Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా పరిస్థితులు చాలా గడ్డుగా ఉన్నాయి .పిల్లల చదువులకి,తిండికి ,కష్టంగా ఉండేది . ఎలాగో చదువులు చెప్పించాము .పాపకి పెళ్లి చేయాలి, తప్పదుకదా.
డిగ్రీ చదివి గుంటూరులో ఉద్యోగం చేస్తుంది. మా పరిస్థితి చాలా హీనంగా దయనీయంగా వుంది. దినదినగండం గా ఉంటుంటే అమ్మాయికి పెళ్లి ఎలా చేయాలి? డబ్బు కోసం భయపడి భాద్యతను ఎలా విస్మరిస్తాం?
ఆడపిల్లలను ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటాం? ఎలాగయినా పెళ్లి చేయాలి కదా.
ఆ సమయంలో మేము అన్నవరం కుటుంబమంతా వెళ్ళాము. సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటే ఆయన దర్శనం కోసం వెళ్లి తిరిగి వచేస్తున్నాము.
ఆంజనేయ స్వామి గుడి పూజారి మమ్మల్ని వెనక్కి పిలిచాడు. మా పెద్ద అబ్బాయికి కూడా మేము పెళ్లి చేయాలి అనుకుంటున్నాము, వాడికీ వయస్సు దాటిపోతుంది.
సంభందాలు రావడంలేదు. పెళ్లి అవ్వదేమో అని నేను మా ఆవిడ ఇద్దరం దిగులు పెట్టుకున్నాము.
ఆ పూజారి మొదట మా చిన్నవాడిని పిలిచి వాడి గురించి అంతా చెప్పి నువ్వు బాబా పూజ చెయ్యి ఏడు రోజులు శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చెయ్యి, రోజుకో రకం నైవేద్యం చేసి పెట్టు చివరిరోజు ఎవరినైనా పిలిచి భోజనం పెట్టు అన్నాడు.
మీ పెద్దవాడికి పెళ్లి అయిపోయిద్ది .పెళ్లి అవ్వడం లేదు అని దిగులు పెట్టుకోకండి. సంబంధాలు రావడం లేదు అని కూడా మీరు అనుకోవద్దు.
రెండు సంభందాలు వస్తాయి, రెండవ సంభందం కుదిరిపోయి అబ్బాయికి పెళ్లి అయిపోతుంది అని చెప్పాడు.
మేము ఇంటికి వచ్చాక అంతక ముందే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక బాబా ఫోటో వచ్చింది. అది పైన సీనరీల మధ్యలో పెట్టాను.
మా ఆవిడ హాల్లో ఆవిడ పని అంతా అయ్యాక ఊరికే అలా పడుకుంది నేలపైనే, గాలి లేదు, ఆ ఫోటోను ఎవరు కదపలేదు, పైన పెట్టిన బాబా ఫోటో ఎగిరి వచ్చి ఆమె గుండెలపై పడింది.
ఆమె నిద్ర పోతుంది, కంగారుగా లేచి, గాలి లేదు ఏమి లేదు, ఇలా బాబా ఫోటో కింద పడిపోవడం ఏంటి? అని ఆ రోజు అన్నవరం లో పూజారి బాబా కి పూజ చేయమని చెప్పాడు కదా!
వీళ్ళు ఎవరు బాబా కి పూజ మొదలుపెట్టలేదు, ఇలా బాబా ఫోటో పడటం ఆయన్ని నిర్లక్యం చేయవద్దని బాబా చెపుతున్నట్లు అనిపించింది.
మా చిన్న అబ్బాయిని పిలిచి నువ్వు బాబా పూజ మొదలు పెట్టు అంది మా ఆవిడ. వాడు వెంటనే సరే అన్నాడు.
వాడు ఎప్పుడు తెల్లవారు ఝామున లేచి ఎరగడు, MSc చదివాడు సొంతంగా స్కూల్ పెట్టుకున్నాడు. అది నడవలేదు.
తర్వాత కాలేజీ లెక్చరర్ గా చేరాలి అనుకోని ఆ కాలేజీకి వెళ్లి అడిగాడు. అంతా బాగానే ఉంది కానీ జీతం మాత్రం 15000 మాత్రమే ఇస్తానన్నారు.
వీడు 20000 రూపాయలు ఇస్తానంటే చేస్తాను అన్నాడు. 15000 అంటే మాత్రం నేను చేయను అన్నాడు వాడు.
అప్పుడే బాబా పూజ మొదలుపెట్టాడు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి పూలు తెచ్చుకొని ప్రసాదం మా ఆవిడా ఏదో ఒకటి చేసి పెట్టేది.
రోజు నైవేద్యం పెట్టుకొని పారాయణ ఏడు రోజులు పూర్తిచేసాడు. వారం రోజులు పూర్తి కాగానే వీడి స్నేహితుడు వచ్చాడు.
వాడికారోజు భోజనం పెట్టాము. ఆ తర్వాత ఏ కాలేజీ వాళ్ళు మా వాడికి 15000 మాత్రమే ఇస్తానన్నారో ఆ కాలేజీ వాళ్ళు మళ్లీ మా వాడిని పిలిపించి 20000 ఇస్తాము ఉద్యోగం లో జాయిన్ అయిపో బాబు అన్నారు.
మా పెద్ద అబ్బాయికి అయితే మేము వాడి ఫోటో ఒకటి నెట్లో పెట్టాము. ఒక సంభంధం వచ్చింది వాళ్ళకేదో కుదర్లేదు.
మరో సంభంధం వచ్చింది. అదెలాగా అంటే మా అబ్బాయి ఫోటో నెట్లో పెట్టాము కదా ఒక అమ్మాయి నుంచి రెస్పాన్స్ వచ్చింది. నేను మా అబ్బాయిని వెళ్లి ఆ అమ్మాయిని చూసి రమ్మన్నాను.
ఆడ పిల్లలతో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. నువ్వే వెళ్లి చూడు నాన్న అన్నాడు. సరేలే నేనే వెళతాను అన్నానే కానీ నాకు తొందరగా వాళ్ళింటికి వెళ్ళడానికి సమయం చిక్కలేదు.
ఈ లోగ ఆ పిల్ల అమ్మ, అమ్మమ్మ, ఇద్దరూ ఒక రోజు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు.
సంక్రాంతి పండగ దగ్గరికి వస్తుంటే మా ఆవిడ ఇల్లు దులుపుతోంది. ఆ సమయంలో ఇంట్లో సామానులు చిందరవందరగా ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేసి ఫలానా చోట ఉన్నాము, ఆటో ని ఎటు రమ్మనమని చెప్పాలి అని అడిగారు.
నేను ఆటో వాడికి ఫోన్ ఇవ్వమని వాడికి అడ్రస్ చెప్పాను. 10 నిముషాలలో ఇంట్లో ఉన్నారు.
పిల్లలిద్దరూ నెట్లోనే ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. మీకు ఇంత ఇస్తాము, మేము ముహుర్తాలు కూడా పెట్టించుకుని వస్తున్నాము, ఫిబ్రవరిలోనే పెళ్లి చేసేద్దాము అన్నారు.
మేము మగపిల్లాడి వాళ్ళమైనా మరీ అంత తొందర అయితే ఎలా అని మార్చిలో పెట్టుకుందాం అని చెప్పాను.
ఎందుకంటే డబ్బు చూసుకోవాలి, కార్డ్స్ కొట్టించాలి వాళ్ళకి సులువేమో కానీ మాకు కష్టమే అందుకే సమయము అడిగాము, వాళ్ళు సరే అన్నారు.
పెళ్లి బాబా దయ వలన బ్రహ్మాండంగా అయింది. అతను సౌత్ ఆఫ్రికా లో భార్యతో సహితంగా ఉంటున్నాడు.
ఇక అమ్మాయి పెళ్లి ఎలాగా అని మా ఆవిడ తెగ దిగులు పడిపోతుంది. మా అమ్మాయికి మేము ఎన్నో సంభందాలు చూసినా కుదరడం లేదు.
నువ్వు కూడా అన్నయ్య లాగా బాబా పూజ చెయ్యి నీకు మంచి సంభందం వస్తుంది అని చెప్పాము.
అది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటుంది, అయినా కానీ బాబా ఫోటో ఒకటి పెట్టుకొని ఏ రోజు పారాయణ ఆ రోజు పూర్తిచేసి బయట నుండి బెల్లము, అటుకులు తీసుకువచ్చి నైవేద్యం పెట్టింది.
పారాయణ పూర్తి అలా అయిందో లేదో ఒక సంభందం వచ్చింది. వాళ్ళు గుంటూరులోనే ఉంటారు. వాళ్ళు అమ్మాయిని అక్కడే చూసేసుకొని మాకు నచ్చింది అని ఫోన్ చేసారు.
మేము చాలా భయపడ్డాము ఎందుకు అంటే మా దగ్గర అసలు డబ్బులు లేవు. ఆ విషయము వాళ్ళకి చెప్పేసాము, మేము పెళ్లి చేసే పరిస్థితుల్లో లేము అని చెప్పాము.
దానికి వాళ్ళు అమ్మాయి మాకు బాగా నచ్చింది ,మీరేమి కంగారు పడకండి పిల్లకి కావాల్సిన చీరలన్నీ మేమే కొంటాము ఇంకా మీ ఖర్చులకి మేమే డబ్బు ఇస్తాము అంటూ ఒక లక్షా పాతికవేలు మా చేతిలో పెట్టి మీరు పెళ్ళికి ఖర్చు చేయండి అన్నారు.
అబ్బాయి ఒకంపెనీలో ఇంజనీరుగా హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. ఆలా అమ్మాయి పెళ్లి జరిగిపోయింది. వాళ్ళు నిజాంపేటలో ఉంటారు. మా భాద్యత చాలా తేలికగా గట్టెకించాడు బాబా.
The above Miracle has been typed by: Mrs. Rajarajeswari. Sainathuni
Latest Miracles:
- నా పెళ్లిని , చెల్లి పెళ్లిని చక్కబెట్టిన బాబా ….!
- గురుబంధువుతో కళ్యాణ బంధం
- బాబా నా కలలో కనపడి, మూడు సంవత్సరాలు పట్టింది, నీ వియ్యపురాలిని పెళ్ళికి వప్పించడానికి, పెళ్లి చేయించినందుకు నాకేమిస్తావు ”? అని అడిగాడు.
- నేను బాబాకి హారతినిచ్చి చేసిన విన్నపాలు మాత్రమే మమ్మల్ని ఆపద(యాక్సిడెంట్)నుండి కాపాడాయి.
- దిల్ సుఖ్ నగర్ కోణార్క్ థియేటర్ దగ్గర జరిగిన బాంబ్ పేలుడు నుండి కాపాడిన బాబా వారు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments