Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సావిత్రి రఘునాథ్ టెండూల్కర్ సాయిబాబాను ఒక భక్తుని కాపాడమని విన్నవించుకున్నది సాయి చిత్తరువు ముందే. సాయి ఆమె ప్రార్ధనను మన్నించాడు.
భక్తుని కోరికలను భగవంతుడు తీరుస్తాడు.
శిష్యుని కోరికను గురువు తీరుస్తాడు.
తిరుమలిసై ఆళ్వారు పుష్య కృష్ణ దశమి గురువారం ముఖ నక్షత్రమున (పుష్య మాసం సామాన్యంగా జనవరిలో వస్తుంది) జన్మించారు.
ఈయననే భక్తి సారులు అని పిలుస్తారు. వీరు విష్ణుమూర్తి యొక్క సుదర్శనాంశము. వీరికి కణికన్నన్, దృఢవ్రతుడు. ఇంకా ఎందరో శిష్యులున్నారు. వీరు రెండు దివ్య ప్రబంధములను రచించిరి.
కాంచీపురంలో తిరుమళిసై ఆళ్వారులను ఒక వృద్దవనిత సేవలు చేసేది. ఆ సేవలకు ఆళ్వారులు సంతసించి వరము కోరుకొమ్మనగా, ఆమె తాను నిత్య యవ్వనవతిగా ఉండవలెనని కోరుకున్నది. ఆళ్వారులు తధాస్తు అన్నారు.
ఆ త్రిజగన్మోహనాంగిని కాంచీపురమునేలు పల్లవరాయడు వివాహమాడాడు. పల్లవరాయునకు ఆమె నిత్య యవ్వనవతి అయిన వైనము తెలిసింది.
ఒకనాడు పల్లవరాయలు కణికన్నన్ పిలిపించి “ఓయీ! నేను నీ గురువును సేవించి నిత్య యవ్వనము పొందదలచితిని. కావున నీ గురువును వెంటనే తోడ్కొనిరమ్ము.
నీవు చక్కని కవిత రీతిలో నాపై పద్యమును కట్టుము, నీకు బహుమతుల నిచ్చెదను” అన్నాడు.
“నా గురువు రాజును సేవించడు, కనుక నీ వద్దకు రాడు. నేను దైవముపై మాత్రమే కవిత్వమును చెప్పెదను” అన్నాడు కణికన్నన్. రాజుకు కోపం వచ్చింది.
ఈ గురు శిష్యులకు దేశ బహిష్కరము విధించినాడు. ఈ సంగతి గురువునకు శిష్యుడు చెప్పినాడు.
కంచికి దగ్గరలోనున్న తిరువెంకా అనే పేరు గల వైష్ణవ దేశంలో కొలువై ఉన్న సొన్న వన్నంసైత పెరుమాళ్ దగ్గరకు వెళ్ళి “కణికన్నన్ వెళ్ళుచున్నాడు. అతని వెంట నేను కూడా వెళ్ళుచున్నాను. నీవు నీ ఆదిశేషునితో మాతోపాటే రావలెను” అని ప్రార్ధించాడు.
శిష్యుడు, గురువు, దైవము, ఇతర దేవతలు కంచి నుండి పోవుట గమనించి రాజు పశ్చాత్తప్తుడై మన్నింపమని వేడుకున్నాడు.
గురువు కరిగిపోయి, వెనుదిరిగి భగవానుని మరల యధాస్థానమునకు వేంచేయమని ప్రార్ధించాడు. దైవము అలానే చేశాడు.
తిరువేంకాలో కొలువై ఉన్న ఆ దైవానికి అప్పటినుండి యధోక్తకారి అనే పేరు వచ్చింది. భక్తుడు చెప్పినట్లు చేయు దైవము అని అంటారు.
యధోక్తకారిని, తిరుమళిసై ఆళ్వారును, కణికన్నన్ ను స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఒకే ఒక్కడు …. మహనీయులు – 2020… మార్చి 23
- అదృశ్య గురువు…. మహనీయులు – 2020… జూన్ 7
- సూక్ష్మ బుద్ది …. మహనీయులు – 2020… జూలై 7
- ఎందరో మహానుభావులు …. మహనీయులు – 2020… నవంబర్ 7
- దూరంగా ఉండని గురువు… మహనీయులు – 2020 – జనవరి 6
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments