Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
పిల్లవాడు ఆటలాడుతుంటాడు. సమయమే తెలియదా పిల్లవానికి ఆట పాటలతో.
తల్లి పిల్లవానిని చేరదీసి కడుపు నిండా తిండి పెడుతుంది. ఈ విషయంలో పిల్లవాని ఆట పాటలు భక్తుని ఆరాధనతో పోల్చవచ్చు.
భక్తి భావంతో నిండిపోయిన ఆ భక్తుడు తన ఇష్ట దైవాన్ని సేవిస్తూ, ఆరాధిస్తూ ఉంటాడు.
తల్లి లాంటి దైవం ఎంతకాలమని ఆ ఆట పాటలను (భక్తిని) చూస్తూ ఉండగలదు? కరుణించి తరుణోపాయం చెబుతుంది. సరిగ్గా ఇదే జరిగింది మార్చి 4, 1912న.
”నా భార్య సాయీ సాహెబ్‌ను పూజించేందుకు ఆలస్యంగా వెళ్ళి నప్పటికి, తాను చేస్తున్న భోజనాన్ని ఆపివేసి ఆమెను పూజ చేసుకోనిచ్చాడు” అని వ్రాశాడు ఆమె భర్త శ్రీ గణేశ్ కృష్ణ కపర్దే.
”ఒకసారి శ్రీమతి కపర్దే ఒక పళ్లెం నిండుగా శిరా, పూరీ, అన్నం, పప్పు, పాయసం, ఒడియాలు, అప్పడం, కోషింబర్ (ఉప్పు నిమ్మకాయ పిండిన వడపప్పు) తీసుకు వచ్చింది.
ఆమె నైవేద్యంతో రాగానే బాబా ఆతృతగా తన స్థానంలో నుండి లేచి, తన చొక్కా చేతులు మడుచుకొని తాను మామూలుగా భోజనం చేసే చోటుకు వచ్చి కూర్చొని, ఆ పళ్ళాన్ని తన దగ్గరకు లాక్కుని దాని మీద పెట్టిన మూతను తీసి తినానికి ఉపక్రమించారు” అంటారు వి.బి.ఖేర్.
ఆమె భక్తి అపూర్వమైనది. బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంలో ఉండేది.
”ప్రేమతో సమర్పించిన ఆ ఆహారాన్ని కొంత స్వీకరించి ఆమెకు తృప్తిని కలుగనియ్యి” అన్నారు అక్కడ ఉన్నవారు.
సాయి అంతటితో ఆగారా? సాయి శరణానంద ”భక్తులకు ఊది ఇచ్చేటప్పుడు, తమ పాదాలను ముట్టుకున్నప్పుడు, తమ చరణ సేవ చేసేటప్పుడు భక్తులకు బాబా స్పర్శ అనుభవమయ్యేది.
అప్పుడు కూడా ఆయన అందరినీ ముట్టుకోవటము, ప్రతి వారిని ఒకే విధంగా ముట్టుకోనివ్వటము చేసేవారు కాదు.
ఆయన ఏ భక్తునికైనా ఉపదేశం ఇవ్వాలి అనుకొనినప్పుడు, అతని విశ్వాసాన్ని, భావాన్ని అనుసరించి ముట్టుకోనిచ్చే వారు. కొన్ని సార్లు అభ్యంతరం చెప్పేవారు.
గౌరవనీయులయిన కపర్దే భార్యకు ”రాజారామ్” అనే మంత్ర జపాన్ని ఉపదేశించాలను కున్నప్పుడు, మసీదులోనికి స్త్రీలు మధ్యాహ్న సమయంలో రాకూడదనే నియమాన్ని ప్రక్కన పెట్టి ఆమెను అనుమతించారు.
తమ చరణ సేవ చేసుకోవానికి వీలుగా తమ కాళ్లను చాపి ఆమె చరణ సేవ చేస్తుండగా ”రాజారామ్, రాజారామ్” అని జపిస్తూండు అని మంద్రంగా చెప్పారు సాయి.
సాయి మనందరకు ఆయన చరణ సేవా భాగ్యము కలిగించు గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- రాజారామ్…..సాయి@366 జూలై 20…Audio
- సాయి ఆయుధం …..సాయి@366 డిసెంబర్ 26….Audio
- సలహా…..సాయి@366 ఏప్రిల్ 22….Audio
- మనసు ….. సాయి@366 మార్చి 17…Audio
- జై సచ్చిదానంద! …..సాయి@366 ఆగస్టు 11….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments