Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒకసారి బాబా మకన్ షా ఓడపై వ్యాపారం చేసుకుని తిరిగి భారత దేశానికి వస్తున్నాడు.
ఆ ఓడలో విశేషమైన ధనమే కాకుండా, విలువైన వస్తువులున్నాయి. ఉన్నట్లుండి సముద్రంలో తుపాను చెలరేగింది. ఈసారి వచ్చిన తుపాను బీభత్సపరచసాగింది.
చివరగా మకన్ షా గురునానక్ (సిక్కుల మొదటి గురువును) దీనంగా ప్రార్ధించాడు. “బాబాజీ (నానక్) నా ఓడను, మనుషులను రక్షించు.
నా నడుముకున్న 500 బంగారు నాణెములను నీకు సమర్పిస్తాను” అని నానక్ ను ప్రార్ధించి, గురు అర్జున్ దేవ్ వచనాలను పఠించాడు.
అద్భుతం జరిగినట్లుగా తుపాను తొలగిపోయింది. సురక్షితంగా వారి గమ్యస్థానమైన సూరత్ కు చేరారు.
ఇక బాబా మకన్ షా తనమీద బాధ్యత పెరిగిందని గ్రహించాడు. 500 బంగారు నాణెములను సిక్కుల గురువుకు అందచేయాలి.
అప్పటికి 8వ సిక్కుల గురువు గురు హరికిషన్ దేహాన్ని త్యజించాడు. 9వ గురువు పేరు చెప్పకుండానే అయన శరీరాన్ని వదలటం సిక్కులకు కించిత్ అసౌకర్యంగా ఉంది.
కాబోయే గురువు “బాబా బాకాల” అని హరికిషన్ చెప్పి కన్ను మూసాడు.బాకాల అనేది ఊరు. బాబా బాకాల అంటే గురువు బాకాలలో ఉన్నాడని అందరూ అర్ధం చేసుకున్నారు. ఇక బాకాలలో తామే గురువులని చెప్పుకునేవారు 22 మంది తయారయ్యారు.
ఐతే నిజమైన గురువు ఎవ్వరు? ఎలా గుర్తించగలగటం? అనేది సమస్య అయింది బాబా మకన్ షాకు.
ఈ సమస్యను తీర్చమని నానక్ దేవ్ ను ప్రార్ధించలేదు మకన్ షా. ప్రయత్నం తాను చేయాలి. కాకపొతే గురువును శరణువేడాలి.
ఒక్కొక్క గురువుకు 2 బంగారు నాణెములు సమర్పించాడు. ఆ రెండు బంగారు నాణెములకే సంతృప్తి చెందారు ఆ 22 కపట గురువులు.
మరి నిజమైన గురువు ఎవరు? ఎవరో ఒక చిన్న కుటీరంలో ఎప్పుడూ ఒక వ్యక్తి ధ్యానంచేస్తూ ఉంటాడని చెప్పారు ఆ ఊరి వారు.
ఆయనవద్దకు పోదాం, అని వెళ్లి ఆయనకు రెండు బంగారు నాణెములను సమర్పించాడు మకన్ షా.
“భగవంతుడు నిన్ను దీవించుగాక. మ్రొక్కుకున్నది 500 బంగారు నాణెములైతే, రెండు మాత్రమే ఎందుకు ఇచ్చావు? నిజమైన సిక్కు గురువుకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి” అన్నాడు మకన్ షాతో.
అలా పలికిన వ్యక్తే తేజ్ బహుదూర్. అయన తనకే కాక యావత్ సిక్కులను కూడా 9వ గురువుగా గుర్తించి, గబ గబా ఇంటికి వెళ్ళి “గురువు దొరికాడహో” అంటూ అరచి మిగిలిన బంగారు నాణెములను కూడా తేజ్ బహుదూర్ కు సమర్పించాడు.
తేజ్ బహుదూర్ 9వ గురువయ్యాడు.
బాబా మకన్ షా జన్మదినం జూలై 7, 1619.
నేడు మకన్ షా జయంతి.
మకన్ షాకు ఉన్నటువంటి సూక్ష్మ బుద్ది మనకు కలుగు గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- అదృశ్య గురువు…. మహనీయులు – 2020… జూన్ 7
- గడ్డిపోచ! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 16
- ఒకే మాట! … మహనీయులు @2020 – జనవరి 7
- ఎందరో మహానుభావులు …. మహనీయులు – 2020… నవంబర్ 7
- “నేను అమ్మను…”… మహనీయులు – 2020… జూలై 21
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments