాపాడమన్నారు.
తన మతం కాకపోయినా, హిందూ మతాన్ని కాపాడేందుకు, స్వయంగా, తేజ్ బహుదూర్ ఔరంగజేబును కలిశాడు.
ఔరంగజేబు తేజ్ బహుదూర్ కొన్ని మహాత్తులను చూపాలని, లేదా మతం మారాలని ఆంక్ష పెట్టాడు.
తేజ్ బహుదూర్ ఆ రెండు షరతులకు అంగీకరించలేదు. ఔరంగజేబు బహుదూర్ ను బంధించి, చిత్రవధ చేశాడు.
సిద్దులు, శక్తులు చూపటం సిక్కు గురువులు గతంలో తీవ్రంగా వ్యతిరేకించారు. తేజ్ బహుదూర్ కూడా అంతే.
ఇంకా ఇతర మతస్తులను కాపాడటానికి తన దేహాన్నే గడ్డిపోచగా అర్పణ చేసిన చిరంజీవి తేజ్ బహదూర్.
భారత ప్రభుత్వ పోస్టల్ డిపార్టుమెంటు డిసెంబర్ 16, 1975న పోస్టల్ స్టాంప్ ను ఆయనకు నివాళిగా సమర్పించింది.
అన్య మతస్థులు ఆ తేజ బహుదూర్ కు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలరు?
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- సూక్ష్మ బుద్ది …. మహనీయులు – 2020… జూలై 7
- సేవకు ఉదాహరణ .. …. మహనీయులు – 2020… మే 28
- అడుసు తొక్కనేల…కాలు కడగనేల… …. మహనీయులు – 2020… డిసెంబరు 1
- ప్రేమ లేని వాడు … మహనీయులు – 2020 – జనవరి 19
- ఇంట గెలిచి .. …. మహనీయులు – 2020… డిసెంబరు 11
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments