నచ్చిన ఆహారాన్ని వదిలిపెట్టమని సందేశం ఇచ్చి ఉద్యోగం ఇప్పించిన బాబా వారు …..!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మేము ఒకసారి కుటుంబం అంతా కలిసి షిరిడి కి వెళ్ళాము. బాబా దర్శనం అయ్యింది.

హారతికి వెళదామని నిలబడ్డాము. బాబాని దర్శనం చేసుకుందామంటే మా నాన్న కెదురుగా పిల్లర్ (స్తంభం) అడ్డు వచ్చింది.

ఎదురుగా T.V. ఉంది, T.V. లో చూస్తే బాబా కనపడతాడు కానీ T.V. లో నిన్ను చూడాలంటే ఇంట్లో నుండే చూడవచ్చుగా బాబా,

ఇంత దూరం రావటం ఎందుకు అనుకుని, బాధపడి T.V. కేసి కూడా చూడకుండా అలాగే వున్నాడు నాన్న.

ఇంతలో హాలంతా నిండిపోయింది. మమ్మల్నందరిని హారతికి కూర్చోపెట్టారు.

మా నాన్నకి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ”ఇంత కష్టపడి అంత దూరం నుండి మేము నిన్ను చూడడానికి వస్తే మాకు అసలు దర్శనం ఇవ్వవా? బాబా, T.V. లో చూడాలంటే, అదే T.V. ఇంటి నుండి కూడా చూడొచ్చు కదా ఇక్కడి దాకా ఎందుకు రావడం” అని బాధ పడుతున్నాడు,

ఇదే బాధ సుడులు తిరుగుతోంది. ఇంతలో ముందు కూర్చున్న జనం లోనుంచి కోలాహలం.

ఏమైంది అంటే ”పానీ ఆరే” ”పానీ ఆరే” అంటూ లేచి పోతున్నారు. ఏమైంది అని చూస్తే మాకు రెండు వరసల ముందు 16 , 17 సంవత్సరాల అబ్బాయి ప్యాంటు అంతా తడిసిపోయి ఉంది.

అతను urine pass  చేసేసాడు. అతనికి ఏమైందో ఏమో మరి, ఆరోగ్యం బాగోలేదేమో, అందరూ లేచేసరికి అక్కడున్న వాళ్ళు వెనక్కి వచ్చేసారు.

మేమందరము అక్కడ నుండి ముందుకు కదిలాం. నాన్నకి పిల్లర్ అడ్డు పోయింది. ఆయన నాన్న బాధను ఎలా తీసేసాడో చూడండి! ఎంత దయామయుడు మన తండ్రి.

మా చెల్లెలు చాలా చిన్నప్పుడే ”సాయి చాలీసా” చదివేది. అది చాలా చిన్నప్పుడే దానికి పట్టు పడింది.

ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడే అది ”బాలానందం” లో సాయి చాలీసా చదివి గిఫ్ట్ సంపాదించింది.

మా చెల్లెలు ఇంజినీరింగ్ చదివింది. తన జాబ్ కోసం ట్రై చేసింది. ఒక కంపెనీ లో వచ్చింది.

అసలు మా చెల్లెలు జాబ్ కోసం ఎందుకు ట్రై చేసింది అంటే, పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగంలో చేరితే ఆ డబ్బులు అత్తగారు వాళ్ళు వాడుకుంటారు.

అదే ఇప్పుడు ఉద్యోగం చేస్తే కొంత డబ్బులు నాన్నకి ఇవ్వవచ్చు కదా! అప్పులు తీరతాయి. అనే భావంతో జాబ్ కోసం తాపత్రయ పడింది.

ఆ ఉద్యోగం కోసం రోజూ ”బాబా” కి అభిషేకాలు చేసింది. ఒక జాబ్ వచ్చింది. అది జాయిన్ అయిన వారంలోనే పోయింది.

దానికి బాధ మరింత పెరిగిపోయింది. ”ఏమిటి బాబా నన్ను అసలు పట్టించుకోవడం లేదు” అని బాగా ఏడ్చేది.

ఒక ఇంటర్వ్యూ లో నాలుగు రౌండ్లు దాక అయింది, కానీ ఆ కంపెనీ లో ఉద్యోగం రాలేదు.

రోజూ ”బాబా” ముందు గుడిలో ఏడుస్తుంటే, ఒక రోజున ఒక ఆంటీ వచ్చి, ”అమ్మా! నువ్వు ఏమి అనుకోకపోతే నేను ఒక విషయం చెబుతాను,

నువ్వు రోజూ వచ్చి బాధ పడుతున్నావు, మేము కూడా నీలాగే మా అబ్బాయి గురించి ఉద్యోగం రావాలని తాపత్రయం పడ్డాం,

అలా రావాలంటే మనం ఇష్టంగా తినే ఆహార పదార్ధాన్ని ఏదయినా నీకు ఉద్యోగం దొరికే దాక వదిలిపెట్టు, అప్పుడు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది”, అని చెప్పింది.

ఆ రోజు గురుపౌర్ణమి. ఆ రోజు రాత్రి గుడిలో పల్లకి సేవ కూడా పూర్తి అయిపోయిన తరవాత బాబా ముందు కూర్చొని

”బాబా ఆ ఆంటీ ఏదో ఒక ఆహార పదార్ధం నాకు ఇష్టం అయ్యింది వదిలి పెట్టమని చెప్పింది.

నేను ఈ రోజు నాకు ఇష్టం అయిన కిచిడి రైస్ ను వదిలిపెడుతున్నాను. నాకు ఉద్యోగం వచ్చేంత వరకు నేను తినను” అని అనుకోని ఇంటికి వచ్చింది.

అది జరిగాక వారం పది రోజులు గడవక ముందే ఒక శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం (శని , ఆది వారాలు I T ఆఫీస్ లు వుండవు) అంతకు ముందు మా చెల్లెలు నాలుగు రౌండ్లు ఫెయిల్ అయిన కంపెనీ H R ఫోన్ చేసి,

”అమ్మా! నీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వు, నీకు మెయిల్ పంపించాము, దానికి రెస్పాండ్ అవ్వకపోతే ఫోన్ చేశాను” అన్నాడు.

మరునాడు మా చెల్లెలు ఇంటర్వ్యూ కి వెళ్ళింది. ఇంటర్వ్యూ లో రెండు రౌండ్స్ అయ్యాక నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పారట.

ముందు అదే కంపెనీ లో వచ్చి జారిపోయిన ఉద్యోగానికి, ఇప్పుడు అదే ఉద్యోగం లో స్థాయి మార్పుతో ఒక లక్ష రూపాయలు ఎక్కువ వచ్చేటటువంటి జాబ్ దొరికింది. ఇది ”బాబా” దయ కాదా.

The above miracle has been typed by: Mrs. Raja Rajewari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “నచ్చిన ఆహారాన్ని వదిలిపెట్టమని సందేశం ఇచ్చి ఉద్యోగం ఇప్పించిన బాబా వారు …..!

Prasanna

Jai sai ram …..edi nitya satyam shradda, bakthi tho namme variki saibaba karuna katakshalu eppudu vuntae 🙏

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles