Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
”నేను భోజనం చేసి బయల్దేరుతానురా” అంటూ బయటికి వచ్చాను. నేను స్కూటరు పైన వెళ్ళాను. స్కూటర్ తాళానికి సత్యం ఇచ్చిన కీ చైను తగిలించాను. ఇంక బయలుదేరాను.
నా దగ్గర 20000 రూపాయల డబ్బు ఉంది. సాయంత్రం నాలుగు గంటల సమయం, రాత్రేమీ కాదు. రోడ్డు మీద వెడుతున్న నన్ను అటునుండి ఇద్దరు ఇటునుండి ఇద్దరు అటకాయించారు.
ఒకడి చేతులో పెద్ద కర్ర ఉంది. అతను అమాంతంగా నన్ను కొట్టడానికి కర్ర పైకెత్తి ఒక దెబ్బ నన్ను వేయబోయాడు.
ఆ దారిలో ఆ సమయం లో ఎవరు లేరు. వాళ్ళు అయ్యప్ప డ్రెస్సుల్లో ఉన్నారు. దారిలో గోతులు ఉండటం వలన స్కూటర్ను కొంచెం స్లో చేశాను. అదే అదను అని వాళ్ళు వచ్చారు.
నేను గబ్బుక్కున తల వెనక్కి అన్నాను. అప్పటికే నా మూతికి దెబ్బ తగిలి బండికి తాళం పెట్టేచోట తగిలింది.
మరోవైపు మరొకడు నా వీపు మీద దెబ్బ వేసాడు. వీపంతా బాగా నొప్పి పుట్టింది. ఈ లోపు రోడ్డుమీద ఎవరో వస్తున్నట్లు కనపడింది. అంతే నన్ను వొదిలేసి పారిపోయారు.
లేకపోతే మరో రెండు దెబ్బలు వేసి నా దగ్గర ఉన్న డబ్బులు లాక్కుని పారిపోయి ఉండేవాళ్ళు.
తాళం పెట్టే దగ్గర చుట్టూ అంతా పప్పు అయిపోయింది. బాబా కీ చైను మాత్రం అలానే ఉంది. నేను ఇంటికి వచ్చాక చూసుకున్నాను, నాపైపన్ను విరిగిపోయింది, నాకు నొప్పి పుట్టలేదు, ఒక్క రక్తం బొట్టు కూడా పడలేదు.
నా స్నేహితుడు సత్యం నాకు బాబా ఫోటో ఇవ్వడం వల్ల ఆయనే నన్ను ఆపద నుండి కాపాడాడు అనిపించింది.
అంతే ! అప్పటి నుండి నేను బాబాని నమ్మడం మొదలు పెట్టాను. నాకు నమ్మకం కలిగించాలనే దొంగలని సృష్టించాడేమో అనిపిస్తుంది. ఆ రోజు బాబా నన్ను కాపాడి ఉండకపోతే ఈ రోజుకి నేను లేను.
మరోసారి నేను ఒక పల్లెటూరు వెళ్ళాను.
ఆ ఊరులో నాకు తెలిసిన వాళ్ళు లేరు, చుట్టాలు లేరు, రాత్రి పది గంటలు దాటితే ఆ ఊరి నుండి ఆఖరి బస్సు బయటికి వెళ్లి పోతుంది.
ఉదయం వరకు మళ్ళి ఏమి ఉండదు. అందుకు ఆ వూరికి ఉదయాన్నే వెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రానికి ఇంటికి చేరుకోవాలి, లేకపోతే అక్కడ ఏమి దొరకవు. ఉండడానికి చాల కష్టం.
రాత్రంతా అలా బస్టాండ్ లో ఉండిపోవాలి. నేను వెళ్ళాను, పని చూసుకున్నాను, అనుకోకుండా ఆలస్యం అయిపోయింది.
ఎంత కంగారు పడినా బస్టాండ్ కి చేరుకునేసరికి నేను అనుకున్నట్లు గానే బస్సు వెళ్లి పోయింది.
ఏం చెయ్యాలి బాబా ఇప్పుడు? నాకేంటి దారి అని అటు ఇటు చూస్తున్నాను. తెలిసిన వారు ఎవరైనా కనపడతారా? లేకపోతే ఏం చెయ్యాలి అని, బాబా నువ్వే ఎదో ఒక దారి చూపించు అనుకుంటున్నాను.
ఆ దారిన పోతు ఒక కారు వచ్చి నా పక్కగా ఆగింది. నేను ఎవరా అని కారులోకి చూసాను, అన్నయ్య అందులో ఉన్నాడు, నేను ఇటే వెడుతున్నాను, నువ్వు ఉదయమే ఈ ఊరు వచ్చావని తెలిసింది.
వెడుతూ ఎందుకో నువ్వు బస్సు ఎక్కకుండా ఇక్కడే ఉన్నావేమో అనిపించింది. అందుకే చూసుకుంటూ వస్తున్నాను. అనుకున్నట్లుగానే నువ్వు బస్సు ఎక్కకుండా ఇక్కడే ఉండి పోయావు.
ఎరా ? ఆలస్యం అయిపోయిందా? బస్సు వెళ్లి పోయింది కాబోలు.అంతేనా? అన్నాడు.
అవునురా బాబు ఆ భూస్వామి డబ్బులు తొందరగా ఇవ్వలేదు ఆయన ఇచ్చి నేను బయటికి వచ్చేసరికి ఉన్న ఒక్కగానొక్క బస్సు వెళ్లి పోయింది. ఏం చేయాలా అని చూస్తున్నాను.
బాబా నిన్ను పంపించాడులా వుంది అన్నాను. అలా బాబా మా అన్నయ్యను ఏర్పాటు చేసాడు.
లేకపోతే రాత్రంతా నకనకలాడుతూ ఆ బస్స్టాండ్లో కునికి పాట్లు పడుతూ బిక్కు బిక్కుమని కూర్చోవలసి వచ్చేది.
The above text has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- బాబా దయ వల్ల బ్యాగు లో కాష్ తీయలేదు.—Audio
- శ్రీ సాయిబాబా దయతో నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు
- బాబా నే స్వయంగా వచ్చి అభయం ఇచ్చారు…2
- ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుండి నన్ను బయటపడేసిన బాబా వారు …..!
- ఎన్నో అడ్డంకులు దాటించి నన్ను షిరిడీ రప్పించిన బాబావారు ….!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments