నా పెళ్లిని , చెల్లి పెళ్లిని చక్కబెట్టిన బాబా ….!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నాకు ఇది వరకే ఒక పెళ్లి అయింది. ఆమె వాళ్ళ బావని ప్రేమించింది. ఇంట్లో వాళ్ళు, ఆమెని అతనికిచ్చి వివాహం చేయడం ఇష్టం లేక నాకు ఇచ్చి వివాహం జరిపించారు.

ఆ అమ్మాయి అతన్ని వదులుకోలేక పోయింది. నెల రోజులన్నా గడవక ముందే నన్ను వదిలించుకోవాలని మేము తనని చాలా చిత్రహింసలు పెడుతున్నామని పోలీస్ కేసు పెట్టింది.

పోలీసులు నన్ను అరెస్టు చేసారు. నాకు మతి పోయింది. పోలీసులు F I R రాయమంటారా? మాట్లాడుకుంటారా? అని అంటున్నారు. F I R రాస్తే గొడవ అవుతుంది. పరువు పోతుంది. జైల్లో పెడతారు.

ఎన్నాళ్ళు జైల్లో ఉంచుతారో తెలియదు. పోలీసులతో మాట్లాడాలని స్టేషన్ కి మా నాన్న కూడా వచ్చారు.

మా నాన్న మేము మాట్లాడుకుంటాము అని చెప్పారు. ఆ అమ్మాయి డబ్బు కావాలంది. మేము ఇస్తామని చెప్పాము.

ఇంటికి వచ్చాక నేను వరసగా వారం రోజులపాటు బాబా గుడికి వెళ్లి బాబా ముందు ఏడ్చాను.  ‘‘ఎందుకు బాబా ఇలా జరిగింది నా తప్పు ఏమి లేదు, అయినా కూడా నన్ను దోషిని చేసి ఆ అమ్మాయి చాలా అవమానం చేసింది.

5, 6 లక్షల డబ్బు కూడా అడిగారు. నేను బాబా ముందు చూడు బాబా! నాకేం తెలియదు నువ్వే మాట్లాడడానికి వస్తావో లేకపోతే ఎవరినైనా పంపిస్తావో నాకు తెలియదు. నా గురించి మాట్లాడడానికి పంపించు బాబా” అని అనుకున్నాము.

మాతో రవన్న (మా ఏరియాలో ఉండే సాయి భక్తుడు) వచ్చాడు. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మా అబ్బాయిని ఇక్కడే పోలీస్ స్టేషన్ లోనే వదిలేస్తాము. డబ్బులు కూడా ఇవ్వం” అన్నాడు.

”డైవర్స్ ఇస్తారా?” అని పోలీసులు అడిగారు. ఆమెకి నేనంటే ఇష్టం లేదు   డైవర్స్ ఇచ్చేస్తాను” అని చెప్పాను. నగలు ఇచ్చేసాము, డబ్బు ఇచ్చేసాము. అంతా అయిపోయింది.

నాకు జీవితం పైన విరక్తి కలిగింది. పరువు పోయింది. ఘోరావమానం జరిగింది, ప్రపంచం అంతా నాకు శూన్యంగా మారిపోయింది, అన్నం సహించడం లేదు, ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు.

మార్పనేది సహజం, మరుపనేది మానవ జన్మకి వరం. కొన్నాళ్ళకి మా ఇంట్లో నాకు మళ్ళీ పెళ్లి అంటుంటే, నేను మా అమ్మకి చెప్పేసాను.

”నేను ఇంక ఇప్పుడే పెళ్లి గిళ్ళీ చేసుకోను. జీవితానికీ జరిగిన అవమానం చాలు, నాకు ఇప్పుడిప్పుడే మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు చేయొద్దు” అని చెప్పాను.

అయినా ఇంట్లో వాళ్ళు ఊరుకోరుగా మళ్ళీ సంభందాలు చూసారు, పెళ్లి చూపులు, పెళ్లి కుదిరింది, పెళ్లి అయిపోయింది.

మాకు అబ్బాయి పుట్టింది కూడా గురువారమే. ఇప్పుడు మాఆవిడ చాలా మంచింది. నన్ను అర్ధం చేసుకుంటుంది.

నాకొక చెల్లెలు ఉంది. ఆమెకి పెళ్లి కుదిరింది, అబ్బాయి హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళని తెలిసింది.

మంచి సంబంధం, పెళ్లి చెయ్యాలి అంటే చేతిలో చిల్లి గవ్వ లేదు. నాన్న తన తాగుడు వ్యసనానికి ఇల్లంతా గుల్ల అయిపోయింది.

పెళ్లి అంటే చాలా డబ్బు కావాలి. చాలా మందిని డబ్బు అడిగాను. ”డబ్బా! నీకు డబ్బులు ఇస్తే మళ్ళీ ఎలా తీరుస్తారు. అని ఎగతాళి చేసారే కానీ ఎవరూ నయా పైసా ఇవ్వలేదు.

అందరూ మేము డబ్బు ఇవ్వకుండా వీడు పెళ్లి ఎలా చేస్తాడో చూద్దాం అని అనుకున్నవారే.

నేను బాబాతో చెప్పుకున్నాను ”బాబా నా పరిస్థితి నీకు తెలుసు. ఎలా ఈ బాధ్యత నుండి బయటికి లాగుతావో నీ ఇష్టం పెళ్లి దగ్గర పడుతోంది. ఏం చేయాలి బాబా’అని.

ఈ పెళ్లి అయ్యేంత వరకు అంటే దాదాపు 48 గంటలు అన్నం తినను అని బాబాతో అనుకున్నాను.

అంతే! అప్పటి దాకా ఇవ్వను, డబ్బు లేదు అన్నవాళ్ళు ఒక్కసారిగా వాళ్లకి వాళ్లే డబ్బు తెచ్చి ఇచ్చారు. పెళ్లి బ్రహ్మాండంగా జరిగిపోయింది.

పెళ్లి చేయించిన బాబాకి, పెళ్లికి డబ్బులు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles