Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు ch .అప్పారావు. మాది వ్యవసాయ కుటుంబం .ఉన్న కొద్ది పాటి భూమి వ్యవసాయం చేసుకుంటూ గుంటూరు దగ్గర నగరం పాలెం లో ఉండేవాళ్ళం .
మా వంశస్థులు మా అమ్మ అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేసే వాళ్ళము. తరచూ తిరుపతి వెళ్లి వస్తూ ఉండేవాళ్ళము .
మాకు ముందు బాబా అసలు తెలియదు. మా శ్రీమతి వాళ్ళింట్లో నాగదేవతారాధన చేసేవాళ్ళు.
మాకు పెళ్లి అయి పిల్లలకి చదువులు రీత్యానైతేనేమి, గ్రామం లో వ్యవసాయం లాభసాటిగా లేని కారణము గా అయితేనేమి హైదరాబాద్ కి చేరుకున్నాము.
నేను ఇక్కడికి వచ్చాక ఏవో చిన్న చితక ఉద్యోగాలు చేసి ఇక చేయలేక మానేసి ఇంట్లోనే ఉంటున్నాను .నాకు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు భార్య ఉన్నారు.
మా పెద్ద అబ్బాయి సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తున్నాడు. అమ్మాయికి పెళ్లి అయింది .పెద్ద అబ్బాయి పెళ్ళికి ఉన్నాడు .
బాబా అసలు మాకు ఎలా పరిచయం అంటే 1995 లో వ్యవసాయం లో ఉన్నప్పుడే నేను పని మీద నాగార్జున సాగర్ వెళ్ళాను .
అక్కడ నా చిన్న నాటి స్నేహితుడు ఉన్నాడు. నేను నాకు కావాల్సిన విత్తనాలు అవి కొన్నాక నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను .
నేను ఈ మధ్యన కలుసుకోలేదు .సత్యంను (నా స్నేహితుడు ) ఎప్పుడు వచ్చిన ఎదో హడావిడి చేత పాపం ఇతన్ని నేను చూడడానికి రానందుకు వాడికి కోపం కూడా వచ్చింది .
చాలా రోజులు అయింది చూడక .ఎలా ఉన్నాడో అనుకుంటూ గుమ్మం లోకి వెళ్ళాను .
కొంచం ఇల్లు ఈ మధ్యనే రీమోడలింగ్ చేయించినట్లు ఉన్నాడు. బైట చూడడానికి చాలా బావుంది. బెల్లు కొట్టాను .సత్యమే వచ్చి తలుపు తీసాడు.
మనిషి ఇది వరకు పీలగా బలహీనంగా కనిపించేవాడు ,ఇప్పుడు పుష్టిగా హుందాగా కనపడుతున్నాడు.
నేను లోపలకి వస్తూ కొత్తగా ఉన్న సోఫాలు టీవీ చూసి, ఏరా సత్యం! ఈ మధ్య నువ్వు ఏమైనా కొత్తగా బిజినెస్ ఏమైనా మొదలుపెట్టావా ? అని అడిగాను.
లేదే ! ఆలా అడిగావు ఏంటి ? అన్నాడు వాడు .అంతా కొత్తగా కనపడుతుంటేను ,అన్నాను నేను . ఓహ్ !అదా ,ఈ మధ్య నేను బాబా ను నమ్ముకున్నాను , అప్పటి నుండే నాకు ఈ భోగం అన్నాడు .
ఏమిటి ? బాబానా? ఎవరాబాబా? ఎక్కడ ఉంటారు అన్నాను ఆత్రంగా. ”షిర్డీ శ్రీ సాయి బాబా ” అన్నాడు తన్మయంగా.
ఉండు నీకోకటి తెస్తాను అంటూ లోపలకి వెళ్లి ఎదో తెచ్చి నా చేతులో పెట్టాడు .నా చేతి వంక చూసాను ,ఒక అందమైన కీ చైను ,అందులో ఒక అద్భుతమైన ,సుందరమైన రూపం .నేను ఆ రూపాన్ని చూస్తూ అలా ఉండిపోయాను .
అప్పుడు సత్యం అన్నాడు . ఆయనే రా! సాయిబాబా అంటే .ఆయన వల్లే నేను ఇంతటివాడిని అయ్యాను అన్నాడు .ఆ తర్వాత చాలా విషయాలు చాలాసేపు మాట్లాడుకున్నాము.
The above text has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- నాక్కావలసింది ఈ నాణేలు కాదు, నేను కోరేది నిష్ఠ, సబూరీ
- ఆ రోజు బాబా నన్ను కాపాడి ఉండకపోతే ఈ రోజుకి నేను లేను.
- “నానాసాహెబ్కి ఈ ఊదీనీ, ఈ ఆరతి పాటనీ అందించాలి. ఆ బాధ్యత నీదే.’’
- ‘‘ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను మామా! కరుణించు. నన్ను ఈ బాధ నుంచి విముక్తుణ్ణి చెయ్యి.’’
- నేను ఇంకా బాబా కి చెప్పుకొని 30 సెకండ్లు కూడా కాలేదు. ఈ లోగా నా కోరిక తీర్చడానికి రెడీ గా ఉన్నాడు బాబా !
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments