Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
ఏకనాథుడు ఒక అభంగంలో:
”నా తల్లి పుట్టిల్లు భీమా నదీ తీరంలోని పండరీపురం, నా తల్లిదండ్రులు రఖమాయి, విఠలులు…” అంటూ తల్లి పుట్టిల్లును తలచుకుని శరణు పొందుతున్నానంటాడు.
ఎంతటి అనన్య శరణం ఏకనాథునిది.
అంతటి శరణ్యమే సాయి భక్తుడైన శ్యామాలోనూ కనిపిస్తుంది. చిటికెన వ్రేలుకు పాము కాటు వేసింది.
సాంప్రదాయక వైద్యానికి పోకుండా సాయి వద్దకే వచ్చాడు శ్యామా. సాయి మసీదు మెట్లను ఎక్కవద్దని శాసించాడు. అది తననే అనుకుని నివ్వెరపోయాడు శ్యామా.
”మసీదు నా పుట్టిల్లు. నేను సాయికి కన్న కొడుకును. మరి కన్న తల్లే బిడ్డను ఇవాళ ఇంతగా కోప్పడుతొంది ఎందుకు? పాము కాటు వేసింది అన్న వేదనను తల్లి దగ్గర కాక మరెవ్వరి దగ్గర చెప్పుకుంటాం? ఆ కన్న తల్లే తరిమేస్తే ఇక నా గతి ఏమిటి?” అని దీనంగా మొహం పెట్టాడు.
అవును ఏకనాథుని వలె, ద్వారకామాయియే తన పుట్టినిల్లు అని ధైర్యంగా పలికిన ధన్యజీవి, ఆదర్శప్రాయుడు శ్యామా.
ఈ ఒక్క సంఘటనే గీటురాయి ఆయన జీవితంలో. స్నేహం విషయానికి వస్తే, సాయిని స్నేహితునిగా భావించాడు శ్యామా. కాని ఆ స్నేహ బంధమును ఒక్కొక్కసారి దాటిపోతుంటాడు.
ఇది శ్యామా బలహీనత కాదు. సాయి శక్తిపై శ్యామాకున్న భరోసా. మొదట్లో సాయి అంటే నమ్మకం లేదు.
సాయి వివిధ భాషలలో మాట్లాడటం, తాను దర్శింపబోయిన ఆనందనాథ్ స్వయంగా వచ్చి, సాయిని దర్శించుకోవటం, అనేక ఇతర మహిమలు సాయినాథుని వైపు ఈతనిని లాగి వేశాయి.
సాయితో అత్యంత సన్నిహితంగా ఉన్నా సాయిని ఇతను ‘దేవా’ అని సంబోధించే వాడు.
సాయి సచ్చరితలోని సంఘటనలు దాదాపు సగం వరకు ఈయనతో ప్రమేయం ఉన్నవే.
ఈయనకు భక్తుల అనుభవాలతో ఉత్సుకత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అది భక్తులలోని వివిధ అంశాలను తెలుసుకునేందుకు వీలు కలిగించింది.
ఉదాహరణ: నానా సాహెబ్ బాహ్య సౌందర్యం చూచి పరవశించిన సంఘటన శ్యామా నానాను ప్రశ్నించనిదే బయటకు తెలిసేది కాదు.
ఈయన ఏప్రిల్ 16, 1944లో సాయిలో ఐక్యం అయ్యాడు.
శ్యామాకున్న సఖ్యత మనకు సాయి వద్ద లభించు గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయిని పస్తులుంచిన డాక్టరు! …..సాయి@366 ఏప్రిల్ 28….Audio
- వికటించిన కషాయం….సాయి@366 సెప్టెంబర్ 16….Audio
- ముందుగ సూచించుట,సాయి బాబా–Audio
- కాదు సుమా కల! నిజమేలే!!….. సాయి@366 మార్చి 16….Audio
- లే! నడువు!! …..సాయి@366 ఏప్రిల్ 29….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments