మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం నిజమా?



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

 

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

 

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

‘‘మీ నలుగురూ కూర్చోండి, నేను వడ్డిస్తాను.’’ అన్నారు బాబా. కూర్చున్నారు. గంగాలంలో అన్నం కొద్దిగానే మిగిలి ఉంది. దాన్ని సరిసమానంగా నాలుగు భాగాలు చేశారు బాబా. నలుగురికీ వడ్డించారు.

మొదటి ముద్దని కళ్ళకద్దుకున్నాడు శ్యామా. ‘మహాప్రసాదం’ అని నోటిలో పెట్టుకోబోతూ ఆగాడు.

బాబాకి అన్నం మిగల్లేదు. ఆయనేం తింటారు మరి? ఆ మాటే అడిగాడు శ్యామా.

‘‘నా ప్రసాదం నాకు ఉంది, అదిగో’’ అని చూపించారు. భిక్షాపాత్రలో రెండు మూడు రొట్టెలూ, ఇంత అన్నం ఉంది. వాటిని ఈగలూ, చీమలూ తింటున్నాయి. ఓ నల్లపిల్లి కూడా భిక్షని తింటోంది.‘‘అవి తినగా మిగిలితే, అది చాలు నాకు.’’ అన్నారు బాబా.

‘‘ముందు నువ్వు తిను’’ అన్నారు శ్యామాతో.అందరి భోజనాలూ అయ్యాయి. నల్లపిల్లి చిన్న ముక్క కూడా మిగలనివ్వక, పాత్రలోని భిక్షనంతా తినేసింది. తినేసి, తృప్తిగా నాలికను పెదాలకు రాసుకుందో లేదో బాబా ‘బ్రేవ్‌’న తేన్చారు. కడుపు నిండినట్టుగా పొట్ట నిమురుకున్నారు. భుక్తాయాసంతో కళ్ళు మూసుకున్నారు బాబా. గోడకి చేరబడ్డారు. నిశ్శబ్దంగా ఉంది. రొద చేస్తూ కందిరీగ తిరుగుతోంది, అంతే!

‘‘బాబా’’  అని పిలిచాడు శ్యామా.‘‘ఏమిటి శ్యామా?’’ అని కళ్ళు తెరిచారు బాబా.

‘‘చిన్న సందేహం బాబా! మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం నిజమా? ఈ జనన మరణాలకు అంతు లేదా? చేసుకున్న పాప పుణ్యాల ఫలితంగా జన్మలు ఉంటాయంటున్నారు. నిజమా బాబా’’ అడిగాడు శ్యామా.

సమాధానంగా ముందు సన్నగా నవ్వారు బాబా. తర్వాత ఇలా అన్నారు.‘‘మళ్ళీ మళ్ళీ పుట్టడం, మరణించడం ఇదంతా అబద్దం అంటారు హేతువాదులు. అర్థం లేనిదని కూడా కొట్టి పారేస్తారు. వారు కొట్టి పారేసినంత మాత్రాన అవి లేకుండాపోవు. ఉన్నాయి.

జన్మ జన్మలకూ సంబంధించిన ఓ కథ నీకు నేను చెబుతాను, విను.’’‘‘చెప్పండి బాబా’’ చేతులు జోడించాడు శ్యామా. కాశీరాం, తాత్యా, షిండేలు కూడా బాబా చెప్పేది వినేందుకు ఉత్సాహపడ్డారు. బాబాకి దగ్గరగా కూర్చున్నారు. వాళ్ళందరినీ నవ్వుతూ చూసి, తర్వాత ఇలా చెప్పసాగారు బాబా.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం నిజమా?

సాయినాథుని ప్రణతి

ఈ లీల చాలా బాగుంది బాబా స్వయంగా మనకు వండించడం నిజంగా మనం ఎంత దనయులం. అపుడు బాబా తన భక్తులకు వడించారు ఇపుడు మన గురువుగారు మనకు ఆ అవ్వకాశాని ఇచ్చరు.ప్రతిభ గారు తన అనుభవాలలో గురువుగారు కి తను వడించి నట్లు చెపారు.అలాగే నా ప్రండ్ మరియు గురుబందువు అయిన ఒకరు నాకు పొన్ చేసి చెపింది నా ప్రండ్ మావారికి గురువుగారు కలలోకోచ్చరు అంది ఆ కలలో తను గురువుగారికి వడ్డిచి నట్లు చెపింది నేను చాలా ఆనందించాను.ఒకసారి మావారికి గురువుగారితో కలిసి బోచేసే అవ్వకాశం ఇచ్చారని చెపారు ఈ లీల చదివితే ఇవ్వని గుర్తుతోస్తునాయి మనస్సుకు ఆనందం కలుగుతుంది.మనం గురువుగారి ద్వర అపుడు బాబాతో వాలు పొందిన అనుభవాలు పొందుతునాం.

prathibha sainathuni

Naku happy ga anipistundi..guruvugaru nato vaddinchukovadame kadu inkosari naku cake ,graps kuda swayamga ichharu guruvugaru…ammagaru naku srutiki annam kalipi tinipincharu…valla prema varninchadaniki matalu ravu…dasaganu varninchinattu dhak gayi meri rasana (ma manasu mugaboyindi )anipistuntundi aa prema talachukuntunnappudu….

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles