Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
అహమ్మద్‌నగర్ జిల్లాలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. బ్రిష్ ప్రభుత్వం ఆ వ్యాధిని కట్టడి చేయటానికి ప్లేగు టీకాలను ప్రప్రథమంగా ప్రవేశ పెట్టింది.
కలెక్టరు నానా సాహెబ్ చందోర్కరును పిలిచి ముందుగా ప్లేగు టీకాను తనను వేయించుకోమనియు అప్పుడు ప్రజలకు ప్లేగు టీకాలను వేయించుకొను ధైర్యము వచ్చుననియు ఆదేశించాడు.
నానా సాహెబ్ మనసులో ఆ టీకాలు హాని చేయునేమోనని శంకలో ఉన్నాడు. కాని విధిగా తాను ఆ టీకాలను వేయించు కొనవలసిన పరిస్థితి. ఏమి చేయాలో తోచక సతమతమయ్యాడు.
అప్పుడు షిరిడీలో కొలువై ఉన్న సాయినాథుడు ఆయనకు జ్ఞప్తికి వచ్చాడు. ఈ విషయమై సాయినాథుని సలహాను తీసుకొన దలచాడు నానా. సాయిబాబా వద్దకు బయలు దేరాడు.
ద్వారకామాయి చేరి సాయికి నమస్కరించి నానా సాహెబ్ చందోర్కర్‌తో సాయి ”నానా! ప్లేగు టీకాలు వేయించుకొనుము. నీకు జ్వరము రాదు. ప్రాణ భీతి లేదు” అని నానా సాహెబ్ ప్లేగు టీకాల ప్రసక్తి తేక మునుపే చెప్పాడు.
తాను వచ్చిన పని అయిందని సాయి సరైన సలహా ఇచ్చాడన్న నమ్మికతో ముందుగా తాను టీకాలు వేయించుకుని అందరికి మార్గదర్శకుడయ్యాడు సాయి సలహాతో.
అలా సాయినాథుని సలహాలను కోరిన వారెందరో ఉన్నారు. ఆ సలహాలు ప్రాపంచిక విషయములకే పరిమితము కాలేదు.
సాయి వద్దకు ఆధ్యాత్మిక పథమున పయనించుటకు వినాయక సాఠే అను వ్యక్తి వచ్చాడు.
అతడు గురు చరిత్ర పారాయణ చేశాడు. అతనికి స్వప్నములో సాయి కనిపించి గురు చరిత్రను బోధించాడు.
సాఠేకు తాను మరల గురు చరిత్రను పఠింప వలెనా? లేదా? అను విషయమును సాయిని అడిగి తెలుసుకొని రమ్మని కాకాను పంపెను. సాయి సలహా ఇచ్చెను. సాఠే పాటించెను.
బ్రిటిష్ ప్రభుత్వంలో ఉత్తమ స్థానంలో ఉన్న వ్యక్తి సర్ శంకరన్ నాయర్. ఈయనకు కపర్దే చిరపరిచితుడు. నాయర్‌కు కపర్దే సాయీల బంధము తెలియును.
తాను ఉద్యోగములో కొనసాగటం మంచిదా? ఆధ్యాత్మికంగా తాను తప్పు మార్గంలో పోతున్నాడ? అలా అయితే సాయి సరైన మార్గంలో పెడతాడా? అని కనుక్కొని రమ్మని కపర్దేను షిరిడీకి పంపుతాడు.
కపర్దే షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించాడు. ఐతే కపర్దే బాబా సలహాను తన డైరీలో రాయలేదు.
సర్ శంకరన్ నాయర్ ఏప్రిల్ 22, 1934న మరణించెను.
సాయి తన సలహాలను ఎవరు అడిగినా ఇచ్చుటకు తయారుగా ఉంటారు. సలహాలను అడగవచ్చు. అంతితో ఆగక వాిని పాటించుటే మన విధి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మనసెరిగిన వాడు మా దేవుడు…..సాయి@366 ఆగస్టు 22….Audio
- ఔనా! నిజమేనా?…..సాయి@366 జూన్ 17….Audio
- సాయి ‘పిచ్చుక’ నానా …..సాయి@366 ఆగస్టు 21….Audio
- మసీదు పుట్టిల్లు…..సాయి@366 ఏప్రిల్ 16….Audio
- దాహం! దాహం!!…..సాయి@366 మే 24….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments