‘‘ముల్లోకాల్లోనూ మీరే! ముమ్మూర్తులూ మీరే’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

 

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

‘‘నన్నే ధ్యానిస్తూ కళ్ళు మూసుకో’’ చెప్పారు. చెప్పినట్టుగానే బాబాని ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు శ్యామా. ఏకాగ్రతగా బాబానే ధ్యానించసాగాడు.

కాస్సేపటికి అతని మనోనేత్రం తెరుచుకుంది. స్వర్గాన్ని చూశాడతను. అక్కడ సర్వత్రా బాబా ముఖమే కనిపించింది.

తర్వాత మర్త్యలోకాన్ని చూశాడు. బాబా ఉదరం, నాభి ప్రాంతం అనంతంగా కనిపించింది.

ఆ తర్వాత పాతాళాన్ని చూశాడు. బాబా పాదాలు రెండూ ఆ లోకం అంతటా నిండి కనిపించాయి.

దిక్కు తోచక బిక్కు బిక్కుమంటూ అక్కడ తిరుగుతున్న తనని, ఏదో అదృశ్యహస్తం పైకి లాగింది. ఊపిరి పీల్చుకున్నాడు శ్యామా. కళ్ళు తెరిచాడు. నవ్వుతూ బాబా కనిపించాడతనికి.

‘‘చాలు బాబా చాలు! ఈ జన్మకి నాకు ఈ అదృష్టం చాలు.’’ అన్నాడు శ్యామా.

‘‘ముల్లోకాల్లోనూ మీరే! ముమ్మూర్తులూ మీరే’’ అన్నాడు మళ్ళీ. శిరసు వంచి, పాదాభివందనం చేశాడు శ్యామా.

బాబా పాదాల మాటున తల దాచుకున్నాడు.

 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles