ముందుగ సూచించుట,సాయి బాబా–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!

This audio has been prepared by Mr Sreenivas Murhty

  1. Mir-3-Shyama-Dream-By-Sreenivas-Murthy 5:36
ఒకసారి శ్రీసాయిబాబా శ్యామాకు స్వప్నంలో కనపడి “శ్యామా! గోవర్ధన్ దాస్ యింటికి వెళ్ళావా” అని అడిగారు. శ్యామా లేదని చెప్పగానే బాబా” గోవర్ధన్ తల్లి చనిపోయింది. వెళ్ళి అతనిని పరామర్శించు” అని చెప్పారు.                
శ్యామాకి బాబా వాక్కుల మీద నమ్మకం. అందుచేత మరుసటిరోజు మధ్యాహ్న్నం 3 గంటలకు గోవర్ధన్ యింటికి వెళ్ళాడు శ్యామా.
అక్కడికి వెళ్ళగానే బాబా చెప్పినమాటలు పూర్తిగా యదార్ధమనితెలిసింది. క్రితం రోజునే గోవర్ధన్ తల్లి మరణించింది.  బాబా శ్యామాను సరియైన సమయానికి పంపించారు.
భవిష్యద్వాణి.
ద్వారకానాధ్ అనే వ్యక్తి బాబా దర్శనం కోసం షిరిడీ వచ్చాడు.
అతను తన మామగారు శ్రీసాయిబాబాకు అందచేయమని ఇచ్చిన ఉత్తరాన్ని పట్టుకుని వచ్చాడు.
 ఆఉత్తరంలో ప్రధాన్ తన కూతురి అనారోగ్యం గురించి వ్రాశాడు.  ద్వారకానాధ్ ఆఉత్తరాన్ని బాబా చేతికిచ్చాడు.  బాబా దానిని తలక్రిందులుగా పట్టుకొని “ఆమె వెళ్ళిపోతున్నదన్నమాట” అంటూ గొణిగారు.
నేను (కాకాసాహె దీక్షిత్) ఆమాటలు స్పష్టంగా విన్నాను. కాని మిగతావారికి అంత స్పష్టంగా వినిపించలేదు.  తరువాత ఆఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించారు.  ఆఉత్తరం చదివిన తరువాత ద్వారకానాధ్ “బాబా, నాభార్యను ఎప్పుడు తీసుకుని రమ్మాంటారు” అని ఆడిగాడు.
అప్పుడు బాబా “ఇక నాలుగు రోజులలో ఆమే నావద్దకు వస్తుంది” అన్నారు. సరిగా నాలుగు రోజులకు ఆమె మరణించడం భక్తులందరకూ ఆశ్చర్యం కలిగించింది.

 సాయి బాబా …సాయి బాబా

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles