మళ్ళీ   ముంబై  వెళ్ళు,కానీ   ఈ  సారి షిర్డికి   వెళ్ళి   బాబా   దగ్గర   మొక్కుబడి   పెట్టుకో.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి   బ్రహ్మండనాయక   రాజాధిరాజ   యోగిరాజ  పరబ్రహ్మ   శ్రీ   సచ్చిదానంద   సద్గురు   సాయినాథ్   మహారాజ్   కీ   జై

సాయి రామ్

నేను  డెహ్రాడూన్  నివాసిని. సంపాదన   కోసం   ముంబై  సినిమా   రంగం కి   వచ్చాను.

ఇపుడు   నా   సంపాదన   పేరు ప్రతిష్టలు   అన్ని   సాయిబాబా కే   చెందుతాయి.

ఈ   భరత   భూమిలో  సాయి బాబా వారి అవతారము రావడం, మన   భారతియులందరూ చేసుకున్న   పూర్వజన్మ   పుణ్యం.

అది   1980వ   సంవత్సరం.మా   చిన్నాన్న   గుజరాత్ లో వుంటారు.బాబాకు   అనన్య   భక్తుడు.అయన   గుజరాత్ లో   ONGC లో   ఉద్యోగం   చేస్తారు.

సెలవులకు   మా   ఇంటికి వచ్చినపుడు   బాబా   గురించి   చెప్పేవారు.

ఒకసారి   మా   అమ్మ   నాన్న   గుజరాత్   వెళ్ళారు   మా   చిన్నాన్న దగ్గరికి   వచ్చెటపుడు   ఒక   సాయిబాబా   ఫోటో   తెచ్చారు.అపుడే మాకు   ముందు   బాబా   దర్మనం   అయింది.

అది   మా   డ్రాయింగ్   రూమ్ లో   గోడకు   పెట్టారు. నా   చదువు అయిపోయినాక   నేను   సినిమా   రంగంలో   పని   చేయాలని నిర్ణయించుకున్నాను. నా   అదృష్టాన్ని   పరీక్ష   చేసుకోవాలని   ముంబై   వచ్చాను.

ఇక్కడ   మనల్ని   మనం   నిరూపించుకోవడం   చాలా   కష్టం.

నేను   అలానే   నిరూపించుకోలేక   మనసులో   వేదనతో, దుఃఖంతో   మా   వూరికి   వెనక్కి   వెళ్ళిపోయినాను.అపుడు   మా అమ్మ   అనింది

“అరే   అంత  దుఃఖపడకు.మళ్ళీ   ముంబై  వెళ్ళు,కానీ   ఈ  సారి షిర్డికి   వెళ్ళి   బాబా   దగ్గర   మొక్కుబడి   పెట్టుకో.

అపుడు   అన్ని అవే   సర్దుకుంటాయి   అనింది.మా  వూరిలో   కొన్ని  రోజులు   వుండి   మళ్ళీ   ముంబై  వెనక్కి   వచ్చాను.

ఒక   రోజు   నేను   కొలాబాలో వున్నపుడు,ఆకస్మాతుగా   షిర్డీ   వెళ్దాం   అనిపించింది.

అయితే   షిర్డీ   ఎక్కడ   వుందో   నాకు   తెలీదు .అయినా   బస్సు స్టాండ్ కు  వెళ్ళాను.అడిగితే   అక్కడ,నా  ఎదురుగానే   షిర్డీ  వెళ్లే బస్సువుంది.

అపుడు   ౩౦  రూపాయిలు  టికెట్   తీసుకొని   బస్సులో  కూర్చున్నాను. అపుడు   నా దగ్గర   200  రూపాయిలు   మాత్రమే             వున్నాయి.

నేను   రాత్రి   8 గంటలకి   షిర్డీ   చేరుకున్నాను.ఎక్కడ   వుండాలి, అనుకుంటూ   వుండగా   పూల   మాలలు   అమ్మె   అబ్బాయి   వచ్చి   ఒక హోటల్ లో   రూమ్   చూపించారు.

30  రూపాయిలు రోజుకు, నేను స్నానం   చేసి   సమాధి   మందిర్ కు   వెళ్ళాను.

1988   సంవత్సరంలో   అక్కడ సాయిబాబా   దర్మనం   చేసుకున్నాక,మనసులో   ఆనందం పట్టలేక,కళ్ళల్లో   నీళ్లు   ఆపుకోలేక   బాబానే   చూస్తూ   అలాగే వుండిపోయాను,అపుడు   బాబాతో   అన్నా” నాకు   10 -12   రోజులు వుండాలని   వుంది

   హేసాయి,నన్ను   ఇక్కడే   వుండని ప్రభూ,అని   మొక్కుకున్నాను.

అపుడు   మళ్ళీ   అనుకున్నా, నా దగ్గర   పైసలులేవు,ఎలా   వుండను?అనుకోని   నిరాశగా   సమాధి మందిర్   నుంచి   బయటికి   వచ్చాను.

అంతే  ఆశ్చర్యం, నా ప్రియమైన   స్నేహితుడు   అక్కడ   వున్నాడు.నన్ను   చూసి, అరే నువ్వా   ఎపుడువచ్చావు , ఎక్కడవున్నావు?  అన్నాడు.

నేను హోటల్   గురించి   చెప్పాను.అరే   నీకు   నేను   రూమ్ చూపిస్తాను  రా   అని   సంస్థాన్   వాళ్ళ   రూంకు తీసుకెళ్ళాడు.అక్కడ   రూమ్   రెంట్   అపుడు   3 రూ   చూడండి బాబా   కృప    ఎలావుందో. 

ఇంకేముంది   ప్రతిరోజు   బాబా   దర్మనం.అలా  నేను   అనుకున్నట్లు   12   రోజులు   వున్నాను. అంటే   బాబా   నా   మనసులో   కోరిక మన్నించి   12   రోజులు   వుంచారు   షిర్డీ లో.ఇంకా   నాలో   బాబా మీద   విశ్వాసం  పెరిగింది.

నాకు  చాలా  అనుభవాలు,అనుభూతులు   ఇస్తు   వచ్చారు.అన్ని పంచుకోలేను.రోజుకొక   అనుభూతి.

ఇలా   మెల్లగా   సినిమా రంగంలో   స్దిరపడి పోయాను .గత   సంవత్సరం   జరిగిన అద్భుతం  చెబుతాను .

నేను   ఎపుడు   లోకండ   వాలా   దారి   నుంచి   మలాద్   వస్తాను. అక్కడ   దారిలో   మీడ్   చాకీ  అనే ప్రదేశము వస్తుంది.

అక్కడ   ఒక   చిన్న   బాబా   మందిరం   వుంది.నేను వెళ్ళిటపుడు   ప్రతి   రోజు   ఆ   మందిరంలో    బాగా   తుడిచి,శుభ్రం   చేసి   దీపం  పెట్టి, ఆ   నూనె   డబ్బా   ఒక   దగ్గర షాపులో   పెట్టి   వెళతాను.

ఆ   రోజు   కూడా   అలానే చేశాను.ఇంతలో   ఒక   పిచ్చివాడిలాగా   దుస్తులు వేసుకొని,చేతిలో   తర్చుజా   ముక్క   పట్టుకొని   ఒక   ఆయన అక్కడ   ఏదో   వెతుకుతున్నట్టు వున్నారు. 

నేను   అడిగాను. మీకు ఏమీ   కావాలి అని,   అతను   అడిగాను   కొంచెం   పైసలు ఇవ్వునాకు   అన్నారు. నేను   అన్నాను, ఏమిచేస్తావ్   పైసలతో అన్నాను. ఏదన్నా   తింటాను   అన్నారు.

నేనే   నీకు   ఏదన్నా పెడితే   తింటావా? అన్నాను. అతను   “హ!  తింటా”,అన్నారు. నేను   అతన్ని   తీసుకొని   వెళ్ళి  వడా – పావ్ తినిపించాలనుకున్నాను .

ఆ   రోజు   ఆశ్చర్యం   ఎక్కడ దొరకలేదు. పోనీ   రోటి-కూర   తింటావా?   అన్నాను.అతను   “హ” అన్నారు.

అక్కడ  దగ్గర లో చిన్న హోటల్ కి వెళ్ళాము మేము ఆర్డర్ చేసిన  రోటి మరియు కూర వచ్చింది. నేను   అతన్ని   తిను, అని   చెప్పి,2   రూపాయలు ఇచ్చాను,టీ   తగు   అని   ఒక   టీ  షాప్   చూపెట్టాను.

ఇంతలో   నా మొబైల్   ఫోన్లో   మెసేజ్   రింగ్ వచ్చింది .నేను  మెసేజ్ చదవడానికి    కొంచం    దూరం   వెళ్ళాను.

ఏదో   మనసులో   అలజడిగా   వుంది,చెప్పలేని   ఆనందంగా   వుంది, ఇంతలో   నేను   తల ఎత్తి     చూసేసరికి  సాక్షాత్   సాయినాథుడిలా ఆరంజ్   రంగు  కఫ్ని   తెల్లని   గడ్డం, మిలమిల లాడే  కళ్ళు  నా ముందర  నుంచి   మెల్లగా  వెళ్తున్నారు .

నేను   మనసులో “ఓం సాయిరాం”, అనుకున్నాను. అది  తననే   పిలుస్తున్నట్లు వెనక్కువచ్చి   నా   తల   మీద   చేయిపెట్టి   ఆశీర్వదించి “ఓం సాయిరాం” అన్నారు;

అపుడు   అతని   కళ్లలో   అద్వితీయమైన తేజస్సు   నేను   చూశాను.

ఇంతలో  ఆ   పిచ్చివాడు   తింటున్నాడా   అని  చేసే సరికి అతను లేడు,

నేను   వెంటనే ముందుకు   చూశా,సాయిబాబా   కూడాలేరు.ఇద్దరూ  ఒకేసారి అదృశ్యం   అయ్యారు.

నేను   ఒక   రైతు   కొడుకును.ఇపుడు సినిమా   ప్రొడ్యూసర్ ను.నా   సినిమా  ఒకటి “కౌన్   హీ   జో   సపనే  మి   ఆయా “. సినిమా   చాలా   రోజుల  వరకు   ఆగిపోయి  వుండినది.

నాకు   ఒకాయన   చెప్పారు  “స్వామి   సమర్థ”  గుడికి   వెళ్ళు   అన్ని   సర్దుకుంటాయి అని   చెప్పారు.

నేను   వెళ్ళాను.అక్కడ   స్వామీ   సమర్థ   బదులు   సాయిబాబానే   నాకా   దర్మనం   ఇచ్చారు.తరువాత   ఆ సినిమా   ఏ   అడ్డంకులు   రాకుండా   బాబా  చూసుకున్నారు.

ఆ సినిమాకి   అవార్డు   కూడా   వచ్చింది.మంచి  గుర్తింపు   కూడా   వచ్చింది.

తరువాత   నేను   స్టూడెంట్స్ కు   ఫిలిం   ఎలా   చెయ్యాలో   కూడా నేర్పించాను . ఇవన్ని   బాబా   కృప   వల్లనే   అయ్యాయి.

శ్రీ   సచ్చిదానంద   సద్గురు   సాయినాథ్   మహారాజ్ కీ   జై

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles