Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంత దాస్ గారి అనుభవములు రెండవ భాగం
మా అమ్మ నాకు పెళ్లి చేయాలని గొడవ చేసేది. సంబంధాలు చూడసాగింది.
మా అమ్మ ప్రతి నెలపెన్షన్ కోసం ఆఫీసుకు వెళ్ళినపుడు అక్కడ తెలిసిన చుట్టాల వాళ్ళ అమ్మాయి ఉంది. నాకు ఇవ్వాలని అనుకున్నారు.
పిల్లను చూడటం, నచ్చటం అయ్యాక అతనికి ఉద్యోగం లేదు ఇవ్వవద్దు అనుకున్నారు.
ఆ తరువాత మా మామగారు నా గురించి వాకబు చేసి నాకు ఒక్క బాడ్ హ్యాబిట్స్ లేవు అని తెలుసుకుని అబ్బాయి మంచివాడు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, ముఖ్యంగా అతను బాబా భక్తుడు అని 1989లో మా పెళ్లి చేసారు.
మా పెళ్లి అయ్యాక మా అత్తగారి వాళ్ళతోటి అందరం షిరిడికి వెళ్ళాము. అప్పుడు కూడా మూడు రోజులు వున్నాము. బాబా దర్శనం చేసుకుని సాకోరీ చూసాము.
అప్పుడు ఉదయం అర్చనకి అవకాశం వచ్చింది. ఉదయాన్నే హారతి అయ్యాక ఇప్పుడంటే బాగా జనం ఎక్కువ అయ్యి గద్దె ఎక్కటం ఆపేసారు.
1989లో అప్పుడు బాబాను స్వయంగా పాలతోనూ రోజ్ వాటర్ తోను అభిషేకాలకు అనుమతించేవారు. బాబాను స్వయంగా తాకే అవకాశం ఉండేది.
అర్చన అంటే కాకడా హారతి అభిషేకం అయ్యాక కొబ్బరికాయ పూలదండలు అన్నీ తీసుకెళ్లి బాబా ముందు కూర్చోబెట్టి అష్టోత్తరశతనామావళి పూజ చేయించి,
అది అయ్యాక ఎవరైతే పూజ చేయించుకున్నారో వారే స్వయంగా మెట్టు ఎక్కి స్వయంగా బాబా మేడలో పూలమాల వేసి అక్షింతలు బాబా మీద వేసి బాబా పాదాలు మ్రొక్కి కిందకు దిగవచ్చు.
ఆ రోజుల్లో ఆ అవకాశం భక్తులకు ఉండేది. అది ఇప్పుడు లేదు.
పెళ్లి అయిన 6 నెలలకి ఆల్విన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చే వరకు కూడా నేను షాపు లోనే ఉండేవాడిని.
ఉదయం 7 గంటలకు షాపు తెరిస్తే రాత్రి 10 గంటలకు మూసేవాడిని. అంత దాకా నేను పని చేసేవాడిని.
ఇంట్లోనేమో మా ఆవిడ ఉదయం నుండి రాత్రి వరకు అంత చాకిరీ తను ఒక్కతే చేసేది. మా వదినలు అసలు పని చేసేవారు కారు.
ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం. పైగా డబ్బు కోసం అన్నయ్య నన్ను బాగా వేధించేవాడు. తాను మాత్రం బాగా జాలీగా ఉండేవాడు.
అలాగే ఉంటూ కుకట్ పల్లి హోసింగ్ బోర్డు లో ఒక స్థలం ఎలాగో కొనుక్కున్నాను. 8000 తో కొన్నాను.
మా అన్నయ్య జల్సాల కోసం ఇంట్లో ఎవరికీ తెలియకుండా, చెప్పకుండా ఆ కాగితాలు తీసుకెళ్లి ఆ స్థలం కాస్తా ఎవరికో అమ్మేశాడు మా అన్నయ్య.
నేనేమి మాట్లాడలేదు. మా ఆవిడ విరామం లేకుండా పని చేయవలసి రావటంతో 6 నెలలు గర్భం పోయింది. చాలా నీరసించి పోయింది.
మందులకు ఆసుపత్రికి చాలా డబ్బులు కావాల్సి వచ్చింది. నేను డబ్బు సంపాదించే యంత్రంగా తయారవ్వాల్సి వచ్చింది. అటు ఆల్విన్ లో ఉద్యోగం, ఇటు షాపు ఇది సరిపోక పీర్లెస్ లో కూడా చేరాను.
ఒక రోజు మా అమ్మ అంది ఒరేయ్! నువ్వు నీ భార్య వేరే ఉండండి. ఎందుకంటే ఎవరికీ ఏమి పట్టడం లేదు.
నీ అన్న ఏమి పట్టించుకోవడం లేదు. వాళ్ళకి బాధ్యత తెలియాలి అందుకని మీరు మీకు కావలసిన సామాన్లు తీసుకుని వేరే ఉండండి అంది.
నువ్వు మాతోటె ఉండాలి అమ్మ అన్నాను. సరే నేను నీతోనే ఉంటాను రా అంది.
సరేనని నేను పప్పు ఉప్పు సామాను తెచ్చుకుని నేను అదే ఇంట్లో ఒక రూమ్ లో వేరే వంట మొదలు పెట్టాము.
ఈ లోపు ఒక జ్యోతిష్కుడు పరిచయం అయ్యాడు. ఆయన వాస్తు బాగా చూస్తాడు. ఆయన్ని మా స్నేహితుడి ఇల్లు చూడటానికి తీసుకు వెళ్ళాను.
వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. అది శ్రీ దత్త కాలనీలో ఉంది. వెంటనే మా గురువుగారు మా ఇల్లు చూడటానికి వచ్చారు.
మా ఇల్లు అంతా చూసి ఇది నీకు సూటు అవ్వటం లేదు. ఇప్పుడు చూసి వచ్చాము కదా నీ స్నేహితుడి ఇల్లు అది నీకు బాగా సూటు అవుతుంది. అందులోకి నన్ను మారిపొమ్మన్నాడు.
వాడిది చాలా పెద్ద ఇల్లు అంత పెద్ద ఇంట్లో నేను ఒక్కడినే ఉండాలనుకుని గురువు గారు చెప్పారు.
కాబట్టి నేను నా భార్య, అమ్మ, నా మరదలు, ఆ అమ్మాయి మా దగ్గరే ఉండేది. చదువుకునేది.
మా ఆవిడ ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన ఆ అమ్మాయి చూసుకుంటుండేది. అందరూ అక్కడికి మారిపోయాము.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru,
అనంత దాస్ గారి అనుభవములు మూడవ భాగం తరువాయి….
Latest Miracles:
- ఏ ఉద్యోగం లేదు అని బాధ పడుతున్న నాకు, తన గుడిలోనే ఉద్యోగం ఇప్పించిన బాబా వారు
- బాబా వారి దయతో వారం లోగ మా ఇల్లు అమ్ముడయిపోయి, మా పెద్ద పాప పెళ్లి చేయగలిగాము.
- నచ్చిన ఆహారాన్ని వదిలిపెట్టమని సందేశం ఇచ్చి ఉద్యోగం ఇప్పించిన బాబా వారు …..!
- భర్త చనిపోయి కష్టములొ ఉన్న భక్తురాలికి, పని నేర్పించి మంచి ఉద్యోగం ఇప్పించిన బాబా వారు…..
- గృహ ప్రవేశానికి ఆహ్యానించిన భక్తుని ఇంటికి, ముసలమ్మ రూపంలో వెళ్ళిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments