Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been prepared by Lakshmi Prasanna
- Lakshmi-Prasanna-5 5:41
ఓం సాయి రామ్
సాయి బందువులకు నమస్కారం. నా పేరు లక్ష్మి ప్రసన్న.హైదరాబాద్.
సాయిని నమ్మితే అన్నీ ఆయనే తల్లి, తండ్రి, గురువు, బందువులు, అన్ని ఆయనే అని మన ప్రగాడ విశ్వాసం.
నా విషయంలో బాబా నిరూపించారు.
మన ఇంటి బాద్యతను మనం ఒక్కోసారి బారంగాను, ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము.
కాని బాబా ప్రతి ఒక్కరిని ఎలా ఇంత ప్రేమగా చూసుకొంటారు, మనం ఏమి చేసి ఆయన ఋణం తీర్చుకోగలము. మన మనసు అనే పుష్పమును ఆయన చరణాలకి సమర్పించడం తప్ప.
నా పెళ్ళికి మాత్రం బాబా దగ్గర ఉండి మరీ అన్ని చూసుకొనే బాద్యత తన మీద వేసుకున్నారు.
అది ఎలా అంటే పది సంవత్సరాల క్రిందట జరిగిన విషయం, నా పెళ్లి చేయాలని ఇంట్లో అందరు అనుకున్నారు.
కాని సంబంధం విషయం కానీ, పెళ్లి పనులు కాని చేసె వాళ్ళు ఎవరు, ఉన్నవాళ్లు బంధువులుకాదు, రాబంధువులు. ఇలా చెప్పటానికి కష్టంగా ఉన్నా, కానీ జరిగింది అదే.
మా నాన్న వయస్సు పెద్దది, అన్నయ్య అప్పుడే సెటిల్ అవుతున్నాడు.
కొన్ని పరిస్థితుల కారణంగా ప్రస్తుతం కావలసిన డబ్బు కూడా లేదు.
అప్పట్లో డబ్బు ఎంత ఇస్తే అంత మంచి సంబంధం వస్తుంది.
ఇక మా అమ్మ ఒక తల్లిగా ఏమి చేస్తుంది, ఎప్పుడు బాద పడేది.
అన్ని బాబా చూసుకుంటారు, బాద పడకు టైం వస్తే అదే అవుతుంది, అని నేను అమ్మకి ధైర్యం చెప్పేదాన్ని.
ఎన్ని సంబందాలు చూడాలో ఏమో, అప్పుడే అయ్యిందా. అని అంటూ నన్ను నిరుత్సహ పరిచేవాళ్లు.
కాని ఉన్నారుగా మన బాబా వారు ఆయన చేసిన చమత్కారం అంతా ఇంతా కాదు సుమా.
ఎవరిని అయితే రాబందువులు అన్నానో వాళ్ళు సంబంధం తెచ్చారు. రాబందువులు కదా, నమ్మాలా లేదా ? బాబా ఎట్టకేలకు ఒప్పించారు.
అబ్బాయి హైదరాబాద్, WIPRO లో సాఫ్ట్ వేర్, బాగున్నాడు. మరి కట్నం? చివరకు నన్ను చూసుకోడానికి వచ్చారు.
ఆ అబ్బాయి చాలా సంబందాలు చూసారు అంట. కాని మన దగ్గర బాబా ఉన్నారుగా, ఏమో అప్పడు నా పక్కనే ఉన్నారేమో బాబా.
నేను వాళ్ళకి నచ్చాను అని వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాము అని అన్నారు.
కట్నం వాళ్ళు ఏమి చెప్పలేదు అసలు ఏమి అడగలేదు. అన్నీ మా వాళ్ళు మాట్లాడారు.
పాపం అబ్బాయి ఏమీ అడగలేదు అనీ మా వాళ్ళు అతనికి ఏ లోటు జరగకుండా అన్నీ చేసారు.
పదుల్లో ఉండే కట్నం చాలా తగ్గించారు బాబా.
ఒక వారం లోపు పెళ్లి ఒక శనివారం చూసారు.మరు శనివారం అదే టైంకి పెళ్లి. అన్ని ఫాస్ట్, బాబా సూపర్ ఫాస్ట్.
కాని అబ్బాయి మంచి వాడు కాదని, ఇంత తొందరగా పెళ్లి ఏంటి అని ఎవరెవరో ఫోన్లు ఏమి చేయాలి.
నేను ఒక్కదాన్ని అమ్మాయి, నా విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతగా ఉన్నారు.
బాబా తప్పిస్తున్నారా, కాపాడుతున్నారా, అయోమయo లో మా కుటుంబం.
నాకు సచ్చరిత్ర పారాయణం తప్ప వేరు ద్యాస లేదు. అన్ని ఆయనే చూసుకుంటారు, అని ధైర్యం గా ఉండేదాన్ని.
నాకు బాబా మీద నమ్మకం అలా ఉండేది. చివరకు నా నమ్మకమే గెలిచింది. బాబా నన్ను గెలిపించారు.
అన్నీ పనులు బందువులతో చేయించారు బాబా. నా పెళ్లి కార్డు మొదట బాబాకి, బోజనాలు మొదట బాబాకి అన్నీ బాబానే మొదట.
ఒడి దుడుకుల మద్య శనివారం రానే వచ్చింది.
నన్ను పెళ్లికూతురు చేయడానికి సిద్దంగా ఉన్నారు. అప్పడు కూడా మా చుట్టాలబ్బాయి, నా దగ్గరకు వచ్చి టైం లేదు ఆలోచించుకో అబ్బాయి మంచివాడు కాదు అంట, నీకు పిచ్చి, ఇప్పటికి మించి పోయింది లేదు, పెళ్లి ఆపెద్దాము.
నా రాత ఎలా ఉంటె అలా, బాబా ఏమి చేసిన అది నాకు సమ్మతమే అని నేను గట్టిగా పెళ్లిపీటలు ఎక్కాను.
చివరకు ఏమైంది, నా పెళ్లి జరిగిపొయింది. అందరూ ప్రేమ వివాహం ఏమో అని కూడా అనుకున్నారు.
నా జీవితంలో బాబా చేసిన మార్పు ఏమిటి అంటే ????? ఆ అబ్బాయి ఎలాంటి వాడు అంటే !!!! నన్ను నెలకు రెండు సార్లు షిర్డీ తెసుకువేల్లె మనిషి.
నేను ఎక్కడ చందాలు రాసిన అంటే ఎక్కువ మోత్తంలో ఏమీ అనకుండా డబ్బులు ఇచ్చే మనిషి. ఒక్క చెడ్డ అలవాటు లేని కలికాలం లో పుట్టిన మనిషి.
ఇప్పటికి మా పెళ్లి జరిగి మే నెలకు 11 సంవత్సరాలు.
నేను ఎప్పుడు షిర్డీ వెళ్ళినా బాబా నాతో చెప్పే కామన్ మాట!!!! “నేను వెతికి వెతికి నీకు తెచ్చాను, వీడిని . నువ్వే రాక్షసి అని చమత్కారంగా నాతో అనే వారు బాబా.”
బాబా అన్నీ తానె అయి నా జీవితానికి నా ఆద్యాత్మిక జీవితానికి వెంట ఉండి నన్ను నడిపిస్తున్నారు.
ఈ బందం ఇలాగే కొనసాగి నేను చివరకు బాబా చరణాలలో కలిసిపోవాలని మనస్పూర్తిగా నమస్కరిస్తున్నా.
సాయి నాథ్ మహారాజ్ కి జై.
Latest Miracles:
- నా తోడుగా ఉండి – సప్త సముద్రాల అవతలున్న నన్ను కాపాడారు–Audio
- బాబా నా కలలో కనపడి, మూడు సంవత్సరాలు పట్టింది, నీ వియ్యపురాలిని పెళ్ళికి వప్పించడానికి, పెళ్లి చేయించినందుకు నాకేమిస్తావు ”? అని అడిగాడు.
- బాబా ఆశీర్వాదంతో జరిగిన మా అమ్మాయి పెళ్లి …..!
- దిల్ సుఖ్ నగర్ కోణార్క్ థియేటర్ దగ్గర జరిగిన బాంబ్ పేలుడు నుండి కాపాడిన బాబా వారు–Audio
- పెళ్లి చేసి ఉద్యోగం ఇప్పించిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
3 comments on “సాయి దగ్గర ఉండి మరీ నా పెళ్లి చేసారు.—audio”
kishore Babu
May 1, 2018 at 12:41 pmబాబా వారి మీద మీకున్న నమ్మకం,భక్తి శ్రద్ధలు చూసిన తర్వాత మాలో ఉన్న అహం పోయింది…మీరు వందల బాబా వారి లీలలు రాయాలి అని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటున్నాను.
Maruthi Sainathuni
May 1, 2018 at 4:58 pmSai Baba…Sai Baba…Sai Baba
Sreenivas
May 2, 2018 at 8:49 amMiracle చాలా బాగుంది Madam ……మీ ప్రతి miracle చదవటం పూర్తీ అయ్యేలోపు కండ్ల వెంట నీరు వస్తుంది.