Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు ప్రమోద్ కుమార్, వైదేహినగర్, వనస్థలిపురం, హైదరాబాద్ లో నా నివాసం. నేను ఫోటో, . వీడియోలు తీస్తూ సొంతంగా బిల్దింగ్ కాంట్రాక్ట్ లు కూడా చేస్తూ ఉంటాను.
MBA చదువుకున్నాను, నేను, నాతోపాటు మా నాన్న తమ్ముడు ఉంటారు. మా చెల్లికి పెళ్లి అయిపోయింది.
నేను చిన్నప్పటినుంచి బాబా గుడికి వెళ్ళేవాడిని. వేరే గుడికి ఎప్పుడూ వెళ్ళను.
నాకు ఐదారు ఏళ్ళ వయసున్నప్పటినుంచి మానాన్న నన్ను వనస్థలిపురం నుండి దిల్‌సుఖ్‌నగర్ బాబాగుడికి ప్రతి గురువారం కాగడా హారతికి తీసుకువెళ్ళేవారు.
ఆయనకీ బాబా అంటే బాగా నమ్మకం. 5.15 నిముషాలకి కాగడా హారతి ఉండేది అప్పట్లో.
ఒక రోజు గురువారం, నాన్నా, నేను బండి మీద కాగడ హారతి కి వెళ్తుండగా మధ్యలో ఏదో బండి అడ్డం వచ్చి ఇద్దరం కిందపడ్డాం, నాకేమి కాలేదు కానీ మా నాన్నకి కుడి మోకాలు లోంచి భయంకరంగా నెప్పి మొదలైంది.
అప్పటికప్పుడే కాలు బాగా వాచిపోయింది. దాదాపు గుడి దాకా వెళ్లిపోయము, ఇంకో 50 అడుగులు వేస్తే గుడి వచ్చేస్తుంది.
ఇంత దూరం వచ్చాం హరతి చూడకుండా ఇంటికి వెళ్లొద్దు అని ఆ నెప్పి భరించి అలాగే కుంటుకుంటూ నన్ను మోటర్ సైకిల్ మీద కూర్చోపెట్టుకొని గుడి దాకా వెళ్లి బయట బండి స్టాండ్ వేసి గుడిలోకి అడుగుపెట్టాం.
మా నాన్నకి ఇంక నెప్పి తెలియలేదు. హారతి అవుతోంది, నిలబడే ఉన్నాం. ఆతర్వాత అభిషేకం అయింది.
అప్పుడూ నీలబడే ఉన్నాడు. నెప్పి తెలియటం లేదు. అంతా అయ్యేటప్పటికి దాదాపు ఒక గంటన్నర సమయం పట్టే ఉంటుంది. ఆ గుడిలోనుంచి కాలు బయటకు పెట్టాడు.
అంతే నెప్పితో మళ్ళీ విరుచుకు పడిపోయాడు. ఇంక ఒక్క అడుగు కూడా వెయ్యలేక పోయాడు. ఆటో ఎక్కి ఇంటికి వచ్చాము.
అక్కణ్నుంచి హాస్పిటల్ కి వెళ్ళాము, సిమెంట్ కట్టు వేశారు. ఆ సంఘటన నాకు మనసులో నిలబడి పోయింది.
బాబాలో ఏదో ఉందని ఆనాడే అనుకున్నాను. పసివాణ్ణి కాబట్టి అంతగా ఏమి తెలియలేదు.
నేను పెద్దవాడిని అయ్యేసరికి వైదేహినగర్ లో బాబా గుడి తయారవ్వటం, రోజూ ఆ గుడికి వెళ్ళటం అలవాటయింది.
నా స్నేహితుడొకడికి, ఒక ప్రియురాలు వుంది. ఇద్దరు దగ్గరగా ముచ్చటలాడుకోవటం ఎంతో ఇదిగా ఉండడం చూసి నేను బాబాను అడిగాను,
“బాబా నాకూ ఒక ప్రేయసి వుంటే బావుంటుంది, నాకూ ఒక అమ్మాయిని చూపించు బాబా, ఒక అమ్మాయిని చూపించావంటే నేను ఉద్యోగం చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితంలో ఆ అమ్మాయితో స్థిరపడి హాయిగా ఉంటానుఅని అనుకున్నాను.
ఇలా బాబాతో రోజూ ఉదయాన్నే స్నానం చేసి బాబా ఫోటో ముందు నిలబడి మరీ చెబుతున్నాను. ఒక రకంగా ఆయన్ని వేదించాను.
అనుకోకుండా మా చెల్లెలికి ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ చేయ్యాలనుకున్నాము.
మా చెల్లెలు ఇంటర్మీడియట్ చదివింది. (ఫెండ్స్ బాగానే వున్నారు. ఎంగేజ్మెంట్ కి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. ఆ ఇద్దరూ నాకు ముందే తెలుసు.
ఈ ఇద్దరితో పాటు మరో అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి మా చెల్లిలికి కొత్తగా (ఫైండ్ అయిందిట. ఆ అమ్మాయి ని చూడంగానే నాకు బాగా నచ్చింది.
ఎంగేజ్మెంట్ కి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలలో ఆ అమ్మాయి ని చూపించి మా చెల్లిలికి ఈ అమ్మాయిని మీ వదినగా ఫిక్స్ అయిపోమన్నాను.
మా చెల్లెలు మా ఇంట్లో అందరికీ విషయం చెప్పింది. మా నాన్న వాడి జీవితం, వాడి ఇష్టం అన్నాడు. ఆ అమ్మాయిది మా కులమేనని తెలిసింది. నేనింకా కుషీ అయ్యాను.
అన్నీ శుభసూచకంగా అనిపిస్తున్నాయి. మా చెల్లెలు ఫ్రెండ్స్ ఆ అమ్మాయి తో “మంజు వాళ్ళ అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడట నువ్వు కనపడితే I LOVE YOU చెపుతాడట” అని చెప్పారట.
ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదట. ఈ లోపల పెళ్ళికి ముహూర్తాలు పెట్టడం, ఎంగేజ్మెంట్ కి పెళ్ళికి మద్య సమయం 3 నెలలు పట్టింది.
ఈ లోపల ఆ అమ్మాయి ని నేను చూడలేదు. పెళ్లి జరిగేటప్పుడు, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు తెర అడ్డం పట్టుకోవడానికి నన్నే పిలిచారు, పట్టుకున్నాను,
ఎందుకో చెల్లెల్ని చూడంగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ సమయంలో ఆ అమ్మాయి అక్కడ ఉందిట.
నేను ఎంగేజ్మెంట్ లో చూసినా, ఆ అమ్మాయి ని పోల్చుకోలేకపోయాను. ఎందుకంటే పెళ్లి అనంగానే ఆడపిల్లలు ప్రత్యేకంగా ముస్తాబు అవుతారు.
ఆ తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అన్నయ్యతోనూ, వాళ్ళ అమ్మతోనూ నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. వాళ్ళు ఏమనలేదు.
ఆ తర్వాత ఆ అమ్మాయి మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది. “మా నాన్నగారు మీరు ఎక్కడా బయట కలుసుకోవద్దు ఇంట్లోనే కలుసుకోండి” అని అన్నారు.
ఆ అమ్మాయిని మా నాన్న “మీ నాన్న ఏం చేస్తారు” అని అడిగితెలుసుకున్నారు.
వాళ్ళ నాన్న మానాన్నకి తెలిసినవారే. ఈ లోపు మానాన్న ఎక్కడో జాతకాలు చూసేవారున్నారని తెలిసి నా జాతకం, ఆ అమ్మాయి జాతకం తీసుకువెళ్ళి వారికి చూపిస్తే వారు మా ఇరువురి జాతకాలు పరిశీలించి
“వీరిరువురికి వివాహం కాదు, 15 రోజుల్లో వీరిద్దరికీ మనస్పర్దలు వచ్చి విడిపోతారు” అని చెప్పారుట.
మా నాన్న అది విని ఎంతో బాధపడుతూ ఆ విషయం నాకు చెప్పాడు. నేను భాదపడుతూ ‘బాబా గుడికి వచ్చాను.
గుడిలో పారాయణ పుస్తకాల దగ్గర ‘భక్తుల ప్రశ్నలకి బాబా వారి సమాధానాలు” అనే పుసకం వుంది. ఆ పుస్తకం చేతిలోకి తీసుకొని కళ్ళు మూసుకుని ఒక అంకెను తలచుకొని కళ్ళు తెరిచి పుస్తకం తెరవాలి.
ఆ సంఖ్య, లేదా అటూ, ఇటూ వున్న సంఖ్యలలో సమాదానం వుంటుంది. బాబా భక్తులు ఇది తెరచి, బాబా తాను స్వయంగా మనకి సమాధానమిస్తాడని భావిస్తారు.
నేను ఆ అమ్మాయి గురించి అనుకొని పుసకం తెరిచాను. “పేమికులు విడిపోతారు” అని వచ్చింది, “బాగా గొడవలు జరుగుతాయి, విడిపోతారు” అని కూడా వచ్చింది,
మరొక సమాదానం ఉద్యోగం చెయ్యడు, బిజినెస్ బాగా కలిసి వస్తుంది అని ఉంది. నాకు టెన్షన్ మొదలైంది,
ఆ తర్వాత నిజంగానే మా ఇద్దరి మద్యన గొడవలు మొదలయ్యాయి. ఆ అమ్మాయి వాళ్ళ బావతో సన్నిహితంగా వుండటం మొదలు పెట్టింది. వెంటనే అడిగితే నా ఇష్టం అంటోంది.
ఆ అమ్మాయి ని నేను గాడంగా ప్రేమించాను. ఆ అమ్మాయి అలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. ‘ఆ అమ్మాయి అతనితో సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఉండేది.
‘నేను బాబా ముందు కూర్చుని ఎడుస్తూండేవాడిని ఒక రోజు ఇంక ఆ అమ్మాయి ని పట్టుకుని అడిగేద్దామని మా గుడికి వచ్చే ఇద్దరు అక్కలను తీసుకొని వాళ్ళ కాలేజీకి వెళ్ళాను.
ఆ రోజు కాలేజీ తొందరగా అయిపోయిందిట. ఆ అమ్మాయి కొంత మంది స్నేహితురాళ్ళతో కలసి సినిమాకి వెళ్ళిందన్నారు.
ఏ సినిమా అంటే ‘పంజా’ అన్నారు. ఆ సమయంలో 5, 6 దియేటర్లో ఆ సినిమా ఆడుతోంది.
నేను సాయిబాబా గుడి (దిల్‌సుఖ్‌నగర్) ముందు నిలబడి బాబాని చూస్తూ ‘బాబా నీదే భారం, ఆ అమ్మాయి తో ఇవాళ ఏ సంగతీ తేలిపోవాలి, పైగా సినిమాకి వెళ్లిందట,
నేను ఒకే థియేటర్ లో చూస్తాను, అందులో ఆ అమ్మాయి వుండాలి అంతే బాబా” అనుకొని ఒక దియేటర్ లోకి వెళ్ళాను.
అక్కడ ఆ అమ్మాయి టికెట్స్ లైన్ లో కనబడింది. వెంటనే చేయిపట్టి లాగి “నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా” అని అడిగితే, “నువ్వంటే నాకిష్టం లేదు,నిన్ను నేను పెళ్లి చేసుకోను” అని చెప్పింది.
అంతే నా గుండె ఆగిపోయినంత పని అయింది, భూమి కంపించి పోతోంది, నేను అక్కడనుంచి వచ్చేశాను.
మర్నాడు వాళ్ళ అన్నయ్య వచ్చి నన్ను కొట్టాడు. అప్పుడు మా నాన్న మీ ఇంట్లో అందరికీ చెప్పే మా వాడు మీ చెల్లెల్ని ప్రేమించాడు, ఆ రోజు ఊరుకొని ఈ రోజు కోట్టే హక్కు నీకు లేదు అన్నాడు.
అలా ఆ అమ్మాయి తో తెగతెంపులు అయిపోయాయి. ఈ గొడవల్లో పడి గూగుల్ లో ఉద్యోగం రావలసింది, రాలేదు.
ఆ తర్వాత ఇంటీరియర్ డిజైన్ క్లాస్ లకి వెళ్లి అది నేర్చుకున్నాను. ఇంటీరియర్ డిజైన్ నాకెంతో ఇష్టం.
ఆ అమ్మాయి తో ఉంటే నా జీవితం వేరేలాగా ఉండేదేమో, అలా లేక పోబట్టి ఇప్పుడు నేను చాలా సంతోషంగా వున్నాను.
బాబా మనకు ఇష్టమని ఇచ్చి దానిలో కష్టం తెలియజేశాడు. అది నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను.
కొన్ని రోజులు భాదగా, మూడీగా ఉండేవాడిని, రాను రాను నేనేం పొందాలో నాకేం కావాలో తెలుసుకున్నాను.
The above miracle has been typed by: Sreenivas Murthy Muppalla
Latest Miracles:
- బాబా నా కలలో కనపడి, మూడు సంవత్సరాలు పట్టింది, నీ వియ్యపురాలిని పెళ్ళికి వప్పించడానికి, పెళ్లి చేయించినందుకు నాకేమిస్తావు ”? అని అడిగాడు.
- నన్ను ఆరోగ్యవంతున్ని చేసి, నా కుమార్తె వివాహం జరిపించిన బాబా వారు…రవి కుమార్
- నా పెళ్లిని , చెల్లి పెళ్లిని చక్కబెట్టిన బాబా ….!
- భవ్యష్యత్తుని ముందుగానే సూచించిన బాబా.
- 2 ,40,000/- రూపాయలు ఎలా వస్తాయి అనుకోని చింతిస్తూ వుంటే బాబా వారు 2 రోజుల్లో అందించారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments